'సీఎం సహాయనిధి పథకం పేదలకు వరం': ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం, నాంపల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్) కింద 11 మందికి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శనివారం పెద్దాపురం గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు.
షర్బాపురం కు చెందిన రాసిక భద్రయ్యకు రూ.10,000/-, గట్ల మల్లెపల్లికి చెందిన నారోజు ఉదయ కళ్యాణ్ కు రూ. 18,000/-, కేతేపల్లికి చెందిన పల్లేటి శ్రీను కు రూ. 12,000/-, మేళ్ళవాయికి చెందిన గుండెబోయిన వెంకటయ్య కు రూ. 20,000/-, పగిళ్ళ కవితకు రూ. 22,000/- బొడ్డుపల్లి పద్మ కు రూ.11,500/-, పస్నూరు కు చెందిన చింతకాయల సత్యనారాయణ కు రూ. 9500/-,
పగిళ్ల యాదయ్యకు రూ. 30,500/- కండె పద్మకు రూ. 60,000, రేవల్లికి చెందిన మేకల కలమ్మకు రూ. 24,000/- తుమ్మలపల్లి కి చెందిన శేషలేటి రేణుక కు రూ.18,000/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 'సీఎం సహాయనిధి పథకం పేదలకు వరం' అని అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Jul 18 2023, 09:16