/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Tomato: మదనపల్లె మార్కెట్‌లో టమాటా రికార్డు మోత.. కిలో రూ.196 Yadagiri Goud
Tomato: మదనపల్లె మార్కెట్‌లో టమాటా రికార్డు మోత.. కిలో రూ.196

మదనపల్లె : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధర రికార్డు మోత మోగింది. శనివారం కిలో నాణ్యమైన టమాటా రూ.196 పలికింది. అత్యల్పంగా కిలో రూ.140 ధరను నమోదు చేసింది..

దీంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.

మదనపల్లె మార్కెట్‌కు శనివారం కేవలం 253 టన్నుల సరకు మాత్రమే వచ్చింది. బయట ప్రాంతాల్లో దిగుబడి లేకపోవడం,

మదనపల్లె ప్రాంతంలో సీజన్‌ చివరి దశ కావడం వంటి కారణాలతో ధరలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు.

మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం కిలో టమాటా రూ. 160 - రూ. 196, రెండవ రకం రూ.120 - రూ.156 వరకు పలికింది. 25 కేజీల బుట్ట ధర రూ.4500 - రూ 4900తో వ్యాపారులు కొనుగోలు చేశారు..

Bandi Sanjay: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌

దిల్లీ: భాజపా జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటుదక్కింది.

తెలంగాణ భాజపా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది..

జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ (తెలంగాణ), జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌, కార్యదర్శిగా సత్యకుమార్‌ (ఏపీ)ను కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

అలాగే, పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్‌ సంతోష్‌, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు..

Rottela Panduga: నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ.. తరలివస్తున్న భక్తులు

నెల్లూరు..

మతసామరస్యానికి ప్రతీకగా నిలచే రొట్టెల పండుగ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.. నెల్లూరులోని స్వర్ణాల చెరువు, బారాషహీద్‌ దర్గా వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు..

నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ రొట్టెల పండుగ జరగనుంది. పండుగలో భాగంగా నేడు సందన్ మాలి (సమాధుల శుభ్రం), రేపు గంధ మహోత్సవం, 31వ తేదీన రొట్టెల పండుగ,

ఆగస్టు 1వ తేదీన తహలిల్ ఫాతేహా (గంధం పంపిణీ), 2వ తేదీన పండుగ ముగింపు ఉంటాయి. కోరిన కోర్కెలు తీర్చే పండుగగా రొట్టెల పండుగ ప్రసిద్ధి..

కోరికలను కోరుకోవడం.. అవి నెరవేరితే.. మరుసటి ఏడాది రొట్టెలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.. ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె.. ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు.

వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేయడం భక్తుల నమ్మకంగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి ఈ పండుగలో పాల్గొంటారు..

Bhadrachalam : మహోగ్ర రూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాద్రి కొత్తగూడెం : గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు దాటేసింది..

భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఎటపాక మండలం రాయన్న పేట వద్ద.. నేషనల్ హైవే పై వరద నీరు పోటెత్తింది.

భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిషా ఛత్తీస్ గడ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక ములుగులో కూడా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది..

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

తిరుపతి :జులై 29

వీకెండ్ వచ్చేసింది. నేడు శనివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.కాగా

శుక్రవారం 69,378 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 28,371 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

వాటర్ ఫాల్స్,పర్యాటక ప్రాంతాలకు అనుమతి లేదు : కమీషనర్ రెమా రాజేశ్వరి

పెద్దపల్లి జిల్లా :జులై 28

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రాజెక్ట్ లు, డ్యామ్స్ చెరువులు, నాలలు, వాగులు నిండుగా ఉన్నాయి. అట్టి పర్యాటక ప్రాంతాలకు ప్రజలు ఎవ్వరు వెళ్లకూడదని రామగుండం సిపి రెమా రాజేశ్వరి వెల్లడించారు.

పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు.

ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు.

ప్రస్తుతం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కమిషనరేట్ పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, నాళాలు, వాగులు నిండుగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ వారి హెచ్చరికలు, సూచనలు చేసిన పట్టించుకోకుండా వాహనాలతో వరద నీటి నుండి దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్టి సాహసాలు చేయకూడదని ఆమె కోరారు.

