/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz DVK: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేసిన గ్రామపంచాయతీ కార్మికులు Mane Praveen
DVK: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేసిన గ్రామపంచాయతీ కార్మికులు
నల్లగొండ జిల్లా, దేవరకొండ: గ్రామ పంచాయతీ కార్మికులు గత 13 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి సారించకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు నల్ల వెంకటయ్య, జేఏసీ కార్యదర్శి యజ్ఞ నారాయణ, ఏఐటియూసీ జిల్లా అద్యక్షులు నూనె రామస్వామి అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు నేడు దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలలో పనిచేయుచున్న పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, కారో బార్లు, బిల్ కలెక్టర్లు గా తదితర విభాగాలలో గత 20 నుండి 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని వీరు నర్సరీలు, వైకుంఠధామాలు, పార్కులు, ఆఫీసు పరిసరాలు తదితర ప్రాంతాలలో పనులు నిర్వహిస్తూ, తమ ఆరోగ్యాలను సైతం చెడగొట్టుకొని ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం శ్రమిస్తున్నారని ఇలాంటి కార్మికులకు రాష్ట్రంలో కనీస వేతనాల జీవోలు సైతం అమలు కావటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. కార్మిక చట్టాలైనటువంటి కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, పండగ, జాతీయ ఆర్జిత సెలవులు లాంటి ఏ హక్కుల్ని కార్మికులు నోచుకోకపోవడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు, జే. వెంకట్రాములు, ఏ. మల్లయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా అద్యక్షులు వి. ఆంజనేయులు, సీఐటీయూ ఎన్. నాగరాజు, లక్ష్మణ్, శ్రీను, జేఏసీ నాయకులు సతీష్, జి. కొండల్, అయోధ్య, వీరయ్య, సైదులు, జవహర్ లాల్, పండ్ల అంజమ్మ, ఎర్ర వెంకటమ్మ, గణేష్, బొజ్య, దేవరాజ్, యాదయ్య, భారతి, లలిత, రాములమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.
NLG:జాతీయస్థాయికి ఎంపికైన నల్లగొండ టైక్వాండో క్రీడాకారుడు
నల్లగొండ పట్టణంలోని టైక్వాండో & ఫిట్‌నెస్ అకాడమీ క్రీడాకారుడు సోహం జాతీయస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర 6వ క్యాడెట్ టైక్వాండో కైరోగీ & పూమాస్ ఛాంపియన్‌షిప్,  సోమవారం హైదరాబాద్‌లోని రామచంద్రాపురం బాలాజీ గార్డెన్స్‌లో జరిగింది, దీంట్లో నల్లగొండ టైక్వాండో క్రీడాకారుడు సోహమ్ మొదటి స్థానాన్ని పొందారు. ఈ సందర్భంగా కోచ్ అంబటి ప్రణీత్ మాట్లాడుతూ.. ఈ నెల 27 నుండి 30 వరకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఛాంపియన్షిప్ లో జాతీయస్థాయికి క్రీడాకారుడు సోహం ఎంపికైనట్లు తెలిపారు.
''పల్లెవెలుగు టౌన్ బస్ పాస్'' కు శ్రీకారం చుట్టిన టిఎస్ఆర్టిసి
TS: ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు కొత్తగా ''పల్లెవెలుగు టౌన్ బస్ పాస్'' కు టిఎస్ఆర్టిసి శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. 

ఈ టౌన్‌ పాస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ధరను సంస్థ ఖరారు చేసింది.

ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది.  ఆ బస్ పాస్ ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”ను సంస్థ తెచ్చింది.

హైదరాబాద్‌ లోని బస్‌ భవన్‌లో సోమవారం "పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌" పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 మంగళవారం నుండి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

“జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చిందని సజ్జనార్ అన్నారు.

