/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నీతో పనేంటి- ఆర్టీసీ బస్ నుంచి కండక్టర్‌ను గెంటేసిన మహిళా? Yadagiri Goud
నీతో పనేంటి- ఆర్టీసీ బస్ నుంచి కండక్టర్‌ను గెంటేసిన మహిళా?

బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు.

ఈ నెల 11వ తేదీన కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని కింద మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో ఆధార్ కార్డ్, ఓటరు కార్డు లేదా తాము కర్ణాటకలో నివసిస్తోన్నట్లు రుజువు చేసే ఏదైనా ఇతర గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది.

ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తరువాత అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటోన్నాయి. ప్రత్యేకించి- బస్ కండక్టర్ల పరిస్థితి రోజు రోజుకూ అధ్వాన్నంగా తయారవుతోంది. బస్సు మొత్తాన్ని మహిళా ప్రయాణికులు ఆక్రమించేసుకోవడంతో ఇక మిగిలిన వారికి టికెట్లు ఇవ్వలేని దుస్థితిని ఎదుర్కొంటోన్నారు. సంయమనాన్ని కోల్పోతున్నారు. ధార్వాడ జిల్లాలోని హుబ్లీలో ఓ ప్రయాణికురాలిపై మహిళా కండక్టర్ చేయి చేసుకోవడం.. దీనికి నిదర్శనం.

కుండ్గోల్ నుంచి హుబ్లీకి బయలుదేరిన బస్సులో సీట్ల విషయంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో శనివారం ఓ ప్రయాణికురాలు.. మహిళా కండక్టర్‌తో గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. దీనితో మహిళా కండక్టర్ ఆ ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించారు. దీనితో తోటి ప్రయాణికులు..కండక్టర్‌ను నీతో పనేంటి అంటూ బయటికి గెంటి వేసే ప్రయత్నంలో చివరికి డ్రైవర్ కొన్ని నిమిషాల పాటు బస్సును నిలిపివేసి, వారిని సర్దిచెప్పాల్సి వచ్చింది.....

నేడు తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన!!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌లో ఈరోజు నిర్వహించనున్న నవ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు.

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్‌ అభియాన్‌ లో భాగంగా నాగర్‌కర్నూల్‌లో ఈరోజు నిర్వహించనున్న నవ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు.

మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ బహిరంగ సభకు నవ సంకల్ప సభగా నామకరణం చేశారు. కాగా బీఆర్‌ఎస్‌ తో పోరుపై బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందంటూ ప్రచారం జరుగుతున్న వేళ నడ్డా రాష్ట్ర పర్యటనకు రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నడ్డా మినిట్ టు మినిట్ ప్రపోజల్ షెడ్యూల్..

ఆదివారం మధ్యాహ్నం 12.45గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నడ్డా చేరుకుంటారు. 1.15 గంటల నుంచి 2.30 వరకు సంపర్క్ సే అభియాన్‌లో భాగంగా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను కలవనున్నారు. తర్వాత జూబ్లీహిల్స్‌లో క్లాసికల్ డ్యాన్సర్.. పద్మశ్రీ ఆనంద శంకర ఇంటికి వెళతారు. అనంతరం ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావును కలవనున్నారు. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ళ పాలన, అభివృద్ధి గురించి వివరించి.. పుస్తకాలు అందజేయనున్నారు.

సాయంత్రం 3.00 గంటలకు తిరిగి నోవాటెల్ హోటల్‌కు నడ్డా చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకుని 4.15 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నాగర్ కర్నూల్ సభకు హెలికాప్టర్‌లో బయలుదేరతారు. 4.45 నిమిషాలకు నాగర్ కర్నూల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నాగర్ కర్నూల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో ఎర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం 6.10నిమిషాలకు నాగర్ కర్నూల్ నుంచి బయలుదేరి 6.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7.40 నిమిషాలకు ఎయిర్ పోర్ట్ నుంచి నడ్డా తిరువనంతపురంకు వెళతారు..

తిరుమలలో భక్తుల రద్దీ!!

తిరుపతి:జూన్ 25

తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం రోజు భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 83,889 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.10 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 40,495 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు......