శనివారం,ఆదివారం సెలవులు ఉన్నందున చాలా మంది పర్యాటకులు ఇతర ప్రాంతాల ప్రజలే కాకుండా, స్థానిక ప్రజలు కుడా వాటర్ పాల్స్, ప్రాజెక్ట్, పర్యాటక ప్రాంతాలను చూడడానికి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా

ప్రజల భద్రత మరియు ప్రాణా రక్షణ ను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్, డ్యామ్స్ పరిసరాల వద్దకు పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని, ఆమె అన్నారు.

సాధారణ పరిస్థితి వచ్చే వరకు పర్యాటక ప్రాంతాలకు ఎవరు వెళ్లకూడదని ప్రజలు పోలీస్ వారికి సహకరించగలరని సీపీ రేమా రాజేశ్వరి కోరారు.

"షా"హైదరాబాద్‌ పర్యటన రద్దు

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన రద్దయింది.

షెడ్యూల్‌ ప్రకారం ఆయన శనివారం హైదరాబాద్‌కు చేరుకుని జేఎస్ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం కావాల్సి ఉంది.

అయితే అనివార్య కారణాలతోఈ పర్యటన రద్దయినట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీ,సుభాస్ తెలిపారు...

SB NEWS

SB NEWS

వర్షాలు తగ్గిన బోధన ఎలా ❓️

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు శుక్రవారం కూడా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

ఇప్పటికే జూలై 20, 21, 26 తేదీల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించగా 22, 24, 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు పనిచేసినా దాదాపు 80 శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

జూలై 29న మొహర్రం సెలవు కాగా వర్షాలు, వరదల వల్ల నెలకొన్న ఇబ్బందులు కుదుటపడకపోతే జూలై 31 సైతం విద్యాసంస్థలు పనిచేయడం కష్టమని అధికారులు అంటున్నారు.

పాఠశాల విద్యాశాఖ వివరాల ప్రకారం ఇప్పట్లో సజావుగా బోధన సాగే అవకాశం లేదని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల స్కూళ్లలో కుండపోత వర్షాల వల్ల గదుల్లోకి, స్కూల్‌ ప్రాంగణాల్లోకి వరదనీరు చేరింది. దాదాపు 3 వేల స్కూళ్ల ఆవరణలో బురద పేరుకుపోయింది. 6,200 స్కూళ్లలో గోడలు చెమ్మపట్టడంతోపాటు విద్యుత్‌ బోర్డుల్లోకి నీరు చేరింది. 78 శాతం స్కూళ్లలో వర్షాలు తగ్గినా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ హాస్టళ్ల నుంచి చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. బడులు తెరిచినా గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల రవాణా వ్యవస్థ దెబ్బతిన్నందువల్ల వారంపాటు వారు తిరిగి రావడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో డెంగీ, మలేరియా, అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందువల్ల స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మండలస్థాయి ప్రకారం నివేదికలు తెప్పించుకోవాలని సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు.....

పార్లమెంట్‌లో కొనసాగుతోన్న వాయిదాల పర్వం..

దిల్లీ: ఈ వర్షాకాల సమావేశంలో మణిపుర్‌ అంశం పార్లమెంట్‌(Parliament)ను కుదిపేస్తోంది. తాజాగా ఇదే విషయమై విపక్ష ఎంపీల(opposition) నుంచి నిరసన వ్యక్తం కావడంతో రెండు నిమిషాలకే లోక్‌సభ వాయిదా పడింది..

దీనికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్‌ జోషి(Parliamentary Affairs Minister Pralhad Joshi) మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని తప్పుపట్టారు.

'వారు పార్లమెంట్‌లో శాంతియుత చర్చకు ముందుకురావడం లేదు. అలాగే బిల్లుల్ని ఆమోదించడానికి సహకరించడం లేదు. వారి నుంచి సూచనలు స్వీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

కానీ వారు మాత్రం ఉన్నట్టుండి అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చారు. వారు మణిపుర్‌కు సంబంధించిన వాస్తవాలు బయటకురావాలని కోరుకుంటే..

దానిపై చర్చించడానికి పార్లమెంట్‌కు మించి మంచి వేదిక లేదు' అని అన్నారు. మరోపక్క రాజ్యసభలోనూ ఇదే అంశంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది.

PSLV C56 Launch: 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది.

ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్‌ను మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ (ఎంఎస్‌టీ)కు తీసుకువచ్చారు.

అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్‌ శిఖరభాగాన అమర్చి.. హీట్‌షీల్డ్‌ క్లోజ్‌ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు.

29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది.

ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు..