17వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె, మద్దతు తెలిపిన ప్రియదర్శిని
నకిరేకల్: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని నిరసన దీక్షలో పాల్గొని గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతు ప్రకటించారు. గ్రామ పంచాయతీ కార్మికులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ప్రజలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలపాలన్నారు.
గ్రామపంచాయతీ కార్మికులు ప్రజలు ఆరోగ్యంగా ఉంచడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం వారి శ్రమను గౌరవించకుండా కనీస వేతనం ఇవ్వకుండా, వారి శ్రమను దోచుకుంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చలకు ఆహ్వానించి, వెంటనే వాటి పరిష్కారం కోసం చొరవ చూపాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తడకా విజయ్, నకిరేకల్ మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కోశాధికారి మునుగోటి సత్తయ్య, గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్యదర్శి పబ్బతి శ్రీశేలం, మండల అధ్యక్షులు పల్స సైదులు , ఉపాధక్షులు రాంరెడ్డి, కార్యదర్శి కందికంటి ప్రకాష్, కోశాధికారి నకిరేకంటి మట్టపల్లి, గద్దల విమలమ్మా, శ్రీనివాస్, యాదయ్య, వెంకటమ్మ, అలివేలు, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు
Jul 22 2023, 14:20