NLG: విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం: ఎస్ఎఫ్ఐ
నల్లగొండ జిల్లా, దేవరకొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైతుందని, విద్య అభివృద్ధికి నిధులు కేటాయించకుండా రాష్ట్ర విద్యారంగ ప్రగతి అగిపోయిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ విమర్శించారు.
నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘర్షణ సైకిల్ యాత్ర ఆదివారం దేవరకొండ కు వచ్చిన సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షా కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడులు మొదలై నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల లకు నోట్ బుక్ లు, యూనిఫామ్, పెట్టెలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయలేదని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇంటర్ విద్యార్ధులకు ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని, లెక్చరర్స్ లేరని గెస్ట్ లెక్చరర్స్ కు రెన్యూవల్ చేయలేదని, అన్నారు. గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, వర్షకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారనీ, సరైన సౌకర్యాలు లేక సరిపడా ముత్రశాలలు, మరుగుదొడ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారనీ తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచినట్లు ఆర్బాటాలు చేసి ఇప్పటీకీ పెంచిన మెనూ అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 24,000 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయలేదని, పాఠ్యపుస్తకాలు లేకుండా, టీచర్లు లేకుండ ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. హస్టల్స్ విద్యార్ధులకు నెలకు అబ్బాయిలకు 62/- రూపాయలు, అమ్మాయిలకు 100/- రూపాయలు కాస్మోటిక్ ఛార్జీలు మాత్రమే ఇస్తున్నారు. విద్యార్థులు తమ అవసరాల ఆ డబ్బులు ఎలా సరిపోతాయని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల దుస్థితి గురించి సాక్షతూ కెసిఆర్ మనుమడే ఈ మద్య చెప్పాడని విమర్శించారు. రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేసి కార్పోరేట్ ఫీజులు ఆరికట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్ షిప్స్ & రీయంబర్స్ మెంట్స్ 5,177 కోట్లు బకాయిలు ఉన్నాయని వాటిని తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ మహత్మ గాంధీ యూనివర్శిటీకి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకుంటే ఛలో హైదరాబాద్ కార్యక్రమాని కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ యాత్ర క్షేత్ర స్థాయిలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో స్థితిగతులు తెలుసుకోని, జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారు. లేని పక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన లు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రమావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్, కోర్ర సైదా నాయక్, రవిందర్, జగన్ రవి, అనిల్, వీరన్న, సాయి సంపత్, చంద్, నవదీప్, శ్రవణ్, రాహుల్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు
Jul 26 2023, 14:33