/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz సికింద్రాబాద్ మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ Yadagiri Goud
సికింద్రాబాద్ మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ :జులై 09

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా బోనాల పండుగ ప్రారంభమైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి సతీసమెతంగా సీఎం కేసీఆర్ బంగారు బోనంతో వచ్చారు.

తలపై పట్టు వస్త్రాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నా కేసీఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేసీఆర్ కవిత ఆలయం లోపల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి లక్షలాది మంది మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు....

తెలంగాణలో బిజెపి అడ్రస్సే లేదు

ఖమ్మం జిల్లా:జూలై 09

సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని, తెలంగాణలో బీజేపీ అడ్రెస్ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి అన్నారు. ఆదివారం ఆమె ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతోందన్నారు. నార్త్‌లో వంద సీట్లకుపైగా బీజేపీ కోల్పోబోతోందన్నారు. బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతతత్వ రాజకీయాలకు ఈ దేశంలో చోటు లేదన్నారు.

పార్లమెంట్‌లో అసభ్యంగా.. అసహ్యంగా ప్రధాని మోదీ అబద్దాలు చెబుతున్నారని రేణుక చౌదరి అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్, కేసీఆర్‌ల మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. మంత్రి హరీష్ రావు టీవీ సీరియల్స్ రాసుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు. కాంగ్రెస్ గంగా నది లాంటిదని, ఇందులోకి ఎంతో మంది వచ్చి స్నానం చేసి పునీతులవుతున్నారని అన్నారు. సర్వే నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని రేణుక చౌదరి పేర్కొన్నారు...............

బోనమెత్తిన కవిత

హైదరాబాద్ :జూలై 09

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు క‌న్నుల‌పండువ‌గా సాగుతున్నాయి. హైద‌రాబాద్‌లో బోనాల జోష్ నెల‌కొంది. ఇవ్వాల ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారికి భ‌క్తులు బోనాలు స‌మ‌ర్పిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు ఉజ్జ‌యిని అమ్మ‌వారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మహంకాళి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇక‌.. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించారు. భారీ ర్యాలీతో త‌ర‌లివ‌చ్చిన క‌విత అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. మొక్కు చెల్లించుకున్నారు. కాగా, ఇవ్వాల‌, రేపు రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రేపు రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు, ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. బోనాలు, ఓడి బియ్యం సమర్పణతో ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇక‌.. పోత‌రాజుల నృత్యాలు, శివసత్తులు,జోగినీల నృత్యాల‌తో సికింద్రాబాద్‌లో సంద‌డి నెల‌కొంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్లాట్ కేటాయించారు. భక్తులు భద్రత కోసం ఆలయంలో 20 సీసీ కెమెరాలు ఉండగా, జాతర సందర్బంగా మరో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

బోనాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయానికి వచ్చే భక్తుల వెహికిల్స్ పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్వచ్చే మార్గంలో సైతం ట్రాఫిక్ ఉంటుందని తెలిపారు...

గాయకుడు సాయిచంద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు

హైదరాబాద్‌:జూలై 09

ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం జరుగుతున్న సాయిచంద్‌ దశ దిన కర్మకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు.

సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు.

సాయిచంద్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.......

యాదాద్రి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట:జూలై 09

శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

దీంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతున్నది. అతి శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇంబ్బంది కలుగకుండా చూస్తున్నారు......

ఆక్ర‌మ‌ణ‌లు తొలగించి ప‌ట్ట‌ణాభివృద్దికి స‌హ‌క‌రించండి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

గతంలో ఇరుకైన రహదారులతో, గుంతలతో,వర్షపు నీటితో పట్టణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా ట్రాఫిక్ తో అనునిత్యం సమస్యలు ఎదుర్కొన్నారని, అలాంటిది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాలమైన రహదారులు, జంక్షన్ల అభివృద్ధితో పట్టణానికి ఒక రూపును తీసుకువచ్చినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం అయన పట్టణంలోని అబ్దుల్ ఖాదర్ దర్గ వద్ద ఉన్న రహమానియా బ్రిడ్జిని ప్రారంభించారు...

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించడానికి 12 సంవత్సరాలు పట్టిందని,రైల్వే గేట్ పడినప్పుడు అంబులెన్స్ లు ఆగి ప్రాణాలమీడికి వచ్చిన పరిస్థితి ఉండేదని, అలాంటిది ఇప్పుడు భూతపూర్ నుండి మహబూబ్ నగర్,జడ్చర్ల నుండి మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చేందుకు విశాలమైన రహదారులు నిర్మించామని, పట్టణంలోని రహదారులన్నింటిని విస్తరించడమే కాకుండా, జంక్షన్లు సైతం అభివృద్ధి చేశామని, అస్తవ్యస్త రహదారులతో అవస్థలు పడకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇంకా పట్టణంలో రహదారులపై కొన్ని ఆక్రమణలు ఉన్నాయని వాటిని తీసే విషయంలో అందరు సహకరిస్తే ఇంకా విస్తారమైన రోడ్లను తీర్చిదిద్దుతామని తెలిపారు.

రహమానియా బ్రిడ్జి పక్కన ఉన్న పెద్ద మురికి కాలువలో డ్రైవ్ వాటర్ వెళ్లేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ఏర్పాటు చేసి మంచినీళ్లు ప్రవహించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఒక ఫౌంటెన్ ఏర్పాటు చేస్తామని, వేపురిగెరి , చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ప్రశాంతంగా ఉండే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి అభివృద్ధికి సహకరించాలని ఆయన పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పట్టణానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలతో పాటు, ఇంకా ఎంతో అభివృద్ధి రానుందని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రోడ్లను విస్తరించామని, ఇక్కడ యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ఐటి పార్కు ఏర్పాటుతో చర్యలు తీసుకోవడమే కాకుండా, పిల్లలు చదువుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాలను తీసుకువచ్చామని, పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు...

మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించిన : మంత్రి తలసాని

హైదరాబాద్:జూలై 09

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ఆషాడ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించానన్నారు. మన సంస్కృతికి ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, 2014 నుంచి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తోందన్నారు. బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తోందన్నారు. ప్రైవేటు దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి తలసాని వెల్లడించారు.

బోనాలు సమర్పిస్తున్న మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ జాతరకు 1500 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తుతోపాటు సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెల్లవారు జాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు. మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కాంక్షలు విధించామని, ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు మంత్రి తలసాని సూచించారు...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్:జూలై 09

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆదివారం తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతమంతా పొగలు దట్టంగా అలుముకున్నాయి. చుట్టుప్రక్కల నివసించే వారు ప్రాణ భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పాలికా బజార్‌లో ధమాకా సేల్ రెడీమేడ్ బట్టల షాప్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

షాట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకుని.. దట్టమైన పొగలు అలుముకొన్నాయి. ఆ చుట్టుపక్కల పలు షాపులతోపాటు లాడ్జీలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది......

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల:జూలై 09

తిరుపతి దేవస్థానం ఆదివారం రోజు భక్తులతో కిటకిటలాడుతోంది

కాగా నిన్న శనివారం శ్రీవారిని 86,781 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

శ్రీవారికి 44,920 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.......

సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మ‌హారాష్ట్ర నేత‌లు

భార‌త్ రాష్ట్ర స‌మితికి మ‌హారాష్ట్ర వ్యాప్తంగా ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ది. ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల కీల‌క నేత‌లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మక్షంలో మ‌హారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన కార్పొరేట‌ర్ న‌గేశ్‌తో పాటు ఆయ‌న మ‌ద్ద‌తుదారులు, ఇత‌ర నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ వారంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, జీవ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు........