తమ నిధులనుండి 10 లక్షల రూపాయలు వెచ్చించి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నవీకరించిన:ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. తమ నిధులనుండి 10 లక్షల రూపాయలు వెచ్చించి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్... నవీకరించిన మొదటి అంతస్తు భవనాన్ని.. ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ...
ఇక్కడికి వచ్చిన వారంతా పెద్దవారుఎంతో అనుభవం ఉన్నవారని .. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో .... ఎంతోమంది బలిదానాలు చేసినా... సంకుచిత రాజకీయాలతో తెలంగాణను అడ్డుకున్నారని... నేడు కేసీఆర్ నాయకత్వంలో.... అకుంఠిత దీక్షతో.. అహింసా పద్ధతులతో... మీ అందరి సహకారంతో.. చావు అంచుల వరకు వెళ్లి, ఢిల్లీ నాయకుల మెడలు వంచి.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని.. తెచ్చిన తెలంగాణాన్ని... బంగారు తెలంగాణగా దేశంలోనే అగ్రభాగాన నిలిపారని... కెసిఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు... అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నారని.. ఒకప్పుడు మూడు లక్షల టన్నుల ధాన్యం పండించలేని తెలంగాణ రాష్ట్రం ఈనాడు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే అగ్ర భాగాన నిలిచిందని... ఈరోజు దేశానికే తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించిందని తెలియజేశారు....
నల్లగొండలో మార్పు కోసం... శాసనసభ్యుగా తనను గెలిపించిన తర్వాత... కెసిఆర్ దత్తత తీసుకున్న నల్లగొండ ను 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి... సుందర నందన వనంగా తీర్చిదిద్దుతున్నామని... ఇప్పటికి కేవలం 25% పనులు మాత్రమే పూర్తయ్యాని మరో 75% పనులకు నిధులు కేటాయించబడి పనులు పురోగతిలో ఉన్నాయని... మరో రెండు సంవత్సరాల తర్వాత అవి పూర్తి అయ్యి నల్లగొండ రూపురేఖలే మారతావని తెలియజేశారు...
ఈ భవనం. నవీకరణ కోసం మరో 15 లక్షల రూపాయలు తమ నిధులనుండి మంజూరు చేస్తున్నట్టు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్... టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్.. రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు... వెంకటరెడ్డి, శంకర్ రెడ్డి... లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

 హైదరాబాద్ నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్ మెబిలిటీ కార్డుని తీసుకువచ్చే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ సంస్ధలు కార్యచరణ ప్రారంభించాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలుండే విధంగా ఈ కార్డు ఉండనున్నది.

 వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండాలి.. మంత్రి హరీష్ రావు సమీక్ష*
వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండాలి.. మంత్రి హరీష్ రావు సమీక్ష* 
 భారీ వర్షాలు... సెలవులు పొడిగించిన ప్రభుత్వం
భారీ వర్షాలు... సెలవులు పొడిగించిన ప్రభుత్వం
 భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు కోరారు.
భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు కోరారు.
 గుండెపోటు మరణాలపై షాకింగ్ విషయాలు బయటపెట్టిన జపాన్ సైంటిస్టులు
గుండెపోటు మరణాలపై షాకింగ్ విషయాలు బయటపెట్టిన జపాన్ సైంటిస్టులు
 ఎస్ బి ఐ వినియోగదారుల సేవా కేంద్రం సేవలు సద్వినియోగం జేసుకోవాలి
ఎస్ బి ఐ వినియోగదారుల సేవా కేంద్రం సేవలు సద్వినియోగం జేసుకోవాలి
 రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు
రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు 
 
Jul 23 2023, 08:04
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.5k