ఈ బస్ పాస్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్‌ రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఈడీలు మునిశేఖర్‌, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు: బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపిన పెండెం ధనుంజయ్
మునుగోడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నాయకులు పెండెం ధనుంజయ్ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సోమవారం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆషాడ మాసంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో, తెలంగాణ ప్రజలు బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. బోనాల పండుగతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం నిండాలని, సకాలంలో వర్షాలు పడి, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి:టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలంలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికుల  న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పగడాల లింగయ్య, పుప్పాల యాదయ్య, అంజయ్య, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన ఎస్ఎఫ్ఐ
నల్లగొండ జిల్లా, కొండ మల్లేపల్లి: గ్రామపంచాయతీ కార్మికులు గత 12 రోజులుగా చేస్తున్న సమ్మెకు సోమవారం ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సమ్మెను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్   మాట్లాడుతూ.. సిబ్బందికి వేతనాలు పెంపు, పర్మినెంట్ చేయాలనే న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి  పరిష్కరించాలన్నారు.ఎస్ఎఫ్ఐ నాయకులు రాహుల్ చందు, బాబులాల్ తదితులున్నారు.
భారతదేశ వ్యాప్తంగా 44 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు! : ఏడిఆర్ రిపోర్ట్
TS: భారతదేశ వ్యాప్తంగా 44 శాతం మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు పెట్టుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఇటీవల నిర్వహించిన విశ్లేషణలో వెల్లడైంది.
ఢిల్లీలో 70 మంది ఎమ్మెల్యేల్లో 37 మంది (53 శాతం), బీహార్‌లో 242 మంది ఎమ్మెల్యేల్లో 122 మంది (50 శాతం), మహారాష్ట్రలో 284 మంది ఎమ్మెల్యేల్లో 114 మంది (40 శాతం), జార్ఖండ్‌లో 79 మంది ఎమ్మెల్యేల్లో 31 మంది (39 శాతం) ఉన్నట్లు ఏడీఆర్ నివేదించింది. తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేలలో 46 మంది (39 శాతం), ఉత్తరప్రదేశ్‌లో 403 మంది ఎమ్మెల్యేలలో 155 మంది (38 శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు చేసుకున్నారని ఏడిఆర్ విశ్లేషణలో తెలిపారు.
సింగం పుష్పలత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: బీఎస్పీ
నల్లగొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం అల్వాల గ్రామ నివాసి మిషన్ భగీరథలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సింగం పుష్పలత, గత రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, ఆమె సొంత గ్రామం అల్వాలలో ఆమె కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ  సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులర్ చేస్తామని గొప్ప గొప్ప మాటలు చెప్పిన కెసిఆర్, నేడు వారికి ఇవ్వవలసిన జీతాలు కూడా సరిగ్గా  ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉండటం సిగ్గు చేటని విమర్శించారు. మూడు నెలలుగా జీతం అందకపోవడం వల్లనే సింగం పుష్పలత ఆత్మహత్య చేసుకుందని, ఈ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, వారి ఇద్దరు చిన్నారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటేశ్వర్లు , పెద్దవూర మండల అధ్యక్షుడు కుక్క ముడి ముత్యాలు, యడవెల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు
నల్లగొండ జిల్లా, చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని లక్కారం మోడల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఈద్గాలో  మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు, ఆదివారం ముస్లిం సోదరులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎం.డి బాబా షరీఫ్, కొయ్యడ సైదులు, నాయకులు దండ అరుణ్ కుమార్, షాదిఖాన ఛైర్మెన్ ఖలీల్, ముషీర్, జమీర్, చోటెబాబా, కదీర్, జమీర్, ఇబ్రహీం, గోరేమియ, ఖరీం మరియు మున్సిపల్ అధికారులు ఈఈ రేణు కుమార్, సూపర్వైజర్ నరసింహ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శేశలేటి వాగు ఫీడర్ చానల్ కు తక్షణమే మరమ్మతులు: ఎమ్మెల్యే కూసుకుంట్ల
నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం: శేషలేటి వాగు ఫీడర్ చానల్ మరమ్మతు పనులను  వెంటనే ప్రారంభించి నాంపల్లి , పెద్దాపురం చెరువులకు  నీరంధిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  తెలిపారు.  శనివారం నీటిపారుదల శాఖ అధికారులు, రైతులతో కలిసి నెవిళ్ళగూడం, బండ్ల గూడం గ్రామాల్లో  ఫీడర్ చానల్ దెబ్బతిన్న ప్రాంతాలను  ఆయన పరిశీలించారు.  రూ. 25 లక్షలతో తక్షణమే పీడర్ ఛానల్ మరమ్మతు పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.  కొన్నిచోట్ల కెనాల్  ఆక్రమణకు గురికాగా, రైతులతో మాట్లాడి సహకరించాలని కోరారు.  ఉప ఎన్నిక  సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.  ఇడికూడ- కొండమల్లేపల్లి డబుల్ రోడ్డు నిర్మాణం పనులకు రూ. 55 లక్షలతో జిఓ వచ్చిందని, త్వరలో టెండర్లు పిలుస్తారని అన్నారు.  పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా  మండలంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం పట్ల ప్రతిపక్షాలు తప్ప ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పారు.  తెలంగాణలో విద్యుత్ కష్టాలు లేవని, రైతులు ఏ ఒక్క రోజు కూడా రోడ్డెక్కలేదని గుర్తు చేశారు.  తెలంగాణలో సాగు విస్తీర్ణం, దిగుబడి రెట్టింపు అయ్యాయని, రైతుబంధు రైతు బీమా ఉచిత విద్యుత్ పథకాలతో రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు.  పెద్దాపురంలో సీసీ రోడ్ల నిర్మాణానికి , అసంపూర్తిగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సిడిపి నిధులు   ఇవ్వనున్నట్లు చెప్పారు.  ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షులు ఏడుదొడ్ల  రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్, సింగిల్ విండో డైరెక్టర్లు ,రైతులు, ఇరిగేషన్ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.