/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz భారీ వర్షాలు... సెలవులు పొడిగించిన ప్రభుత్వం Miryala Kiran Kumar
భారీ వర్షాలు... సెలవులు పొడిగించిన ప్రభుత్వం

భారీ వర్షాలు... సెలవులు పొడిగించిన ప్రభుత్వం

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది.

జిహెచ్ఎంసి పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రవేటు సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు కోరారు.

వరుసగా కురుస్తున్న వర్షాలకు

ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లను నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డ్రైనేజీ కాలువలు చెరువులు వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లకూడదని పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకూడదని చెప్పారు.

అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వీలైనంత సహకారాలు అందించాలని ఆదేశించారు.....

గత రెండు మూడు రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రభుత్వ పాటశాలలకు తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించడం జరిగింది...వర్షాలు ఇంకా రెండు మూడు రోజులు కురిసే అవకాశం ఉన్నందున పిల్లలను తల్లితండ్రులు బయటికి వెళ్లకుండా చూసుకోవాలని విద్యుత్ స్తంభాలను తాకకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు

గుండెపోటు మరణాలపై షాకింగ్ విషయాలు బయటపెట్టిన జపాన్ సైంటిస్టులు

గుండెపోటు మరణాలపై షాకింగ్ విషయాలు బయటపెట్టిన జపాన్ సైంటిస్టులు

ప్రస్తుతం గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన వేకిచ్చిస్తున్న వేళ జపాన్ సైంటిస్టులు చేసినా అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డయీ.

ఉదయం తో పాటు రాత్రి కూడా పళ్ళు తోముకోపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు.

పగటిపూట దంతాలపై పేరుకుపోయిన ఫలకం ద్వారా బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుందని, ఇది గుండె జబ్బు వచ్చేందుకు దోహదం చేస్తుందని స్పష్టం చేశారు.

ఎస్ బి ఐ వినియోగదారుల సేవా కేంద్రం సేవలు సద్వినియోగం జేసుకోవాలి

ఎస్ బి ఐ వినియోగదారుల సేవా కేంద్రం సేవలు సద్వినియోగం జేసుకోవాలి

- హలియా ఎస్ బి ఐ బ్రాంచ్ మేనేజర్ రాంబాబు

 

వినియోగదారుల సేవా కేంద్రం సేవలను అందరూ వినియోగించుకోవాలి అని హాలియా ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ రాంబాబు అన్నారు. బుధవారం హాలియాలో నరేష్ కంప్యూటర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఎస్ బి ఐ ఖాతాదారుల సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సేవ కేంద్రం లో నగదు డిపాజిట్ ఉపసంహరణ సేవలతో పాటు కేవైసీ సౌకర్యం, బీమా సేవలు పాస్ బుక్ ప్రింటింగ్ కూడా అందుబాటులో ఉంటాయని నూతన ఖాతాలు కూడా తెరవబడునని ఇలాంటి సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన అన్నారు కార్యక్రమంలో నల్లగొండ ఎస్బిఐ ఎఫ్ఐ మేనేజర్ శ్రీకాంత్ పే పాయింట్ అధికారి కంకు నరేష్, నరేష్ కంప్యూటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నరేష్, సేవా కేంద్రం నిర్వాహాకుడు ఆదిత్య స్టాఫ్ మల్లికార్జున్ మహేశ్వరి మురళి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు* *ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులు

రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు.

వైద్య సేవల పరిమితి రూ.3 లక్షలు పెంపు

సీఎం ఫొటో.. ప్రభుత్వ లోగోతో కొత్త డిజైన్‌

క్యూఆర్‌ కోడ్‌తో కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

రోగుల నమోదుకు ఫేస్‌ రికగ్నిషన్‌ విధానం

వరంగల్‌ ఎంజీఎంలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో హరీశ్‌రావు

హైదరాబాద్‌, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం త్వరలో అందించనున్న ఆరోగ్య శ్రీ కార్డు ముందుభాగంలో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, లింగం, కార్డు నంబర్‌ వంటి ప్రాథమిక వివరాలు ఉండనున్నాయి. ప్రభుత్వ లోగో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ లోగో, సీఎం కేసీఆర్‌ ఫొటో ముద్రించనున్నారు. స్కాన్‌ చేస్తే సమగ్ర వివరాలు తెలిసేలా క్యూఆర్‌ కోడ్‌ను కూడా కార్డ్‌పై ముద్రిస్తారు. వెనకభాగంలో ఆరోగ్యశ్రీ ఉపయోగాలు ఉంటాయి.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు

లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేసేందుకు ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

నిమ్స్‌ స్పెషల్‌ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహించాలి.

