/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz మాల్: ముత్తు పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం Mane Praveen
మాల్: ముత్తు పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ పట్టణంలోని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా, ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు ఇప్పటికే ఎన్నో కుటుంబాలను తన సేవా దృక్పథంతో ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. పగడాల ముత్తు జన్మదినం సందర్భంగా జులై 1న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ ఆఫీస్  వద్ద జులై 1న ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కర్మన్ ఘట్ జీవన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఐఐఐటీ లక్నో లో పీజీ సీట్ సాధించిన ఎన్జీ కళాశాల విద్యార్థి
నల్గొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థి శ్రీకాంత్ కు, జాతీయ స్థాయిలో  ఎమ్మెస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ సబ్జెక్టు పీజీలో, ఐఐటి జాయింట్  అడ్మిషన్ టెస్ట్-2023 పరీక్ష ద్వారా జాతీయస్థాయిలో మెరిట్ ద్వారా ఉత్తమ స్కోర్ వల్ల, త్రిబుల్ ఐటీ లక్నో లో సీట్ వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ గన్ శ్యామ్ తెలిపారు. ఈ సందర్భంగా  ఐఐటీ సీటు సాధించిన శ్రీకాంత్ ను కళాశాల ప్రిన్సిపాల్ ఘన శ్యామ్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్, కళాశాల అధ్యాపకులు నరసింహ, దీపిక, దుర్గాప్రసాద్, , మల్లేష్, వెంకటరమణ, మధుకర్, సూపరింటెండెంట్  కోటేశ్వరరావు , విద్యార్థికి జాతీయస్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో సీట్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేసి అభినందించారు.
నల్లగొండ, మిర్యాలగూడ లలో ఆగనున్న పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు
నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు, పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను నల్గొండ రైల్వే స్టేషన్ లలో నిలుపుటకు రైల్వే బోర్డ్ జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం... నర్సాపూర్ - లింగంపల్లి ఎక్స్ ప్రెస్, చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్ ప్రెస్, విశాఖ ఎక్స్ ప్రెస్, నాగర్ సోయిల్ - నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లకు నల్గొండలో స్టాప్ ఉన్నట్లు  తెలిపారు.

మిర్యాలగూడలో... చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్ ప్రెస్స్, తిరుపతి - లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్ ప్రెస్, భువనేశ్వరి - సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ ప్రెస్, నాగర్ సోల్ - నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లకు స్టాప్ ఉన్నట్లు తెలిపారు.
ఐసెట్ 2023లో సత్తా చాటిన ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన ఎన్సిసి  విద్యార్థి రావుల అనురాగ్ ఐసెట్ 2023 లో 261 ర్యాంకు సాధించారు. అదేవిధంగా ఎన్జీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన మరో విద్యార్థి బొల్లెద్దు వర్షిత్ కుమార్ 500 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఘన శ్యామ్ మరియు అధ్యాపకులు, కళాశాల లైబ్రేరియన్ దుర్గాప్రసాద్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
నల్గొండ: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు
నల్లగొండ పట్టణంలో విధి నిర్వహణలో భాగంగా,  వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆర్ సి, లైసెన్స్, హెల్మెట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటి పత్రాలు తనిఖీ చేశారు. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఫైన్ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో  వన్ టౌన్ సీఐ గోపి, ఏఎస్ఐ రాజు,  పోలీస్ సిబ్బంది సుదర్శన్, ఫారుక్, రాజు, కృష్ణ నాయక్ తదితరులు  పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ లను సందర్శించిన స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నాయకులు
నల్లగొండ జిల్లా
దేవరకొండ: స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ లను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసున్నారు. ఎస్ ఎస్ యూ  జిల్లా అధ్యక్షులు ఆకులపల్లి నరేష్, నియోజకవర్గ అధ్యక్షులు వింజమూరు శేఖర్ మాట్లాడుతూ.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందలేదని, హాస్టల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేని పరిస్థితి స్వయంగా చూడడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  ఉన్నప్పుడు గురుకులాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