రెండు రోజుల్లో ఢిల్లీకి షర్మిల : కాంగ్రెస్ ఢిల్లీ ముఖ్య నేతలతో భేటీ?

వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు, ప్రచారం జరుగుతున్న వేళ ఇందుకు ఊతమిచ్చేలా కీలక పరిణామం చోటుచేసుకుంది.

రెండు రోజుల్లో షర్మిల ఢిల్లీకి వెళ్తున్నారనే సమాచారం ఒక్కసారిగా గుప్పుమంది . ఈ పర్యటనలో ఆమె కాంగ్రెస్‌ ముఖ్యనేతలో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. కాగా వైఎస్ షర్మిల ఇప్పటికే కార్ణటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పలుమార్లు భేటీ అయిన విషయం తెలిసిందే.

ఢీకేతో భేటీ అయిన మరుసటి రోజే వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం, షర్మిల మధ్య చర్చలు జరిగినట్లుగా వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఏపీలో షర్మిల సేవలను వాడుకునేందుకు వీలుగా వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రతిపాదించారని.. విలీనానికి షర్మిల ఇష్టపడలేదనే వార్తలు వచ్చాయి. విలీనం లేదా పొత్తు ప్రతిపాదనలపై అటు హైకమాండ్‌, ఇటు షర్మిలకు మధ్య సమన్వయకర్తగా శివకుమార్‌ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని షర్మిల చెప్పారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వవైభవం సాధించే దిశగా వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు షర్మిల అంగీకరిస్తే, ప్రస్తుతం వైఎస్‌ఆర్టీపీలో ఉన్న చాలా మంది నేతలు మళ్లీ సొంతగూటికి వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.

తెలంగాణలో భవిష్యత్ అంటున్న షర్మిల

షర్మిలను పార్టీలో చేర్చుకుని పొగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని హస్తం పార్టీ తలపిస్తోంది. కానీ షర్మిల మాత్రం తన భవిష్యత్తు తెలంగాణతోనేనని ఇదివరకే కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. తన చివరి శ్వాస వరకూ తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాథాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పనిలేని.. పసలేని దార్శనికులకు తాను చెప్పేది ఒకటేనని, తన రాజకీయ భవితపైన పెట్టే దృష్టిని.. సమయాన్ని కేసీఆర్‌ పాలనపైన పెట్టాలన్నారు. కేసీఆర్‌ పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితపైన దృష్టి పెట్టాలని, కేసీఆర్‌ కుటుంబ అవినీతిని ఎండగట్టాలని సూచించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. ఆమె సేవలను ఏపీలో వినియోగించుకుంటామంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు...

భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకమైన శేపూరి రవీందర్

•హర్షం వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకమైన నకిరేకల్ నియోజకవర్గ నాయకులు చిట్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ చిట్యాల మండల మాజీ జెడ్పిటిసి

శేపూరి రవీందర్ గారి నియామకం పట్ల భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు హర్షం వ్యక్తం చేశారు. శేపూరి రవీందర్ కు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు ఇచ్చిన బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి,

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి గారికి మరియు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో బిజెపి పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేసే విధంగా రవీందర్ కు ఈ బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషకరం అని పల్లపు బుద్ధుడు అన్నారు.

హర్ ఘర్ ధ్యాన్ మిషన్ ద్వారా విశ్వశాంతి చేకూరుతుంది

•ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు.

ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ గారు బెంగళూరు ఆశ్రమంలో తెలంగాణ ప్రాంతం నుండి మా గురువుగారైన తెలంగాణ ప్రాంత సీనియర్ టీచర్ శ్రీ శ్రీనివాసరావును మరియు నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ను బెంగళూరు ఆశ్రమంలో సమావేశపరిచి తెలంగాణ లోని ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో ప్రతి పల్లెలో ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా

ప్రతి ఇంట్లో సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్, ప్రాణాయామం, బసిరికా, బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ యొక్క హర్ ఘర్ ధ్యాన్ మిషన్ ద్వారా విశ్వశాంతి చేకూరే విధంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ సభ్యులు వాలంటరీలు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని తెలియజేశారు.