బయోమెట్రిక్‌ విధానంలో ఆరోగ్యశ్రీ రోగుల ఇబ్బందుల రీత్యా ఫేస్‌ రికగ్నైజేషన్‌ను అందుబాటులోకి తేవాలి.

ఆన్‌లైన్‌ పర్యవేక్షణతో మరింత నాణ్యమైన డయాలసిస్‌ సేవలను అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేందుకు అనుమతి.

కరోనా సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీలు విజయవంతంగా నిర్వహించిన కోఠి ఈఎన్టీ దవాఖానకు రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలి.

మూగ, చెవిటి పిల్లలకు హైదరాబాద్‌ కోఠి ఈఎన్టీ దవాఖానలో ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలను వరంగల్‌ ఎంజీ ఎంలోనూ అందుబాటులోకి తేవాలని బోర్డు నిర్ణయించింది. సమావేశంలో హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీపీహెచ్‌ శ్రీనివాస్‌రావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ కానుక’ దరఖాస్తులకు రేపు తుది గడువు

‘కేసీఆర్‌ కానుక’ దరఖాస్తులకు రేపు తుది గడువు 

మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేసేందుకు ప్రభుత్వం తెచ్చిన కేసీఆర్‌ కానుక పథకం దరఖాస్తులకు గురువారంతో గడువు ముగియనున్నది. అత్యంత నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది. వీటిలో క్రిస్టియన్‌ మైనార్టీ మహిళలకు 2 వేలు, ఇతర మైనార్టీ మహిళలకు 18 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నట్టు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తెలిపింది.

ఈ పథకానికి 21-55 ఏళ్ల వయసు ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయంతో తెల్లరేషన్‌ కార్డు కలిగిన నిరుపేద మైనార్టీ మహిళలు అర్హులు. ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హతల పత్రాలు, పాస్‌ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ అధికారులు సూచించారు.

పండ్ల తోటలకూ ఆర్థిక సాయం నెలాఖరులోగా లబ్ధిదారుల గుర్తింపు

★ పండ్ల తోటలకూ ఆర్థిక సాయం

★ ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు 

   రైతులకు చాన్స్‌

★ నెలాఖరులోగా లబ్ధిదారుల గుర్తింపు

★ సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం

★ ఉపాధిహామీ, పీఎంకేఎస్‌వైతో 

   అనుసంధానం 

★ ఈ ఏడాది లక్ష్యం 50 వేల ఎకరాలు

ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు అవసరమైన పెట్టుబడిని కూడా రైతులకు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 31 నాటికి లబ్ధిదారుల ఎంపిక, పండ్ల మొక్కలు నాటడం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఐదు ఎకరాల లోపు భూమి, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డ్‌ ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులను లబ్ధిదారులుగా ఎంపికచేయనున్నారు.

పండ్ల తోటల పెంపకానికి అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇందుకు ఉపాధిహామీ, పీఎంకేఎస్‌వై పథకాలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. డ్రిప్‌ ఇరిగేషన్‌కు అయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవన శాఖ అధికారులు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారు. ఆయా శాఖల పరిధిలోని అంశాలను పరిష్కరిస్తారు. పండ్ల తోటల్లో అంతర్‌ పంటలు వేసుకునే అవకాశం ఉండటంతో రైతులకు రెండు రకాలుగా ఆదాయం లభిస్తుంది. సంప్రదాయ పంటలతో ఒక్కోసారి రైతులు నష్టపోతున్నారు. ఒకేరకమైన పంటలు పండించడం వల్ల బహిరంగ మార్కెట్‌లో ధరలు పడిపోవడం జరుగుతుంటాయి. వాటన్నింటికి పరిష్కారంగా ఉద్యాన పంటలను సాగు చేయించాలని నిర్ణయించారు.

మార్గదర్శకాలు

------------------------------

★ ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డ్‌లు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులు, చిన్న, సన్నకారు రైతులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు.

★ బతికిన ప్రతి మొక్కకు మూడేండ్లపాటు నెలకు రూ.10 చొప్పున వాచ్‌ అండ్‌ వార్డు కోసం చెల్లిస్తారు.

★ గుంతలు తీయడం, మొక్కలు నాటడం ఉపాధిహామీ కూలీలతో చేయిస్తారు.

