/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు వరంగల్ కు ప్రధాని రాక Yadagiri Goud
నేడు వరంగల్ కు ప్రధాని రాక

6 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అధికార బీఆర్‌ఎస్‌తో బీజేపీకి అవగాహన కుదిరిందన్న ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రధాని నరేంద్రమోదీ వరంగల్‌ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఈ సందర్భంగా బీజేపీ విజయసంకల్ప సభ నేపథ్యంలో ఈ సభలో మోదీ రాజకీయంగా ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? ఇటీవలి పరిణామాలతో రాష్ట్రంలో అయోమయంలో పడిపోయిన బీజేపీ క్యాడర్‌కు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. సరిగ్గా మూడు నెలల క్రితం ఏప్రిల్‌ 8న రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ.. సికింద్రాబాద్‌ రైల్వేస్షేషన్‌ ఆధునికీకరణతోపాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా, పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా సీఎం కేసీఆర్‌ కుటుంబంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదని తేల్చిచెప్పారు. దీంతో, అప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించిన దృష్ట్యా.. ఆమెను అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా గడచిన మూడునెలల్లో సమీకరణాలు మారాయి. లిక్కర్‌ స్కాం కేసు దర్యాప్తు మందగించింది. రాష్ట్ర బీజేపీలో అసమ్మతి రాజుకుని క్యాడర్‌లో అయోమయం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ వరంగల్‌కు వస్తున్నారు.

భారీగా పోలీసు బందోబస్తు..

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటనలో భాగంగా బహిరంగ సభకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో వేదిక సిద్ధమైంది. మోదీ రాక సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రకటించగా, కాంగ్రెస్‌, వామపక్షాలు సైతం మోదీ పర్యటనను నిరసిస్తున్నాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆయా పార్టీల నాయకులను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. పలువురు ముఖ్యనేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ బృందం 24 గంటల ముందే స్వాధీనం చేసుకుంది. కాగా, ప్రధాన మోదీ శనివారం ఉదయం 10.15 గంటలకు నగరానికి చేరుకుంటారు. మామునూరు విమానాశ్రయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో దిగుతారు. భద్రకాళి దేవాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. ఇక్కడ రూ.6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో రూ.3,441 కోట్ల ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా వరంగల్‌మంచిర్యాల జాతీయ రహదారి విస్తరణ, రూ.2,147 కోట్లతో జగిత్యాలకరీంనగర్‌వరంగల్‌ మధ్య రహదారి పనులు, రూ.521 కోట్లతో చేపట్టనున్న రైల్వే గూడ్స్‌ వ్యాగన్ల తయారీ కేంద్రం ఉన్నాయి. వీటికి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించిన అనంతరం.. బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.

వర్షం వచ్చినా అంతరాయం కలగకుండా..

బహిరంగ సభకు వర్షం ముప్పు పొంచి ఉండడంతో సభాప్రాంగణాన్నంతా జర్మన్‌ టెక్నాలజీ టెంట్లతో కప్పేశారు. సభలో ఎక్కడ కూర్చున్నా అందరికీ మోదీ స్పష్టంగా కనిపించేలా పలుచోట్ల డిజిటల్‌ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఒక ప్రధానమంత్రి వరంగల్‌కు రావడం దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ప్రధాని ఏమైనా వరాలు ప్రకటించవచ్చునని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీపై ద్వేషంతోనే సీఎం కేసీఆర్‌ వరంగల్‌లో అభివృద్ధి పనులకు దూరంగా ఉంటున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. బెంగాల్‌, తమిళనాడు, ఏపీతోపాటు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో కూడా సీఎంలు ప్రొటోకాల్‌ పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని కేసీఆర్‌కు హితవు పలికారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని ప్రపంచ దేశాలు హీరో అంటూ కీర్తిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు...

తిరుమల లో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల :జూలై 08

వీకెండ్ కావడంతో నేడు (శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 69,483 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 32,459 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

ఏ మొహం పెట్టుకొని మోదీ వరంగల్ కు వస్తున్నాడు

ప్రధాని నరేంద్ర మోదీ పై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి మండిపడ్డారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి అని ధ్వజమెత్తారు.

తెలంగాణ పట్ల విషాన్ని నింపుకున్న ప్రధాన మంత్రికి, తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేసారు. గుజరాత్ లోని దహోడ్ లో 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారని, కానీ రాష్ట్ర పునర్ విభజన హామీలో భాగమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మాత్రము మొండి చేయి చూపించారని, కేవలం 520 కోట్ల రూపాయలతో కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ కాజీపేట లో పెట్టి గుజరాత్ కు కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయారని కేటీఆర్ మండిపడ్డారు.

ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు : తెలంగాణకు 520 కోట్ల రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్ కి 20000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ తీసుకుపోయిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారన్నారు కేటీఆర్. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని, ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చని ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన ప్రధానమంత్రి ఆ హామీని నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని, తొమ్మిదేళ్ల పాటు కాలయాపన చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణకు 520 కోట్ల రూపాయలతో బిచ్చం వేసినట్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్....

సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టివేత

సంగారెడ్డి జిల్లా:జూలై 07

జహీరాబాద్ అంతరాష్ట్ర ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. చిరాగ్ పల్లి ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆబ్కారీ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ కారులో రెండు బాక్సుల్లో తరలిస్తున్న కేజీన్నర బంగారాన్ని పట్టుకున్నారు.