8వ తరగతి గురుకుల పాఠశాల విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్, హయత్ నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్టులో నేడు విషాదం చోటుచేసుకుంది. మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రంజిత్ అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడని సమాచారం. మృతుడు రంజిత్ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని కేసారంకు చెందినట్టు తెలుస్తోంది. కాగా తల్లిదండ్రులు విద్యార్ధి ని సోమవారం (నిన్న) గురుకుల పాఠశాలలో చేరిపించి వెళ్లగా, ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. విద్యార్ధి ఆత్మహత్య కి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జూన్ 30న ఆలేరులో బాలికల ఫుట్బాల్ జట్టు ఎంపిక
జూలై 8 నుండి 11 వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీలకు, ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని జూన్ 30వ తేదీ శుక్రవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జెడ్ పి హెచ్ఎస్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనదలచిన బాలికలు 1.1.2010 - 31.12.2013 మధ్య జన్మించి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించిన వారు అర్హులన్నారు. ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీ తో జూన్ 30న ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పారు. వివరాలకు గడసంతుల మధుసూదన్, జాయింట్ సెక్రెటరీ  నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సెల్ నెం. 80743 46314 ను సంప్రదించాలని తెలిపారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని శ్రీమతి దొంతినేని వెంకట నర్సమ్మ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల స్థలంలో, వెజ్ మరియు నాన్ వెజ్ సమికృత మార్కెట్ నిర్మాణాన్ని ఉపసంహారణ చేసుకోవాలని ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, కలెక్టరేట్ జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దు చేయాలని, నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ  దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ..  ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల స్థలం లో వెజ్ మరియు నాన్ వెజ్ సమికృత మార్కెట్ నిర్మాణాన్ని ఉపసంహారణ చేసుకొనుట  గురించి గతంలో అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, కళాశాల ఆవరణ లో ఇప్పటికే కళాశాల ముందు భాగంలో సులబ్ కాంప్లెక్స్ మరియు గ్రంధాలయం నిర్మించడం వల్ల విద్యార్థులకు ఆటలు ఆడుకోవడానికి స్థలం లేక  ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మార్కెట్ నిర్మించడం వళ్ళ దుర్వాసనతో, విద్యార్థులకు అనారోగ్యం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ అధ్యక్షులు రమావత్ లక్ష్మణ్ నాయక్, ఉపాధ్యక్షులు, కుర్ర రాహుల్, కేతావత్ శ్రవణ్, దీపావతజ్ శ్రవణ్, దున్న రవి, బుషరాజు రాము, పావని, స్వరూప, అశ్విత, యామిని, శారద, నేనావత్ బాబులాల్, శివ తదితరులు  పాల్గొన్నారు.
జూన్ 19 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులకు రైతుబంధు: వ్యవసాయ అధికారి
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలోని పిఎసిఎస్ కేంద్రాల వద్ద జీలుగ, జనుము పచ్చి రొట్టె విత్తనాలు సబ్సిడీ పైన అందిస్తున్నట్లు మర్రిగూడ మండల వ్యవసాయ అధికారి స్పందన తెలిపారు. ఈ సందర్భంగా మర్రిగూడెం మండల కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. జీలగ విత్తనాలు సబ్సిడీ పైన రూ. 884 కు, జనుము విత్తనాలు రూ.1224 కు అందిస్తున్నట్లు, సబ్సిడీ లేకుండా వరి విత్తనాలు రూ. 883 కు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్స్ లను పిఎసిఎస్ కేంద్రాల వద్ద ఇచ్చి విత్తనాలు పొందాలన్నారు. అదేవిధంగా జూన్ 19 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులకు రైతుబంధు,, ఎకరాకు రూ. 5000/- చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం నూతనంగా పట్టాదార్ పాస్ బుక్ పొందిన రైతులు.. రైతుబంధు అప్లికేషన్, బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్స్ లను కార్యాలయంలో అందజేయాలని అన్నారు.