★ లబ్ధిదారుడికి మట్టి నమునా చార్జీలు చెల్లిస్తారు.

★ డ్రిప్‌ ఇన్‌స్టాలేషన్‌కు అయ్యే ఖర్చు చెల్లిస్తారు. దీనిలో ఎస్సీ, ఎస్టీలకు 100% సబ్సిడీ ఇస్తారు. చిన్న, సన్నకారు రైతులు 90% సబ్సిడీ ఇస్తారు.

★ మొక్కల ఎరువులకు మూడేండ్లపాటు డబ్బులు చెల్లిస్తారు. ఒక్కో చెట్టుకు సంవత్సరానికి రూ.50 చెల్లిస్తారు.

★ ప్రతి లబ్ధిదారునికి గరిష్ఠంగా ఐదు ఎకరాల వరకు మాత్రమే ఉండాలి.

★ లబ్ధిదారులు మొకలను ప్రభుత్వ నర్సరీల ద్వారా కానీ రిజిస్టర్డ్‌ ప్రైవేట్‌ నర్సరీల ద్వారా గాని కొనుగోలు చేయవచ్చు.

నల్గొండలో ఘనంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా, మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు.. సర్వ మత ప్రార్థనలు నిర్వహించి, మంత్రి జగదీష్ రెడ్డి ని,ఆశీర్వదించిన మత పెద్దలు...

పాల్గొన్న..zp చైర్మన్ బండ నరేందర్ రెడ్డి...స్థానిక mla కంచర్ల భూపాల్ రెడ్డి.. mp లింగయ్య యాదవ్...mla dr. గాదరి కిషోర్ కుమార్.. mla చిరుమర్ధి లింగయ్య, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,, వైస్ ఛైర్మన్ అబ్బాగోని రమేష్..గ్రంధాలయా చైర్మన్ మల్లికార్జున రెడ్డి.. కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు.. ముఖ్య నాయకులు.

నల్లగొండ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.

నల్లగొండ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యం.

మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి...

నల్లగొండను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 38వ వార్డులో రెండు లక్షల వ్యయంతో హైమాక్స్ లైట్లు ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో కనివిని ఎరుగని రీతిలో నల్గొండ పట్టణం ఎంతో అభివృద్ధి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ అబ్బగోనీ రమేష్, కౌన్సిలర్ బోయినపల్లి శ్రీను, నాయకులు గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, కాసం శేఖర్ తదితరులు ఉన్నారు..

నంది అవార్డు గ్రహీత పెరుమాళ్ళ కుమారి గారికి నల్గొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

నంది అవార్డు గ్రహీత పెరుమాళ్ళ కుమారి గారికి ఘనంగా సన్మానం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 

నేడు నల్గొండ జిల్లా అంబేద్కర్ భవనం నందు నంది అవార్డు గ్రహీత పెరుమాళ్ళ కుమారి గారికి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది పెరుమాళ్ళ కుమారి గారు కరోనా సమయంలో పేద ప్రజలకు ఎంతో అండగా వుండి మనం ఫౌండేషన్ ద్వారా లేదా విద్యార్థులకు పేద ప్రజలకు అనాధాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు ఎన్నో సహాయ సహకారాలు 2017 నందు దళితరత్న అవార్డు గ్రహీత చేస్తున్న దృశ్య వారికి జాతీయ పురస్కారాల్లో భాగంగా నంది అవార్డు ఇవ్వడం పట్ల హర్షిస్తూ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ cholleti ప్రభాకర్ గారు రిటైర్డ్ ఎస్ డబ్ల్యూ షణ్ముఖ గారు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి గారు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కత్తుల జగన్ సత్యశోధక్ సమాజ్ జిల్లా అధ్యక్షులు గదే లింగస్వామి బీఎస్పీ సీనియర్ నాయకులు రంగాపూరి యాదయ్య 

sc st విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ప్రజలకు సేవ చేయాలని మరిన్ని అవార్డులు రావాలని తెలిపారు మాతంగి లింగస్వామి పెరిక అంజయ్య కట్టెల మహేష్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ ఇంచార్జ్ కుడుతాల నాగరాజు mrps అధ్యక్షులు కత్తుల సందీప్ సన్నీ అధ్యక్షులు అల్లంపల్లి కొండల్ గంట సుమన్ mrps మస్రం వెంకన్నరమేష్ వెంకన్న కిన్నారా విజ్ఞాన్ వంగూరు బన్నీ  కత్తుల సాయికిరణ్ పాల్గొన్నారు.