అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న మోడీ ప్రభుత్వం

అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న మోడీ ప్రభుత్వం .
బడా కార్పోరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న బీ జే పీ కేంద్ర ప్రభుత్వం..
ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్...
బడుగు జీవుల, అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న కేంద్ర ఆర్ ఎస్ ఎస్, బీ జే పీ మోడీ ప్రభుత్వం,బడా కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ,దేశ సంపదను దోచిపెడుతున్నదని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ అన్నారు.
శనివారం నాడు నల్గొండ పట్టణం లోని శ్రామిక భవన్ (సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయం) లో ఐ ఎఫ్ టి యు నల్గొండ జిల్లా కమిటీ సమావేశం,
జిల్లా అధ్యక్షుడు బొంగరాల నర్సింహ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ,దేశంలో ముప్ఫై అయిదు కోట్లకు పైగా ఉన్న అసంఘటిత కార్మికుల జీవనోపాధి రోజు రోజుకు కడు దయణీయంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు,నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం,కార్మికుల కూలీ రేట్లు,వేతనాలను పెంచడంలో అశ్రద్దగా, మొండిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
కార్మికుల శ్రమ మూలంగా అనేక కర్మాగారాల్లో ఉత్పత్తి అవుతున్న సంపదను,కార్మికుల శ్రమను,వివిధ రంగాలకు చెందిన యాజమాన్యాలు యదేచ్ఛగా దోచుకోవడానికి మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి,నాలుగు లేబర్ కోడ్ లుగా ముందుకు తెచ్చిందని ఆరోపించారు.
రాష్ట్రంలో కేసిఆర్ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం,75 షెడ్యూల్డ్ జీ ఓ లకు గెజిట్ లు లేకుండా కాలయాపన చేస్తుందని,75 షెడ్యూల్డ్ పరిశ్రమలలో ఒక కోటి ఇరవై లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, జీ ఓ లకు గెజిట్ ఇవ్వకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని అన్నారు.
కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన గా,జూలై,ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కేంపైన్ నిర్వహిస్తుందని,అందులో భాగంగానే జూలై 20 న,హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని, క్విట్ ఇండియా కు పిలుపు నిచ్చిన ఆగస్టు 9 నాడు హైదరాబాద్ సిటీలో, అన్ని జిల్లా కలెక్టరేట్ ల ముందు మహా ధర్నాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
ఈ సమావేశంలో IFTU జిల్లా అధ్యక్షుడు బొంగరాల నర్సింహ, ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్,జిల్లా నాయకులు కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహ, రావుల వీరేశ్,జానీ,అశోక్ పాషా,స్వామి,ముత్తు,ఎం.డి జానీ,రవి,తదితరులు పాల్గొన్నారు.


 
						



 తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ అవార్డు 2023 కు "విశిష్ట సేవ రత్న"జాతీయ అవార్డు గెలుచుకున్న నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాదిక్ పాషా
తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ అవార్డు 2023 కు "విశిష్ట సేవ రత్న"జాతీయ అవార్డు గెలుచుకున్న నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాదిక్ పాషా గుంటూరులో నేడు తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతి అవార్డులు 2023 నిర్వహించిన అవార్డు వేడుకలో నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్త, ఆర్టీసీ ఉద్యోగి సాదిక్ పాషా గారికి "విశిష్ట సేవ రత్న" జాతీయ అవార్డు తో ఘనంగా సన్మానించడం జరిగింది. అనేక రంగాలలో సాదిక్ పాషా గారు సొంతంగా చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి ఈ అవార్డు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాధిక్ పాష గారు మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు, ఇలాంటి అవార్డులు రావడంతో తనకు మరింత బలం చేకూరిందని, తనలా సొంతంగా సేవా కార్యక్రమాలు చేసే వారికి ఈ అవార్డు మరింతో ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవ భావాన్ని అలవర్చుకోవాలని సాటి మనిషిని గౌరవించాలని ఈ సందర్భంగా పాషా గారు తెలిపారు.
గుంటూరులో నేడు తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతి అవార్డులు 2023 నిర్వహించిన అవార్డు వేడుకలో నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్త, ఆర్టీసీ ఉద్యోగి సాదిక్ పాషా గారికి "విశిష్ట సేవ రత్న" జాతీయ అవార్డు తో ఘనంగా సన్మానించడం జరిగింది. అనేక రంగాలలో సాదిక్ పాషా గారు సొంతంగా చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి ఈ అవార్డు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాధిక్ పాష గారు మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు, ఇలాంటి అవార్డులు రావడంతో తనకు మరింత బలం చేకూరిందని, తనలా సొంతంగా సేవా కార్యక్రమాలు చేసే వారికి ఈ అవార్డు మరింతో ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవ భావాన్ని అలవర్చుకోవాలని సాటి మనిషిని గౌరవించాలని ఈ సందర్భంగా పాషా గారు తెలిపారు.
 కోట.సరిత కు జాతీయ నంది అవార్డ్
కోట.సరిత కు జాతీయ నంది అవార్డ్
 నల్లగొండ జిల్లా చండుర్ ZPHS లో SGT గ పనిచేస్తున్న శ్రీమతి కోట.సరిత గారు నేడు గుంటూరులో తెలుగు వెలుగు సాహితీ వేదిక నిర్వహించిన జాతీయ ఉత్తమ అవార్డులలో ఉత్తమ   జాతీయ నంది అవార్డు    వరించింది.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, క్యారమ్ జాతీయ క్రీడాకారిణి, లయన్స్ క్లబ్ ద్వారా సేవ, టీచర్ యూనియన్ లీడర్ గాను, ఇంపాక్ట్ ట్రైనర్ గా కోట సరిత గారు తన వంతు సేవలందించారు. ఈ సందర్భంగా కోట సరిత గారు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనకు ఉత్తమ జాతీయ నంది అవార్డు ఇచ్చినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదికకు కృతజ్ఞతలు తెలిపారు.
నల్లగొండ జిల్లా చండుర్ ZPHS లో SGT గ పనిచేస్తున్న శ్రీమతి కోట.సరిత గారు నేడు గుంటూరులో తెలుగు వెలుగు సాహితీ వేదిక నిర్వహించిన జాతీయ ఉత్తమ అవార్డులలో ఉత్తమ   జాతీయ నంది అవార్డు    వరించింది.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, క్యారమ్ జాతీయ క్రీడాకారిణి, లయన్స్ క్లబ్ ద్వారా సేవ, టీచర్ యూనియన్ లీడర్ గాను, ఇంపాక్ట్ ట్రైనర్ గా కోట సరిత గారు తన వంతు సేవలందించారు. ఈ సందర్భంగా కోట సరిత గారు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనకు ఉత్తమ జాతీయ నంది అవార్డు ఇచ్చినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదికకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి
ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి 


 

 ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి


 

 ప్రెస్ నోట్..
ప్రెస్ నోట్..

Jul 16 2023, 08:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.8k