పార్లమెంట్‌లో కొనసాగుతోన్న వాయిదాల పర్వం..
దిల్లీ: ఈ వర్షాకాల సమావేశంలో మణిపుర్ అంశం పార్లమెంట్(Parliament)ను కుదిపేస్తోంది. తాజాగా ఇదే విషయమై విపక్ష ఎంపీల(opposition) నుంచి నిరసన వ్యక్తం కావడంతో రెండు నిమిషాలకే లోక్‌సభ వాయిదా పడింది..
దీనికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి(Parliamentary Affairs Minister Pralhad Joshi) మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని తప్పుపట్టారు.
'వారు పార్లమెంట్‌లో శాంతియుత చర్చకు ముందుకురావడం లేదు. అలాగే బిల్లుల్ని ఆమోదించడానికి సహకరించడం లేదు. వారి నుంచి సూచనలు స్వీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
కానీ వారు మాత్రం ఉన్నట్టుండి అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చారు. వారు మణిపుర్‌కు సంబంధించిన వాస్తవాలు బయటకురావాలని కోరుకుంటే..
దానిపై చర్చించడానికి పార్లమెంట్‌కు మించి మంచి వేదిక లేదు' అని అన్నారు. మరోపక్క రాజ్యసభలోనూ ఇదే అంశంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది.











Jul 28 2023, 19:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.2k