/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz ప్రధాని మోడీ రైతులకు సబ్సిడీ మీద ఎరువులు అందిస్తున్నారు: కన్మంతరెడ్డి శ్రీదేవి Mane Praveen
ప్రధాని మోడీ రైతులకు సబ్సిడీ మీద ఎరువులు అందిస్తున్నారు: కన్మంతరెడ్డి శ్రీదేవి
నల్లగొండ: పట్టణంలోని బొట్టుగూడలో గాయత్రి ట్రేడర్స్ నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి కృషి సమృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజస్థాన్ లోని శీఖర్ లో జరిగిన కార్యక్రమంలో రైతులకు అవసరం అయినా అన్ని వస్తువులు, ఎరువులు, విత్తనాలు ఒకే దగ్గర లభించేలా 1.25 లక్షల ప్రధాన మంత్రి కృషి సమృద్ధి కేంద్రాలను ఈ రోజు జాతికి అంకితం చేసారని తెలిపారు. ఈ సంవత్సరం ఇంకా 2 లక్షల కేంద్రాలు ఏర్పాటు అవుతాయని ప్రధాని చెప్పారు. ప్రధాని మోడీ 11 కోట్ల మంది రైతులకు ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చి ఆదుకున్నారన్నారు. ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధర పెరిగినా మన దేశంలో పెరగకుండా రైతులకు సబ్సిడీ మీద ఎరువులు అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
తుమ్మలపల్లి: ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందజేసిన నాగిళ్ల మారయ్య
నల్లగొండ జిల్లా మర్రిగూడెం: మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య 5000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ.. తన తండ్రి నాగిళ్ళ రోశయ్య జ్ఞాపకార్థం ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని  అన్నారు. కార్యక్రమంలో చెల్లం సుందర్ రావు, ఎంజాల యాదగిరి, చెల్లం శివ, మర్రిగూడ యూత్ సందీప్, హరీష్, జావిద్ తదితరులు పాల్గొన్నారు
ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందజేసిన దళిత రత్న నాగిళ్ల మారయ్య
నల్లగొండ జిల్లా మర్రిగూడెం: మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య గురువారం రూ. 5000 విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ.. తన తండ్రి నాగిళ్ళ రోశయ్య జ్ఞాపకార్థం ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని  అన్నారు.కార్యక్రమంలో చెల్లం సుందర్ రావు, ఎంజాల యాదగిరి, చెల్లం శివ, మర్రిగూడ యూత్ సందీప్, హరీష్, జావిద్ తదితరులు పాల్గొన్నారు
కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన మర్రిగూడ మండల గ్రామపంచాయతీ కార్మికులు
మర్రిగూడ: గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 22వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా, మండలం నుండి గ్రామపంచాయతీ వర్కర్స్..  వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నల్గొండ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వట్టిపల్లి హనుమంతు, ఊరిపక్క లింగయ్య, పెరుమాండ్ల మంజుల, పోలేపల్లి రాములు, నక్క నరసింహ, ఒంపు ముత్తమ్మ, సునీత, అమృత, సుజాత, పద్మ, యాదమ్మ, దుర్గమ్మ, లక్ష్మీకాంత్ మైలారం నరసింహ, రమణ తదితర కార్మికులు బయలుదేరారు.
'సమస్యల సుడిగుండంలో గురుకుల విద్యార్థులు': మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా, నార్కట్ పల్లి: ప్రభుత్వ గురుకుల హాస్టళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కొరవడంతో గురుకుల హాస్టల్స్ సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో ఉన్న ప్రభుత్వ గురుకుల హాస్టల్ ని వారు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ హాస్టల్లో అడుగు అడుగున సమస్యలు తిష్ట వేశాయన్నారు. ఏ హాస్టల్లో చూసినా వసుతుల కొరవడి, ప్రభుత్వం పర్యవేక్షణ లోపం వల్ల, గాడి తప్పిన నిర్వహణతో దైనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. రాత్రి వేళలో చలి వణికిస్తుండగా కనీసం దుప్పట్లు సైతం సరఫరా చేయలేదని విద్యార్థులు గజగజలాడుతున్నారని, కనీసం క్లాస్ రూం లల్లో బెంచీలు లేక కింద కూర్చుని చదువుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఉందని తెలిపారు. హాస్టల్లో గదులు తలుపులు కిటికీలు సక్రమంగా లేకపోవడంతో, అంటు వ్యాధులు ప్రబలే ఈ వర్షాకాలం లో సరైన పారిశుధ్యం పాటించక పోవడం వల్ల దోమల బారి నుండి తమనుతాము కాపాడుకునే మార్గం కానరాక చిన్నారులను నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక్క రూమ్ లో 20 మంది ఉండగా వారికీ పడుకోవడానికి ప్లేస్ లేక తరగతి గదిలో పడుకుంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టలో వంట గది, పిల్లలు తినడానికి డైనింగ్ హాల్ లేక విద్యార్థులు బయట, అక్కడే నిల్చోని తినే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేకుల షెడ్ తో డైనింగ్ హాలు ఏర్పరచగా దాని పహరి గోడ కూలి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ప్రతి ఒక్క హాస్టల్ కు సన్న బియ్యం పంపిస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎక్కడ పంపిస్తున్నారో చుపియాలన్నారు, జావ లో పురుగులు ఈగలు వస్తున్నాయని పిల్లలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని అన్ని హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి అన్నారు. గురుకులాల కు రావల్సినటువంటి నిధులు ఏ దొంగల జేబుల్లోకి పోతున్నయో బీఆర్ఏస్ పార్టీ కు ప్రతినిధి అయిన ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, నార్కట్ పల్లి మండల కార్యదర్శి మేడి వాసుదేవ్, మండల కోశాధికారి పాల మహేష్, చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో నాగం ఫౌండేషన్ సౌజన్యంతో.. వీర జవాన్ కుటుంబ సభ్యులకు సన్మానం
