దివ్యాంగుల దేవుడు సీఎం కెసిఆరే:టి.వి.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్,వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి
మాట తప్పని మడమ తిప్పని సీఎం కెసిఆర్
దివ్యాంగుల దేవుడు సీఎం కెసిఆరే
దివ్యాంగులకు పెంచిన పింఛన్ 4016 రూ.జీవో అర్ టి నెంబర్ 25 జారీ.
--- టి.వి.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్,వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి సీఎం కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు..
ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు దివ్యాంగులను గుర్తించలేని విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను రక్షించడానికి,పెరుగుతున్న వయస్సుతో జీవనోపాధిని కోల్పోయిన దివ్యాంగులు,వృద్దులు,వితంతువులు,ఒంటరి మహిళలు,నేత,గీత,బీడీ కార్మికులందరూ మరియు ఇతరులు గౌరవప్రదమైన,సామజిక భద్రతతో కూడిన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2014లో ఆసరా పింఛన్ పథకం ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి తెలిపారు.
తెలంగాణ రాక ముందు 3,50,487 మంది దివ్యాంగులకు రూ.500 చొప్పున నెలకు 17.52 కోట్లు అందేవి.ప్రస్తుతం పెంచిన పింఛన్ ప్రకారం 5,11,656 మంది దివ్యాంగులకు రూ.4016 చొప్పున నెలకు 205 కోట్ల 48 లక్షల 10 వేల 496 రూపాయలు అందుతున్నాయని కోరారు.
దేశంలో ఎక్కడ లేని రీతిలో మన రాష్ట్రంలోనే దివ్యాంగులకు 3016రూ, నుంచి 4016 రూ. పింఛన్ ఇవ్వడం దేశంలోనే ఏకైక తెలంగాణ రాష్ట్రమని గొప్ప విషయమని చెప్పారు.పెరిగిన పింఛన్ తో రాష్ట్రంలోని దివ్యాంగులందరూ గౌరవంగా తమ బతుకులు సుఖ సంతోషాలతో జీవనం గడుపుతున్నామని,మాట తప్పని మడమ తిప్పని సీఎం కెసిఆర్,ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దివ్యాంగులకు పింఛన్లు పెంచమని జీవో జారీ అర్.టి నెంబర్ 25 జారీ చేయడం జరిగిందన్నారు.సీఎం కెసిఆర్ ఉన్నంత వరకు రుణపడి తమకు అండగా ఉంటామని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి ప్రత్యేకంగా సీఎం కెసిఆర్ కు,మంత్రులకు, మరియు రాష్ట్ర చైర్మన్ వాసుదేవరెడ్డికి కృతజ్ఞతలతో ధన్యవాదాలు దివ్యాంగ పక్షాన తెలుపుతున్నమన్నారు.
Jul 23 2023, 17:33