జిపి కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
నల్లగొండ జిల్లా మర్రిగూడ: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె శనివారం పదవరోజు కు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సిపిఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్, కొన్ రెడ్డి గిరి శనివారం కార్మికుల సమ్మె శిబిరం వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ.. కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే ఆలోచించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలను ఏకం చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధమేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, యూనియన్ మండల కార్యదర్శి ఊరు పక్క లింగయ్య, పెరుమాండ్ల మంజుల, పోలేపల్లి రాములు, ఒంపు ముత్తమ్మ, సిల్వర్ మహేష్, గ్యార యాదగిరి, ఎండి ఆసిఫ్, ఐతపాక పద్మ, కటికల భారతమ్మ, గుండెపురి నరసింహ, ఏపూరి ముత్తయ్య, ఆవుల ముత్తయ్య, పోతరాజు కృష్ణయ్య, రాములమ్మ, అమ్రాబాద్ సునీత, తదితరులు పాల్గొన్నారు
Jul 16 2023, 20:10