భద్రాచలం వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి
భద్రాచలం జిల్లా:జులై 28
భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.
ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొన సాగుతున్నది. నదిలో మరోసారి వరద పెరుగు తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాగా, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. పేరూరులో ఉదయం 6 గంటలకు నీటిమట్టం 48.44 అడుగులకు పెరిగింది.
దీంతో వెంకటాపురం-భద్రాచలం రహదారి బ్రిడ్జిలపై వరద ప్రవహిస్తున్నది. అదేవిధంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది.
ఈనేపథ్యంలో టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నీటిప్రవాహం పెరగడంతో అధికారులు రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు...











Jul 28 2023, 14:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.2k