బట్లపల్లి గ్రామంలో టీబీ వ్యాధి పైన అవగాహన కార్యక్రమం
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండలం: ప్రభుత్వ ఆసుపత్రి నుండి మండల టీబి మరియు లెప్రసీ నోడల్ అధికారి ప్రేమ్ కుమార్, ఎస్టిఎస్ సూపర్వైజర్ సైదులు ఆధ్వర్యంలో సోమవారం బట్లపల్లి గ్రామంలో ఏసీఎఫ్ క్యాంపు మరియు నిక్షయ్ దివాస్ టీబి మరియు న్యూట్రిషన్ ప్రోగ్రాంలో భాగంగా.. గ్రామ ప్రజలకు టీబి వ్యాధి వ్యాపించే విధానం, లక్షణాలు గురించి వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా తెమడ పరీక్ష చేస్తారని చెప్పారు.
డాక్టరు సలహా మేరకు ఉచితంగా ఎక్స్ రే తీసి రోగ లక్షణాలను నిర్ధారణ చేసి, వ్యాధి నిర్ధారణ అయినవారికి ఉచితంగా మందులు ఇస్తారు. టీవీ వ్యాధిగ్రస్తులు తగిన పోషకాహారము అనగా పాలు, పండ్లు, గుడ్లు, చేపలు, చికెన్, మాంసం, ఆకుకూరలు, బెల్లం పట్టీలు ,పప్పు దినుసులు మొదలగు బలమైన ఆహారం తీసుకొనుటకు గాను వారికి ప్రభుత్వం నెలకు రూ. 500 చొప్పున ఆరు నెలలు మొత్తం వారికి రూ. 3000 వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.
6 నెలలు ఉచిత టీ బి మందులు ఇవ్వడం జరుగుతుందని, ప్రాథమిక దశలోనే వ్యాధి లక్షణాలకు చికిత్స తీసుకొని, ఆరోగ్యవంతులుగా మారి టీబి వ్యాప్తిని అరికట్టవచ్చును అని తెలిపారు. గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుటకు, గ్రామ ప్రజలు సహకరించాలని గ్రామ ప్రజలను ఉద్దేశించి సూపర్వైజర్ సైదులు, మండల నోడల్ పర్సన్ ప్రేమ్, ఎమ్ ఎల్ హెచ్ పి హార్దిక మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ విజయ, ఏఎన్ఎం సరితా బాయి, ఆశా మంజుల, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Jul 26 2023, 20:20