నాగం ఫౌండేషన్ సౌజన్యంతో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బిజెపి నాయకులు డా. నాగం వర్శిత్ రెడ్డి  బుధవారం నల్లగొండ పట్టణ కేంద్రంలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో, కార్గిల్ అమరవీరుల 24వ సంస్మరణ దినోత్సవ సందర్భంగా, కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ల చిత్రపటాలకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భరతమాత సేవలో వీరమరణం పొందిన నల్గొండ జిల్లాకు చెందిన వీర జవాన్ పోలోజు గోపయ్య చారి, వీర జవాన్ మిట్ట శ్రీనివాస్ రెడ్డి, వీర జవాన్ షేక్ ఇమామ్ గార్ల సైనికుల కుటుంబ సభ్యులకు షీల్డ్ లు బహుకరించి  వారిని సాదరంగా శాలువాతో సన్మానించి, వారికి  పాదాభివందనం చేసి మాట్లాడుతూ.. దేశ సేవ కోసం ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించే  కన్న బిడ్డలను భరతమాత కు అంకితమిచ్చిన తల్లిదండ్రుల గురించి ఎంత చేసినా ఎంత చెప్పిన తక్కువేనని అన్నారు. తమ వంతుగా వీర జవాన్ల కుటుంబీకులను సత్కరించుకోవడం ఎంతో గర్వంగా ఉందని  తెలిపారు. భరతమాత సేవ చేయడానికి యువత ముందు ఉండాలని సూచించారు.
నార్కట్ పల్లి: ఆర్ట్స్ కళాకారులకు అండగా ఉంటా - పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గం నార్కట్ పల్లి మండల కేంద్రంలో వెంకట్ ఆర్ట్స్ కళాకారుడు చింత వెంకట్ కు గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి కాలు విరిగిగింది. భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు బుధవారం, అనారోగ్యంతో ఇంటివద్దె ఉంటున్న వెంకట్ ను నార్కట్ పల్లిలోని వారి నివాసానికి వచ్చి, పరామర్శించి వారి ఆరోగ్య విషయాలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ. 5000 ఆర్థిక సహాయం అందజేసినారు. బొమ్మల ద్వారా, చేతిరాతల ద్వారా ఎంతో అద్భుతంగా రాసేటువంటి  ఆర్ట్స్ కళాకారులకు ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని, వారికి ఎటువంటి ఆపద వచ్చిన ఎల్లప్పుడూ చేదోడువాదోడుగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను ఆర్ట్స్, సుధా ఆర్ట్స్, మదన్ ఆర్ట్స్, బీమా ఆర్ట్స్, స్వామి ఆర్ట్స్, నరేష్ ఆర్ట్స్, తదితరులు పాల్గొన్నారు.
'బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల అడ్మిషన్లకు ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలి'
నల్లగొండ: బీసీ సంక్షేమ వసతి గృహాల అడ్మిషన్లకు ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలని, బీసీ విద్యార్థి సంఘం నలగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు చేరాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలని ఒక జీవో తీసుకురావడం జరిగిందనని, దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖలో లేని విధంగా బీసీ సంక్షేమ శాఖలో రూల్స్ ని తీసుకొస్తున్నారు. ఆన్లైన్ విధానాలతో ఎవరికి లాభం జరుగుతుందో అర్థం కావడం లేదు, కానీ విద్యార్థులకు మాత్రం ఇబ్బంది జరుగుతోందని అన్నారు. తక్షణమే ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యార్థులకు సరిపడా వసతి గృహాలు లేవు. కాబట్టి అదనంగా వసతి గృహాలను మంజూరు చేయాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగు నరేష్ గౌడ్, విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పొగాకు రవికుమార్, జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, తరుణ్ యాదవ్, మల్లేష్ యాదవ్, ముఖేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు
కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలి: సర్పంచ్ పాక నగేష్ యాదవ్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం: రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో.. లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్,  లెంకలపల్లి లో  మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు  కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని, కరెంట్ తీగలపై వాలిన చెట్లకు దూరంగా ఉండాలని, జల ప్రవాహాల దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉండాలని, తడి చేతులతో స్విచ్ బోర్డులను తాకవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు.
తెలంగాణలో పలువురు ఐఏఎస్ లకు బదిలీలు
TS: తెలంగాణలో పలువురు ఐఏఏస్ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్  నల్లగొండ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. వీరి స్థానంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బి. గోపిని నియమించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రాష్ట్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ చెక్కా ప్రియాంక  సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.. కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాకు అదనపు కలెక్టర్ గా బదిలీ అయ్యారు. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా జల్ద అరుణశ్రీ ని నియమించారు.