ప్రజా ప్రతినిధులు మండల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది: తిప్పర్తి జడ్పిటిసి
ప్రజా ప్రతినిధులు మండల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నల్గొండ జిల్లా పరిషత్ ఫ్లోర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ గారిని జడ్పిటిసి రామ్ రెడ్డి గారు శాలువాతో సన్మానించారు. సర్వసభ్య సమావేశంలో మండల అధికారులు వ్యక్తిగతంగా వారి వారి ఎజెండాను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మండల అభివృద్ధి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్షించారు. తిప్పర్తి మండలం లో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఈజీఎస్, SDF నిధులతో అవసరం ఉన్నచోట సిసి రోడ్లు డ్రెయిన్లు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని అన్నారు. తిప్పర్తి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ రాములు, ఎంఈఓ కత్తుల అరుంధతి, ఏపిఎం శ్రీదేవి, ఏఈ గంగాభవాని, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, మండల సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Jul 16 2023, 08:52