జీవో 60 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి: చినపాక లక్ష్మీనారాయణ
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఆరవ రోజుకు చేరింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ.. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, 60 జీవో ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని, గ్రామపంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి ఊరి పక్క లింగయ్య, పోలేపల్లి రాములు, నక్క నరసింహ, పెరుమాండ్ల మంజుల, అమ్రాబాద్ సునీత, ఐతపాక పద్మ, సిల్వేరు రమేష్, లక్ష్మీకాంత్ గుండెపురి నరసింహ, ఆవుల ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు
Jul 12 2023, 19:12