/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: పలు గురుకుల విద్యాసంస్థలను సందర్శించిన పిపిఎల్ కమిటీ నాయకులు Mane Praveen
NLG: పలు గురుకుల విద్యాసంస్థలను సందర్శించిన పిపిఎల్ కమిటీ నాయకులు
నల్లగొండ: ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం పిపిఎల్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, గత వారం నుండి కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో.. ప్రభుత్వ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడం కోసం, శుక్రవారం పిపిఎల్ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ నాయకులు జిల్లాలోని పలు గురుకుల పాఠశాలలను కళాశాలను సందర్శించి ఆర్ సి ఓ అరుణకుమారి, వివిధ కళాశాలల పాఠశాలల ప్రిన్సిపాల్ లను, విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా పిపిఎల్ కమిటీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మాట్లాడుతూ.. వసతులన్నీ బాగానే ఉన్నాయని, అయితే అద్దె భవనాలలో ఉన్న పాఠశాలలకు కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పిపిఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి శ్రీనివాస్, నాయకులు బొజ్జ పాండు, నాగుల శ్రీనివాస్, నరసింహ, రాజు, గురుకుల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
ట్విట్టర్ ఇకనుండి 'X' గా కనపడనుంది
ట్విట్టర్ పిట్ట కనుమరుగయ్యింది. ట్విట్టర్ తన రూపాన్ని మార్చుకుంది.
బ్ల్యూ కలర్ లో కనిపించాల్సిన పిట్ట బొమ్మతో పాటు, ట్విట్టర్ అనే పేరును ఆ సంస్థ తొలగించింది. ఆ పిట్ట బొమ్మ స్థానంలో  'X'  అనే అక్షరం రూపంతో ఉన్న బొమ్మతో పాటు ట్విట్టర్ పేరును కాస్త 'X' గా మార్చారు. కొత్త లోగో, నలుపు నేపథ్యంలో తెలుపు శైలీకృత "X" గా కనపడనుంది.
ఇప్పటి నుండి ట్విట్టర్ X గా కనపడనుంది.
YBD: అభివృద్ధికి నోచుకోని రామన్నపేట ఎస్సి కాలనీ
యాదాద్రి జిల్లా, రామన్నపేట పట్టణ కేంద్రంలో ఉన్న ఎస్సి కాలనీ పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా వుంది అని బిఎస్పి మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా అన్నారు. రామన్నపేట మేజర్ గ్రామ పంచాయితీ లో సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఆశించిన మేరకు పట్టణ పారిశుద్ద్యం విషయంలో వెనుకబడి పోగా,  దానికి తగిన పురోగతి కనిపించకపోవడంతో ఎస్సి కాలనీ ప్రజలు ఆవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎందరు అధికారులు మారినా రామన్నపేట పట్టణ ఎస్సి కాలనీ ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని అన్నారు. ఆరంభంలో ఉన్న ఆర్భాటం ఆచరణలో తప్పటడుగులేస్తుందని, నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్సీ కాలనీ ని పట్టించుకోకపోవడం విడ్డూరం అని అన్నారు. ఎస్సి కాలనీ లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఆరోపించారు. వర్షాకాలంలో సరైన డ్రైనేజీ లేక నీళ్లు నిలవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి జిల్లా: కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసిన కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 08685 293312, 9121147135  అని తెలిపారు. వర్షాల పట్ల ప్రజలందరూ  అప్రమత్తంగా ఉండాలని, అనుకోని సంఘటన జరిగితే వెంటనే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయాలని కోరారు.
ప్రధాని మోడీ రైతులకు సబ్సిడీ మీద ఎరువులు అందిస్తున్నారు: కన్మంతరెడ్డి శ్రీదేవి
నల్లగొండ: పట్టణంలోని బొట్టుగూడలో గాయత్రి ట్రేడర్స్ నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి కృషి సమృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజస్థాన్ లోని శీఖర్ లో జరిగిన కార్యక్రమంలో రైతులకు అవసరం అయినా అన్ని వస్తువులు, ఎరువులు, విత్తనాలు ఒకే దగ్గర లభించేలా 1.25 లక్షల ప్రధాన మంత్రి కృషి సమృద్ధి కేంద్రాలను ఈ రోజు జాతికి అంకితం చేసారని తెలిపారు. ఈ సంవత్సరం ఇంకా 2 లక్షల కేంద్రాలు ఏర్పాటు అవుతాయని ప్రధాని చెప్పారు. ప్రధాని మోడీ 11 కోట్ల మంది రైతులకు ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చి ఆదుకున్నారన్నారు. ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధర పెరిగినా మన దేశంలో పెరగకుండా రైతులకు సబ్సిడీ మీద ఎరువులు అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
తుమ్మలపల్లి: ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందజేసిన నాగిళ్ల మారయ్య
నల్లగొండ జిల్లా మర్రిగూడెం: మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య 5000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ.. తన తండ్రి నాగిళ్ళ రోశయ్య జ్ఞాపకార్థం ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని  అన్నారు. కార్యక్రమంలో చెల్లం సుందర్ రావు, ఎంజాల యాదగిరి, చెల్లం శివ, మర్రిగూడ యూత్ సందీప్, హరీష్, జావిద్ తదితరులు పాల్గొన్నారు
ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందజేసిన దళిత రత్న నాగిళ్ల మారయ్య
నల్లగొండ జిల్లా మర్రిగూడెం: మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య గురువారం రూ. 5000 విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ.. తన తండ్రి నాగిళ్ళ రోశయ్య జ్ఞాపకార్థం ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని  అన్నారు.కార్యక్రమంలో చెల్లం సుందర్ రావు, ఎంజాల యాదగిరి, చెల్లం శివ, మర్రిగూడ యూత్ సందీప్, హరీష్, జావిద్ తదితరులు పాల్గొన్నారు
కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన మర్రిగూడ మండల గ్రామపంచాయతీ కార్మికులు
మర్రిగూడ: గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 22వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా, మండలం నుండి గ్రామపంచాయతీ వర్కర్స్..  వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నల్గొండ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వట్టిపల్లి హనుమంతు, ఊరిపక్క లింగయ్య, పెరుమాండ్ల మంజుల, పోలేపల్లి రాములు, నక్క నరసింహ, ఒంపు ముత్తమ్మ, సునీత, అమృత, సుజాత, పద్మ, యాదమ్మ, దుర్గమ్మ, లక్ష్మీకాంత్ మైలారం నరసింహ, రమణ తదితర కార్మికులు బయలుదేరారు.
