/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ట్విట్టర్లో మంటలు పుట్టిస్తున్న కేటీఆర్ Yadagiri Goud
ట్విట్టర్లో మంటలు పుట్టిస్తున్న కేటీఆర్

కేసీఅర్ నినాదం… ” మూడు పంటలు” …

కాంగ్రెస్ విధానం… ” మూడు గంటలు” …

BJP విధానం “మతం పేరిట మంటలు”

” మూడు పంటలు ” కావాలా..

” మూడు గంటలు “* కావాలా..

“ మతం పేరిట మంటలు” కావాలా…

తెలంగాణ రైతు… తేల్చుకోవాల్సిన.. తరుణం ఇది..!! అంటూ బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కెటిఆర్ ట్విట్ట‌ర్ చేసిన ట్విట్ ఇప్పుడు మంట‌లు పుట్టిస్తున్నది.. బిజెపి,కాంగ్రెస్ ల‌ను టార్గెట్ చే స్తూ చేసిన ట్విట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా దూసుకుపోతున్న‌ది..

ఇక కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్నకారు రైతులు అంటే చిన్న చూపు అని.. సన్నకారు రైతు అంటే సవతి ప్రేమ అని కెటిఆర్ అన్నారు. నాడు ఏడు గంటల కరెంట్‌ ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్‌.. నేడు ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందని పేర్కొన్నారు.

మూడు గంటలతో మూడెకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలని ఎద్దేవా చేశారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగమవుతుందని అన్నారు. మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్‌ కావాలా? మూడు గంటల కరెంట్‌ చాలన్న మోసకారి రాబందు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు

ఈటెల సమక్షంలో బీజేపీలో చేరిన కూచారం గిరిజన యువకులు

మెదక్ జిల్లా:జులై 11

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కూచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జైత్రం తండాకు చెందిన గిరిజన యువకులు మంగళవారం పెద్ద సంఖ్యలో రాష్ట్ర బీజేపీ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు.

కూచారం గ్రామానికి చెందిన మెదక్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది గిరిజన యువకులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, జిల్లాలోని పలువురు నాయకుల ద్వారా ఈటెల రాజేందర్ నివాసానికి వెళ్లి పార్టీలో చేరారు.

బీజేపీ పార్టీలో చేరిన గిరిజన యువకులు విజయ్ నాయక్, కిషన్ నాయక్, నరేందర్ నాయక్ తో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గిరిజన యువకులు మాట్లాడుతూ.. కూచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తమ గిరిజన తండాను అభివృద్ధి చేయడంలో మండల బీఆర్ఎస్ నాయకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గిరిజన యువకులు వాపోయారు...

తెలంగాణలో రెండో నగరంగా కరీంనగర్ : మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ జిల్లా :జులై 11

కరీంనగర్ అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని 18వ డివిజన్ లోని రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో మంగళవారం రూ.1.90 కోట్ల పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రికి డివిజన్ వాసులు శాలువాతో సత్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కరీంనగర్ ను రాష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగర పాలక సంస్థలో విలీనమైన డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు. రేకుర్తి గ్రామ పంచాయితీగా ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రేకుర్తి 18, 19 డివిజన్ల అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ప్రారంభించిన పనులన్నీ నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

కరీంనగర్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధగుని మాధవి కృష్ణ గౌడ్, ఏదుల్ల రాజశేఖర్ కార్పొరేటర్లు, వి.రాజేందర్ రావు, భూమాగౌడ్, జంగిలి సాగర్, దీండిగాల మహేష్, గుగ్గిళ్ల శ్రీనివాస్, తుల బాలయ్య, బీఆర్ఎస నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీద్, నరేష్ డివిజన్ వాసులు, తదితరులు పాల్గొన్నారు......