ముంబయి నుంచి హైదరాబాద్‌ కు వస్తున్న కారులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ కోటికిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సరైన పత్రాలు లేకుండా బంగారం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది....

కడియం శ్రీహరి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ :;ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

హన్మకొండ:జూలై 07

ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

''కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త. ఆయన మంత్రిగా ఉన్నపుడు నా మాదిగ బిడ్డలను ఎంతోమందిని ఎన్‌కౌంటర్ చేయించాడు.

నేను త్యాగం చేసి పార్టీలోకి వస్తే.. కడియం శ్రీహరి స్వార్థం కోసం బీఆర్ఎస్‌లోకి వచ్చారు. కడియం శ్రీహరి ఆంధ్రా అల్లుడు.. వారసుడా...? కులం పేరు చెప్పుకునే దమ్ము ఆయనకుందా..?" అని ఎమ్మెల్యే రాజయ్య ప్రశ్నించారు...

ప్రధాని పర్యటన వరంగల్ నగరానికి కొత్త తేజస్సు : కిషన్ రెడ్డి

హనుమకొండ:జూలై 07

ఈరోజు వరంగల్ లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో పొత్తులపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటే అని అన్నారు.

కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు కోసం పని చేశారని ఎన్నటికైనా ఆ రెండు పార్టీలు కలుస్తాయని తెలిపారు. రేపటి శనివారం బీజేపీ సభ చాలా కీలకమైనదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పర్సంటేజీల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. వాటాల ప్రభుత్వంగా తయారైందని విమర్శించారు. బీజేపీపై కొందరు విషం చిమ్ముతున్నారని.. దీన్ని తిప్పి కొట్టాలన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనపై మోదీ మాట్లాడతారని తెలిపారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాల్సి ఉందన్నారు. కుటుంబ పార్టీల వల్ల దేశంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో సుపరిపాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన రావాలని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ వ్యాగన్ ఫ్యాక్టరీ ద్వారా రోజుకు ఏడు గూడ్స్ బోగీల ఉత్పత్తి జరుగుతుందన్నారు. మోదీ తొలుత మామునూర్ ఎయిర్ పోర్ట్, అక్కడి నుంచి భద్రకాళీ గుడి, అక్కడ నుంచి ఆర్ట్స్ కళాశాలకు వస్తారన్నారు. ఇక్కడే శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు...

సాయి చంద్ భార్యకు పదవి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు కుసుమ జగదీష్, సాయి చందు అకాల మరణం చెందడం సీఎం కేసీఆర్‌ను ఎంతగానో కలిచివేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారంఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి సంతాపం తెలిపారు.

ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తామన్నారు. కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని వెల్లడించారు. సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని సీఎం నిర్ణయించారని అన్నారు. ఇరు కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయం ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందన్నారు. కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు....

ఖమ్మం జిల్లాలో యువకుడి దారుణ హత్య

ఖమ్మం జిల్లా :జూలై 07

జిల్లాలో ఓ యువకుడు శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్‌లో యువకుడిని కొందరు యువకులు హత్య చేశారు.

మృతుడు సాయి పవన్‌(23)గా గుర్తించారు. మరొక యువకుడు సాయి తీవ్రంగా గాయపడ్డారు. గంజాయి మత్తులో ఘర్షణ చోటు చేసుకుందని.. కత్తులతో యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయపడిన సాయిని చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

మృతుడు చికెన్‌ షాపులో పనిచేస్తున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. హాజరైన మంత్రి కేటీఆర్‌

విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయింది. హైదరాబాద్‌ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న

ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్ హరీశ్‌ రావు, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యాశాఖలో సుదీర్ఘంగా ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు. టెట్‌ నిర్వహణ, టీచర్ల నియామక ప్రక్రియ, మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి, రెండో విడుత అమలు వంటి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది...

అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే ఆశ వర్కర్లకు ఎక్కువ జీతాలు : మంత్రి హరీశ్‌ రావు

దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్‌ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. హైదరాబాద్‌ లో శుక్రవారం శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 15 వేల మంది ఆశావర్కర్లకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీతో కలిసి మంత్రి హరీశ్‌ రావు నియామక పత్రాలు అందేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒకప్పుడు ఏ రోగం వచ్చినా గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లేవాళ్లమని.. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. దీంతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో ఓపీ శాతం తగ్గిందని చెప్పారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మూడు ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్‌ చెప్పారు. కేసీఆర్‌ కిట్‌తో మాతా శిశు మరణాలను తగ్గించామని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా టీ-డయాగ్నొస్టిక్స్‌లో ఉచితంగా 134 పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణకు అసలైన డాక్టర్‌ హరీశ్‌ రావు: మంత్రి తలసాని

ఆశావర్కర్ల సేవలు మరచిపోలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణలోని ఆరోగ్య సేవలు దేశానికే ఆదర్శమన్నారు. ప్రజలు ప్రభుత్వ దవాఖానలవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కరోనా సమయంలో ఆశావర్కర్ల సేవలు విశేషమైనవని తెలిపారు. తెలంగాణకు అసలైన డాక్టర్‌.. మంత్రి హరీశ్‌ రావు అని వెల్లడించారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లకు రూ.9,750 వేతనం ఇస్తున్నామన్నారు....