ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆశయ సాధనలో అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆశయ సాధనలో అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి.
- బకరం శ్రీనివాస్ మాదిగ
ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జ్
ఆగస్టు రెండో వారంలో మాన్యశ్రీ మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన మాదిగల విశ్వరూప మాహాసభను జయప్రదం చేయడానికై ఈనెల 30న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవన్లో నిర్వహించబోయే నాగర్ కర్నూల్ జిల్లా సన్నాహాక సదస్సును మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
శనివారం అచ్చంపేట నియోజకవర్గం స్థాయి సమావేశం ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ సౌట ఖాసిం అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ హాజరై మాట్లాడుతూ....
ఈదేశాన్ని 9సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వం 100 రోజుల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తా అన్న హామీని కనీసం పార్లమెంటులో 100 నిమిషాల పాటు కూడా మాట్లాడకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న మాదిగ మాదిగ ఉపకాలాలను అవమానిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తూ వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ బీజేపీని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చేనెల రెండో వారంలో దక్షిణ భారతదేశంలో 30 లక్షల మంది మాదిగ, మాదిగ ఉపకులాలతో హైదరాబాద్ గడ్డమీద బిజెపి పార్టీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ మహోత్తరమైనటువంటి న్యాయమైన ధర్మమైనటువంటి అంశానికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కవులు, కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో MRPS, MSP, MSF, నాయకులు బుక్కాపురం మహేష్, భరత్, ఆంజనేయులు, కొయ్యల వెంకటేష్, గుద్దటి ప్రవీణ్, చిట్టి గోరి పవన్, శ్రీకాంత్, చింతకుంట్ల నిరంజన్, కొమ్ము రాంప్రసాద్, రాజు, భగవంతు, మల్లేష్, సురేష్, రేనయ్య తదితరులు పాల్గొన్నారు.
Jul 23 2023, 14:59