జులై 10న నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా
నల్లగొండ జిల్లా: గీత కార్మికులు హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రీపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జులై 10న నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కల్లుగీత కార్మికుల సొసైటీలో సభ్యులందరికీ మోటార్ బైకులు, సేఫ్టీ మోకులు అందించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుల వృత్తిదారులకు ప్రభుత్వం ఇస్తామన్నా లక్ష రూపాయల ఆర్థిక సహాయంచేయాలని, సొసైటీలకు భూమి, కల్లుకు మార్కెట్, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రభుత్వం 5వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని అన్నారు. 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని, గీత కార్మికులకు మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని వారు అన్నారు. జులై 10న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు వేలాది మంది గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అయితగోని పాపయ్య, సొసైటీ ఉపాధ్యక్షులు బోడ అంజయ్య, కార్యదర్శి అయితగోని మల్లయ్య, కారింగి నరసింహ గౌడ్, బురుకల లక్ష్మయ్య గౌడ్, అయితగోని అంజయ్య గౌడ్, అయితగోని వెంకటయ్య గౌడ్, తిరుపతయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Jul 11 2023, 16:57