/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz వర్షాలు కురుస్తున్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్ Mane Praveen
వర్షాలు కురుస్తున్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్

నల్లగొండ జిల్లా, హాలియా: అల్పపీడ ప్రభావం వలన వర్షాలు పడుతున్నందున, పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి తెలిపారు. పట్టణంలో వివిధ వార్డులలో శిథిలావస్థకు చేరిన గృహాలలో నివాసం ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తలు వహించాలని అన్నారు.
వర్షాభావ పరిస్థితుల వలన ఇంటి పైకప్పు మరియు గోడలు కూలడానికి సిద్ధంగా ఉన్న నివాసయోగ్యం లేని ఇళ్లలో  నివసించకుండా సురక్షిత ప్రాంతాల్లో నివాసం ఉండాలని ప్రజలను కోరారు.
TS: ఎస్సీ, ఎస్టీ గురుకులాల నూతన సెక్రెటరీ నవీన్ నికోలస్ కలిసిన పిపిఎల్ కమిటీ
హైదరాబాద్: ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం నల్లగొండ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్టీ, ఎస్టీ గురుకులాల సెక్రెటరీ నవీన్ నికోలస్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి మెమొంటోను అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. గురుకులాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించి, నిరంతరం శ్రమించి తోడ్పాటునందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిపిఎల్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మచ్చ నరసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మరియు ఇతర రాష్ట్ర నాయకులు, పిపిఎల్ నల్లగొండ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహిత కు.. బీఎస్పీ ఆధ్వర్యంలో సన్మానం
రామన్నపేట: మండల బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రామన్నపేట సూర్య ప్రభంజనం  ఎడిటర్ గృహంలో, బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి ప్రియదర్శిని,నియోజకవర్గ ఉపాధ్యక్షులు  పావిరాల నర్సింహా యాదవ్ ఆధ్వర్యంలో సూర్య ప్రభంజనం ఎడిటర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత ఏటెల్లి శ్రీనివాస్ ను పూలమాలలు శాలువలతో ఘనంగా సత్కరించారు.
రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  మండల పార్టీ అధ్యక్షులు మేడి సంతోష్, ఉపాధ్యక్షులు  గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, కోశాధికారి గట్టు రమేష్, నాయకులు బెల్లి మల్లయ్య యాదవ్, నకిరేకంటి స్వామి, బొడ్డు నవీన్, మేడి తేజ, మేడి చందు, నకిరేకంటి హరీష్, మేడి నిఖిల్, గొర్ల నర్సింగరావు , మేడి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు
NLG: దోమల మందును పిచికారి చేపించిన కౌన్సిలర్  గడిగ హిమబిందు శ్రీనివాసులు
నల్లగొండ: మున్సిపాలిటీలోని  18వ వార్డులో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, వార్డులోని ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండడానికి, శుక్రవారం మురికి నీరు నిల్వ ఉన్న పలు చోట్ల మరియు ఓపెన్ నాలా లలో దోమల నివారణ కొరకు దోమల మందును,  కౌన్సిలర్  గడిగ హిమబిందు శ్రీనివాసులు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  అన్నారు.
Mane Praveen

నల్లగొండ జిల్లా, మునుగోడు: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, టీపీసీసీ అధికార ప్రతినిధి మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాల్వాయి స్రవ

భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి: పాల్వాయి స్రవంతి
నల్లగొండ జిల్లా, మునుగోడు: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, టీపీసీసీ అధికార ప్రతినిధి మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాల్వాయి స్రవంతి గురువారం ప్రజలకు పలు సూచనలు చేశారు.
సుర్వి లింగస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా: తాటి చెట్టుపై నుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన రామన్నపేట మండలంలోని నీర్నెముల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... సుర్వి లింగస్వామి గౌడ్ (47) అనే గీత కార్మికుడు తన దిన చర్యలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో, ఈదురుగాలులు రావడంతో చెట్టు పై నుంచి జారిపడి గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఈ సందర్భంగా బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని  మాట్లాడుతూ.. కులవృత్తిని నమ్ముకుని బతుకు వెళ్లదీస్తున్న కార్మికుడు ఆకస్మాత్తుగా మృతి చెందడంతో వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. అతనికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ప్రభుత్వం వెంటనే, బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్సిగ్రేషియా ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు.
భారీ వర్షాలు ఉన్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రియదర్శిని మేడి

నల్లగొండ జిల్లా, నకిరేకల్: భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు, నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరారు. ప్రజలు సాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డ్రైనేజీ కాలువలు, చెరువులు, వాగులు, వంకల వద్దకు ప్రజలు వెళ్లకూడదని పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఎక్కడైనా ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకూడదని చెప్పారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వీలైనంత సహకారాలు అందించాలని అన్నారు. బిఎస్పి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
లక్ష రూపాయల ఎల్ఓసి అందించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామానికి చెందిన కాటగోని ముత్యాలు అనారోగ్య కారణంగా, లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేశ్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కలువగా, ముందస్తు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 1,00,000 రూపాయల ఎల్ఓసి ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ మరియు గ్రామస్తుడు కాటగోని ముత్యాలు,  ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటగోని రాజు, రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
TS: నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు
బ్రేకింగ్ న్యూస్: నేడు, రేపు తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  నేడు, రేపు అనగా గురు, శుక్ర వారాలు ఈ రెండు రోజులు సెలవులు ప్రకటించారు.


ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటికే పాఠశాలకు, కళాశాలకు బయలుదేరిన విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి ఇంటిదారి పడుతున్నారు.
శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ
HYD: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని టిఎస్ ఆర్టీసి   బుధవారం ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్‌.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి ద‌ర్శ‌నంతో పాటు పాతాళ‌గంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది.

ప్రతి శనివారం ఉదయం ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్‌ లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్‌ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్‌లో బస ఉంటుంది.  రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్‌ పూర్తవగానే హోటల్‌ చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది.


రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం  ప్యాకేజీలో చేర్చబడింది. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాలి.


ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది.


భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలి. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ http://tsrtconline.in లోకి వెళ్లి టికెట్లను బుకింగ్‌ చేసుకోవాలి. ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ ఐపీఎస్‌ సూచించారు.