ఘనంగా ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం
నల్లగొండ: కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే దళిత గిరిజన బహుజనుల జాతులు, తమ పేరు చివరన కులం పేరు పెట్టుకోని ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా చేసింది ఎమ్మార్పీఎస్ ఉద్యమమేనని ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ, మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేపాక వెంకన్న మాదిగ, జిల్లా అధ్యక్షులు లంకపల్లి నగేష్ మాదిగ, ఎంఎస్పి మండల ఇన్చార్జి బొజ్జ దేవయ్య మాదిగ లు అన్నారు. ఆ సంఘం 29వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని స్థానిక గొల్లగూడలో మరియు 14వ వార్డు మర్రిగూడలో ఆ సంఘం జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీల రిజర్వేషన్ల ఏ బి సి డి వర్గీకరణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం 29 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని విస్తరింపజేసి వర్గీకరణతో పాటు అనేక సామాజిక ఉద్యమాలను నిర్మించారన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం మాదిగలను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారే తప్ప మా చిరకాల కోరిక అయిన ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలైన ఆరోగ్యశ్రీ, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించుకోవడం కోసం అనేక పోరాటాలు చేసి విజయాలు సాదించారని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ నాయకత్వం ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మెడలు వంచైనా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణను సాధించుకుంటామని అన్నారు. ఇప్పటికైనా బిజెపి పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో కురుపాటి కమలమ్మ, పెరిక శ్రీనివాసులు, కొత్త వెంకన్న, కత్తుల మారయ్య, దుబ్బ సత్యనారాయణ, మాసారం వెంకన్న, బొజ్జ నాగరాజు, తోరకొప్పుల రాజు, బొజ్జ శంకరయ్య, బీపంగి యాదయ్య, బీపంగి చంటి, మల్లెపాక రాంబాబు, బొజ్జ నాగయ్య, బొజ్జ లింగస్వామి, కొప్పోలు వెంకన్న, బొజ్జ పాండు, బీపంగి అర్జున్, చిలుముల ప్రభాకర్, బాగిడి స్వప్న, చిలుముల జలంధర్, అశోక్, కత్తుల యాదగిరి, పరమేష్, తోలకొప్పుల గిరి, పోలే జయకుమార్, పేర్ల లింగస్వామి, నారపాక శేషగిరి, కత్తుల ప్రసాద్, బొజ్జ రవి, బొజ్జ ఎల్లేష్, బొజ్జ నరేందర్, బొజ్జ శ్రీను మరియు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Jul 10 2023, 18:48