'సమస్యల సుడిగుండంలో గురుకుల విద్యార్థులు': మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా, నార్కట్ పల్లి: ప్రభుత్వ గురుకుల హాస్టళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కొరవడంతో గురుకుల హాస్టల్స్ సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో ఉన్న ప్రభుత్వ గురుకుల హాస్టల్ ని వారు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ హాస్టల్లో అడుగు అడుగున సమస్యలు తిష్ట వేశాయన్నారు. ఏ హాస్టల్లో చూసినా వసుతుల కొరవడి, ప్రభుత్వం పర్యవేక్షణ లోపం వల్ల, గాడి తప్పిన నిర్వహణతో దైనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. రాత్రి వేళలో చలి వణికిస్తుండగా కనీసం దుప్పట్లు సైతం సరఫరా చేయలేదని విద్యార్థులు గజగజలాడుతున్నారని, కనీసం క్లాస్ రూం లల్లో బెంచీలు లేక కింద కూర్చుని చదువుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఉందని తెలిపారు. హాస్టల్లో గదులు తలుపులు కిటికీలు సక్రమంగా లేకపోవడంతో, అంటు వ్యాధులు ప్రబలే ఈ వర్షాకాలం లో సరైన పారిశుధ్యం పాటించక పోవడం వల్ల దోమల బారి నుండి తమనుతాము కాపాడుకునే మార్గం కానరాక చిన్నారులను నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక్క రూమ్ లో 20 మంది ఉండగా వారికీ పడుకోవడానికి ప్లేస్ లేక తరగతి గదిలో పడుకుంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టలో వంట గది, పిల్లలు తినడానికి డైనింగ్ హాల్ లేక విద్యార్థులు బయట, అక్కడే నిల్చోని తినే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేకుల షెడ్ తో డైనింగ్ హాలు ఏర్పరచగా దాని పహరి గోడ కూలి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ప్రతి ఒక్క హాస్టల్ కు సన్న బియ్యం పంపిస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎక్కడ పంపిస్తున్నారో చుపియాలన్నారు, జావ లో పురుగులు ఈగలు వస్తున్నాయని పిల్లలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని అన్ని హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి అన్నారు. గురుకులాల కు రావల్సినటువంటి నిధులు ఏ దొంగల జేబుల్లోకి పోతున్నయో బీఆర్ఏస్ పార్టీ కు ప్రతినిధి అయిన ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, నార్కట్ పల్లి మండల కార్యదర్శి మేడి వాసుదేవ్, మండల కోశాధికారి పాల మహేష్, చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో నాగం ఫౌండేషన్ సౌజన్యంతో.. వీర జవాన్ కుటుంబ సభ్యులకు సన్మానం
నాగం ఫౌండేషన్ సౌజన్యంతో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బిజెపి నాయకులు డా. నాగం వర్శిత్ రెడ్డి  బుధవారం నల్లగొండ పట్టణ కేంద్రంలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో, కార్గిల్ అమరవీరుల 24వ సంస్మరణ దినోత్సవ సందర్భంగా, కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ల చిత్రపటాలకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భరతమాత సేవలో వీరమరణం పొందిన నల్గొండ జిల్లాకు చెందిన వీర జవాన్ పోలోజు గోపయ్య చారి, వీర జవాన్ మిట్ట శ్రీనివాస్ రెడ్డి, వీర జవాన్ షేక్ ఇమామ్ గార్ల సైనికుల కుటుంబ సభ్యులకు షీల్డ్ లు బహుకరించి  వారిని సాదరంగా శాలువాతో సన్మానించి, వారికి  పాదాభివందనం చేసి మాట్లాడుతూ.. దేశ సేవ కోసం ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించే  కన్న బిడ్డలను భరతమాత కు అంకితమిచ్చిన తల్లిదండ్రుల గురించి ఎంత చేసినా ఎంత చెప్పిన తక్కువేనని అన్నారు. తమ వంతుగా వీర జవాన్ల కుటుంబీకులను సత్కరించుకోవడం ఎంతో గర్వంగా ఉందని  తెలిపారు. భరతమాత సేవ చేయడానికి యువత ముందు ఉండాలని సూచించారు.