లాయర్ వామన్రావు దంపతుల హత్య కేసు.. ఇద్దరు నిందితులకు బెయిల్‌

హైదరాబాద్ :జులై 11

తెలంగాణకు చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన రావు, పీవీ నాగమణిల హత్య కేసులో ఇవాళ కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ జరిపింది.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు.. ఏ-3 ఉదారి లక్ష్మణ్ ఏ-5 అక్కపాక కుమార్‌లకు అత్యున్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ పిటిషన్లపై జస్టిస్‌ బోపన్న, జస్టిస్‌ సుందరేష్‌ ధర్మాసనం విచారణ చేపట్టగా.. తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసినట్లు నిందితుల తరఫు లాయర్లు తెలిపారు. స్థానిక కోర్టులో విచారణ జరుగుతున్నట్లు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ట్రయల్‌ కోర్టు నిబంధనల మేరకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది.

2021 ఫిబ్రవరి 17న గట్టు వామనరావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరి వస్తుండగా.. కల్వచర్ల వద్దకు చేరుకోగానే వారిని దుండగులు అడ్డుకున్నారు. దాదాపుగా 20 నుంచి 30 నిముషాలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేసి.. ప్రజల మధ్యే దారుణంగా నరికి చంపిన విషయం పెద్దపెల్లి జిల్లాలో సంచలనం సృష్టించింది...

గ్యాస్ లీకేజీతో చెలరేగిన మంటలు.. ఏడుగురికి తీవ్రగాయాలు

హైదరాబాద్ :జులై 11

గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగడంతో ఏడుగురికి తీవ్రగాయాలైన ఘటన హైద‌రాబాద్ లోని దోమ‌ల‌గూడ‌లో మంగళవారం చోటుచేసుకుంది. రోజ్ కాల‌నీలో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కావ‌డంతో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి.

దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధ‌మైంది. ఇంట్లో ఉన్న ఏడుగురు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానికులు అందించిన స‌మాచారంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపు చేశారు.

ఈ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో పద్మ (55), ఆమె కూతురు ధనలక్ష్మి (30) ధనలక్ష్మి పిల్లలు అభినవ్ (8), శరణ్య (6), విహార్ (3), పద్మ చెల్లెలు నాగులు గాయపడ్డారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. భారీ ఆస్తి న‌ష్టం జ‌రిగింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు...

చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్‌లో హిజ్రాల రణరంగం

నల్లగొండ: మిర్యాలగూడ వన్‌ పోలీస్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు..

ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది.

పోలీస్ స్టేషన్‌లోనే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో పీఎస్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాజ్రాలు తన్నుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి..

ఆంధ్రప్రదేశ్‌లో పెను ప్రమాదం, పెళ్లి ఊరేగింపులతో అదుపుతప్పిన బస్సు

•కాల్వలో పడి ఏడుగురు మృతి; డజను మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బరాతీలతో నిండిన బస్సు నగరంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై అధికారులు సమాచారం అందించారు.

ఏడుగురు మరణించారు, డజను మంది గాయపడ్డారు

మంగళవారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో పెళ్లి ఊరేగింపులతో వెళ్తున్న బస్సు కాల్వలో పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. ఇది కాకుండా, ఈ ప్రమాదంలో డజను మంది గాయపడ్డారు.

బస్సులో 40 మంది ఉన్నారు

సమాచారం ప్రకారం, ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున దర్శి ప్రాంతానికి సమీపంలో జరిగింది. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తోంది. అప్పుడు బస్సు అదుపు తప్పి సాగర్ కాలువలో పడిపోయింది. బస్సులో దాదాపు 40 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సును అద్దెకు తీసుకున్నారు.

మృతులను అబ్దుల్ అజీజ్ (65), అబ్దుల్ హనీ (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీ బేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా (6)గా గుర్తించారు.

