ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని శ్రీమతి దొంతినేని వెంకట నర్సమ్మ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల స్థలంలో, వెజ్ మరియు నాన్ వెజ్ సమికృత మార్కెట్ నిర్మాణాన్ని ఉపసంహారణ చేసుకోవాలని ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, కలెక్టరేట్ జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దు చేయాలని, నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల స్థలం లో వెజ్ మరియు నాన్ వెజ్ సమికృత మార్కెట్ నిర్మాణాన్ని ఉపసంహారణ చేసుకొనుట గురించి గతంలో అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, కళాశాల ఆవరణ లో ఇప్పటికే కళాశాల ముందు భాగంలో సులబ్ కాంప్లెక్స్ మరియు గ్రంధాలయం నిర్మించడం వల్ల విద్యార్థులకు ఆటలు ఆడుకోవడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మార్కెట్ నిర్మించడం వళ్ళ దుర్వాసనతో, విద్యార్థులకు అనారోగ్యం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ అధ్యక్షులు రమావత్ లక్ష్మణ్ నాయక్, ఉపాధ్యక్షులు, కుర్ర రాహుల్, కేతావత్ శ్రవణ్, దీపావతజ్ శ్రవణ్, దున్న రవి, బుషరాజు రాము, పావని, స్వరూప, అశ్విత, యామిని, శారద, నేనావత్ బాబులాల్, శివ తదితరులు పాల్గొన్నారు.
Jun 30 2023, 17:39