/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: నాగం ఫౌండేషన్ సౌజన్యంతో భోజనాలు ఏర్పాటు చేసిన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి Mane Praveen
NLG: నాగం ఫౌండేషన్ సౌజన్యంతో భోజనాలు ఏర్పాటు చేసిన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి

నల్లగొండ: పట్టణ కేంద్రంలో జే ఎస్ గార్డెన్ లో ఈ రోజు జరిగిన జాతీయ వికలాంగుల హక్కుల పోరాట సమితి సదస్సు కు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ  విచ్చేసినారు.


ఇట్టి సదస్సుకు విచ్చేసిన పన్నెండు వందల మందికి బోజనాలు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో  బిజేపి నాయకులు డా. నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని వారితో పాటు సహపంక్తి భోజనం చేశారు.
అనంతరం నాగం హాస్పిటల్ కు విచ్చేసిన మంద కృష్ణ  మాదిగ ను,  డాక్టర్ వర్షిత్ రెడ్డి శాలువతో సత్కరించి పూల బొకే ఇచ్చి సాదరంగ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. నాగం ఫౌండేషన్ ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని డా. నాగం వర్శిత్ రెడ్డిని ప్రశంసించారు.

ప్రధాని నరేంద్ర మోడీ  తొమ్మిదేళ్ల పరిపాలనను ఉద్దేశించి ప్రచురించిన పుస్తకాన్ని మందకృష్ణ మాదిగ కు నాగం వర్షిత్ రెడ్డి బహికరించారు.
NLG: ఉమెన్స్ కాలేజీలో అతిధి అధ్యాపకుల పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం
నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకాల కోసం అర్హులైన అధ్యాపకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

వివిధ విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా...
కంప్యూటర్ సైన్స్ - 5, వక్షశాస్త్రం- 1
రాజనీతి శాస్త్రం ఉర్దూ మీడియం - 1,
చరిత్ర ఉర్దూ మీడియం- 1,  తెలుగు - 5,
ఇంగ్లీష్ - 1, కామర్స్- 2, కలవు.

ఈ నెల 20 నుండి 24 వ తేదీ వరకు సాయంత్రం గం. 4: 30  వరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.

పీహెచ్డీ గల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత మరియు టీఎస్ సెట్ అభ్యర్థులకు రెండవ ప్రాధాన్యత ఇవ్వబడును. అర్హులైన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష  ఈ నెల 26న కళాశాలలో నిర్వహిస్తారని తెలిపారు.
NLG: ఎన్జీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల యందు 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను, ఖాళీగా ఉన్న అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని, కళాశాల ప్రిన్సిపాల్ ఘన్ శ్యామ్  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పీజీ డిగ్రీలో 55 శాతం మార్పులు ఉన్న ఉన్నవారు అర్హులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు ఉన్నవారు అర్హులు.


నెట్/ స్లెట్ /పిహెచ్డి మరియు బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఆంగ్లం 03, తెలుగు 03, వాణిజ్య శాస్త్రం 02, బిబిఏ 02, డాటా సైన్సు 01, గణితశాస్త్రం 01, బయోటెక్నాలజీ 01, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ 07, స్టాటస్టిక్స్ 01, టాక్సేషన్ 01 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను కళాశాల కార్యాలయంలో ఈనెల 24 లోపు అందజేయాలని తెలిపారు.


దరఖాస్తుకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లను జత చేయాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 26వ తేదీ ఉదయం గం. 10:30 లకు కళాశాలలో ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు.
మైలారం రాములు తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పాల్వాయి స్రవంతి
యాదాద్రి జిల్లా, నారాయణపురం: మాజీ ఉపసర్పంచ్ మైలారం రాములు తండ్రి ఇటీవల అనారోగ్య కారణంతో ఆసుపత్రిలో చికిత్స పొంది, తిరిగి ఇంటికి  వచ్చిన విషయం తెలుసుకొన్న టిపిసిసి అధికార ప్రతినిధి, మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పాల్వాయి స్రవంతి బుధవారం మైలారం రాములు నివాసంలో వారి తండ్రిని పరామర్శించి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
success story: ఒక దినసరి కూలీ.. పట్టుదలతో చదివి పిహెచ్డీ సాధించింది

AP: ఆమె ఒక దినసరి కూలీ, అయితేనేం.. పట్టుదలతో చదివి ఆమె కెమిస్ట్రీలో పీహెచ్డీ పట్టా సాధించింది. ఆమె పేరు సాకే భారతి.  సోమవారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రాంగణమంతా స్నాతకోత్సవ సందడి అలముకుంది. వేదిక పసిడి కాంతులు పులుముకుంది. కార్యక్రమానికి ఛాన్సలర్‌ హోదాలో ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.


అంతా హడావిడిగా ఉండటంతో వేదిక దిగువ నుంచి వెదజల్లుతున్న మట్టి పరిమళాలను ఎవరూ గుర్తించలేకపోయారు. కొంత సమయం తరువాత మైకులో సాకే భారతి అనే పిలుపు వినిపించింది. మోడరన్ దుస్తులు ధరించిన అమ్మాయి వేదికపైకి వస్తుందనుకున్నారంతా. కానీ.. అలా జరగలేదు.


పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురితో కలిసి వచ్చింది సాకే భారతి. అరిగిపోయిన హవాయి చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలూ, అతిథుల ముఖాల్లో ఒకటే ఆశ్చర్యం. పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేస్తూ నడిచొస్తున్న ఆ చదువుల సరస్వతిని చూసి అబ్బుర పడ్డారంతా. పీహెచ్‌డీ పట్టా ఆమె చేతుల్లో చేరి కాంతులీనింది. అప్రయత్నంగా చేతులన్నీ ఒక్కటై చప్పట్లతో ప్రాంగణమంతా మార్మోగింది. అయినా.. భారతిలో ఇసుమంతైనా గర్వం కనిపించలేదు.
మరోసారి మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా: ఆపదలో ఉన్నవారికి తన శక్తి మేరకు సహాయం అందించాలని తపన పడే నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన రాజకీయ రంగ ప్రవేశం నుండి ఇప్పటివరకు అనేకమంది నిరుపేదలకు కోట్ల రూపాయల సహాయ సహకారాలు అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన గొప్ప నాయకుడు. మరోసారి ఆయన తన మానవత్వాన్ని చాటుకున్నారు.
మునుగోడు మండలంలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన పగిళ్ల శంకర్ తీవ్రమైన అనారోగ్యానికి గురై, నల్లగొండలోని రివర్ నీమ్స్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వీరిది నిరుపేద కుటుంబం కావడంతో ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సైదులు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 50,000/- బాధిత కుటుంబ సభ్యులకి అందించారు. కార్యక్రమంలో పగిళ్ల నగేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
లెంకలపల్లి బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పదివేలు ఆర్ధిక సహాయం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో అనారోగ్య కారణాలవల్ల కీ.శే. ఏర్పుల భీమయ్య సతీమణి ఏర్పుల కమలమ్మ బుధవారం మరణించారు. మానవతా దృక్పథంతో బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి స్పూర్తితో లెంకలపల్లి బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏర్పుల కమలమ్మ కుటుంబ సభ్యులకు రూ. 10,000/- ఆర్ధిక సహాయం అందించారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్పుల శ్రీశైలం, మేతరి శంకర్, నందికొండ లింగారెడ్డి, కాటగోని రవిశేఖర్, నాగరాజు, చాపల రాజు,ఎర్పుల వెంకటేష్, బుర్కల శేఖర్, చాపల రవి, ఏర్పుల రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
TS: మరికాసేపట్లో మోస్తారు వర్షం...
తెలంగాణలోని పలు జిల్లాలో కాసేపట్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రము బుధవారం తెలిపింది. హైదరాబాదు, కొత్తగూడెం, జనగాం, భూపాలపల్లి, గద్వాల్, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి, మెహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, నిజాంబాద్, సిరిసిల్ల, సూర్యాపేట, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాలలో ఈ రోజు ఒంటిగంటలోగా మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థికి ల్యాప్ టాప్ బహుకరించిన నాగం వర్షిత్ రెడ్డి
నల్లగొండ: ఇంజనీరింగ్ చదువుతున్న
బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్ చిన్న కుమారుడుకి, మంగళవారం బిజేపి నాయకులు డా•నాగం వర్షిత్ రెడ్డి ల్యాప్ టాప్ బహుకరించి ఇంకా ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని విద్యార్థిని ప్రోత్సహించారు. ఇంకా ముందు ముందు ఎలాంటి సహాయ సహకారాలైన అందిచడానికి ముందు ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత సెల్ కన్వీనర్ తీరాందాసు కనకయ్య,గడ్డం మహేష్, పల్ రెడ్డి నరేందర్ రెడ్డి, శాంతి స్వరూప్ ఉన్నారు.
DVK: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేసిన గ్రామపంచాయతీ కార్మికులు
నల్లగొండ జిల్లా, దేవరకొండ: గ్రామ పంచాయతీ కార్మికులు గత 13 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి సారించకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు నల్ల వెంకటయ్య, జేఏసీ కార్యదర్శి యజ్ఞ నారాయణ, ఏఐటియూసీ జిల్లా అద్యక్షులు నూనె రామస్వామి అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు నేడు దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలలో పనిచేయుచున్న పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, కారో బార్లు, బిల్ కలెక్టర్లు గా తదితర విభాగాలలో గత 20 నుండి 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని వీరు నర్సరీలు, వైకుంఠధామాలు, పార్కులు, ఆఫీసు పరిసరాలు తదితర ప్రాంతాలలో పనులు నిర్వహిస్తూ, తమ ఆరోగ్యాలను సైతం చెడగొట్టుకొని ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం శ్రమిస్తున్నారని ఇలాంటి కార్మికులకు రాష్ట్రంలో కనీస వేతనాల జీవోలు సైతం అమలు కావటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. కార్మిక చట్టాలైనటువంటి కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, పండగ, జాతీయ ఆర్జిత సెలవులు లాంటి ఏ హక్కుల్ని కార్మికులు నోచుకోకపోవడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు, జే. వెంకట్రాములు, ఏ. మల్లయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా అద్యక్షులు వి. ఆంజనేయులు, సీఐటీయూ ఎన్. నాగరాజు, లక్ష్మణ్, శ్రీను, జేఏసీ నాయకులు సతీష్, జి. కొండల్, అయోధ్య, వీరయ్య, సైదులు, జవహర్ లాల్, పండ్ల అంజమ్మ, ఎర్ర వెంకటమ్మ, గణేష్, బొజ్య, దేవరాజ్, యాదయ్య, భారతి, లలిత, రాములమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.