బీసీల రాజకీయ ప్లీనరీని విజయవంతం చేయాలి

---బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

బీసి ముఖ్యమంత్రితో పాటు మిషన్ 60 (బీసీలకు 60 ఎమ్యెల్యే టికెట్లు) డిమాండ్ తొ జూలై 15న ఎల్ బి నగర్లోని కెబిఆర్ కన్వెన్షన్లో నిర్వహించ తలపెట్టిన బీసీల రాజకీయ ప్లీనరిని విజయవంతం చేయాలనీ బీసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దీనికి సంబంధించిన గోడపత్రికలను మంగళవారం జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ 10 వేల మంది ప్రతినిధులతో నిర్వహించే బీసిల రాజకీయ ప్లీనరి తెలంగాణలో రాజకీయాలను శాసించబోతుందన్నారు. ఈ సమావేశంలో బీసిల రాజకీయ భవిష్యత్, దశ-దిశను నిర్ణయిస్తామని ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు దళితులని, బీసీలని ముఖ్యమంత్రి చేస్తామని వాగ్దానం చేసి చేయలేదన్నారు. పైగా తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అగ్రకుల నాయకులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పారని అన్నారు. ఇంత కాలం బిజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత బండి సంజయ్ ని సైతం తప్పించి అగ్రకులాలకే బాధ్యతలు అప్పజెప్పారని ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు బీసిల రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదన్నారు. కేవలం పిడికెడు శాతం ఉన్న అగ్రకులాలకే పెత్తనం ఇచ్చి 60 శాతం ఉన్న బీసీలను ఓట్లు ఏవిధంగా అడుగుతారని అని ప్రశ్నించారు.

ఏవిధంగా బీసీలు మీకు ఓట్లు వేయాలో చెప్పాలనీ ఎద్దేవా చేశారు. అందుకే ఓటు మాదేసీటు మాదే... మేమెంతో మాకంతా అనే నినాదంతో అగ్రకుల ఆధిపత్య పాలనకు చరమగీతం పాడేందుకు రాజ్యాధికారం వైపు బీసిలందరిని తీసుకెళ్లడమే ఈ రాజకీయ ప్లీనరి ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. మీరిచ్చే రాయితీలు, సబ్సిడీలు, స్కాలర్ షిప్లు మమ్ముల్ని సంతృప్తి పరచలేవన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సీఎం పీఠమే అజెండేగా బీసీ రాజకీయ ఉద్యమాన్ని మొదలు పెడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, గౌరవ సలహాదారు నెలపట్ల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యలిజాల రమేష్, మారోజు రాజ్ కుమార్, రాములు, రవీందర్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌లో జూపల్లి రోడ్‌షో.. భారీ కాన్వాయ్‌తో ర్యాలీ

నాగర్‌కర్నూలు:జులై 11

జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రోడ్‌ షో నిర్వహించారు. మంగళవారం ఉదయం భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ నెల 20 న జరిగే బహిరంగ సభాస్థలి పరిశీలన కోసం వచ్చినట్టు తెలిసింది ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 20 న కొల్లాపూర్‌లో రెండు లక్షల మందితో పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సభకు ప్రముఖ నాయకులు, ప్రియాంక గాంధీ రానున్నట్లు చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, రాక్షస, నియంతృత్వ పాలనకు చమర గీతం పాడాలన్నారు. ఆస్తులు.. పుస్తెలు అమ్ముకొని చదువుకున్న వారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని.. తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్‌కు బహుమానం ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ సీఎం అయ్యే వారా అంటూ జూపల్లి కృష్ణరావు ప్రశ్నించారు...

మసాజ్ ముసుగులో వ్యభిచారం

బంజారాహిల్స్‌లోని స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేసీ నిర్వాహకులను అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో ఉన్న స్పా సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దాడి చేశారు. కేంద్రం నడుపుతున్న వ్యక్తి తో పాటు నలుగురు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

వీరంతా హైదరాబాద్‌లోని ప్రముఖుల కుమారులేనని సమాచారం. సహ ఆర్గనైజర్ సయ్యద్ బిల్లాల్‌తో పాటు ఫహద్, హసీదుద్దీన్, మహ్మద్ ఇమ్రానంద్, కమల్ కిషోర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఐదుగురు యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అధికారులు వారిని రెస్క్యూ హోంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అదే క్రమంలో మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లో ఉన్న మహి ఆయుర్వేదిక్ బ్యూటీ స్పా సెలూన్‌పై కుడా ఈ రోజు ఉదయం పోలీసులు దాడి చేశారు. సునీల్ కుమార్ అనే వ్యక్తి వ్యభిచార గృహం నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా అక్కడ క్రాస్ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. క్రాస్ మసాజ్ పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆర్గనైజర్ సునీల్ కుమార్ తో పాటు సబ్ ఆర్గనైజర్ గా పనిచేస్తున్న ఫర్జానా బేగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.....