తెలంగాణ ప్రాంతంలోని నల్లగొండ జిల్లాలో ప్రతినిత్యం ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా హ్యాపీనెస్ కోర్స్ నిర్వహిస్తూ అందుబాటులో ఉంటున్న నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ను పూజ్యశ్రీ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ గారు పూలమాలతో సత్కరించి ఆశీర్వదించారు.

ఈ యొక్క హర్ ఘర్ ధ్యాన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు చేరే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలని ఆయా గ్రామాల్లో రైతులు, మహిళలను, పెద్దలను, విద్యార్థులను, అనారోగ్యంగా ఉన్న వారిని మమేకం చేస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా అందరికీ ఆరోగ్యం ఆనందం కలిగే విధంగా ధ్యానం అందించాలని పూజ్యశ్రీ శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ తెలియజేశారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు అతి త్వరలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ వస్తానని అక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేద్దామని తెలియపరిచారు.

ఈ సమావేశంలో ఇంత గొప్ప అవకాశం కల్పించిన తెలంగాణ ప్రాంత సీనియర్ టీచర్ శ్రీనివాస్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు పల్లపు బుద్ధుడు తెలియజేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్, గంజి గోవర్ధన్, మాస శ్రీనివాస్, రావుల వెంకన్న, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటరీస్ పాకాల దినేష్, పాకాల సత్యనారాయణ, మర్రి హరీష్ రెడ్డి, సిద్ధ గాని అశోక్ గౌడ్, బొలుగూరి సైదులు, పల్లపు రాకేష్ పల్లపు సాయి, సారంగపాణి, అమ రోజు సందీప్ తదితరులు పాల్గొన్నారు

ఢిల్లీ బయలుదేరి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణపై భాజపా అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని దిల్లీ రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి కూడా దిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న కిషన్‌రెడ్డి.. దిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈటల, రాజగోపాల్‌రెడ్డితో నిర్వహించనున్న భేటీలో కిషన్‌రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భాజపా కాస్త డీలా పడినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించి.. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిపై భాజపా అధిష్ఠానం దృష్టి పెట్టింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇతర పార్టీలకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిని దిల్లీకి రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని నిర్ణయించింది. మొత్తం మీద తెలంగాణ భాజపా నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌తో కేటీఆర్ భేటీ!!

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమవుతున్నారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని మంత్రి కేటీఆర్, బీఆర్‌ఎస్‌ ఎంపీలు శనివారం కలిశారు. రాత్రి 10:15కి అమిత్‌షాను కేటీఆర్‌ కలవనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమంపైన హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్‌తో పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు. ఈ అంశంపైన తెలంగాణ రాష్ట్రం తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరీ కోరారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్ ఆర్ డి పి, లింకు రోడ్లు, పారిశుద్ధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అర్బన్ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను హర్దీప్ సింగ్ పూరికి అందించారు....

ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకూ 36 రైళ్ల రద్దు.. ఏ ఏ రైళ్లు.. కారణమేంటంటే..

సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకూ ఏకంగా 36 రైళ్లను రద్దు చేసింది.

అలాగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేసింది. హైదరాబాద్ - సికింద్రాబాద్ మార్గంలో ట్రాక్ మరమ్మతు పనుల కోసం ఈ రైళ్ల రద్దును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

26 నుంచి రద్దు కానున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఏవంటే..

లింగంపల్లి - హైదరాబాద్

హైదరాబాద్ - లింగంపల్లి

చందానగర్ - లింగంపల్లి

లింగంపల్లి - చందానగర్

లింగంపల్లి - ఫలక్నుమ

ఫలక్‌నుమ - లింగంపల్లి

రామచంద్రపురం - ఫలక్‌నుమ

రద్దు కానున్న 36 రైళ్లు..

కాజీపేట-డోర్నకల్ డోర్నకల్-కాజీపేట

డోర్నకల్ విజయవాడ

విజయవాడ డోర్నకల్

భద్రాచలం - విజయవాడ

విజయవాడ - భద్రాచలం

సికింద్రాబాద్ - వికారాబాద్

వికారాబాద్ - సికింద్రాబాద్

సికింద్రాబాద్ - వరంగల్

వరంగల్ - హైదరాబాద్

సిర్పూర్ టౌన్ - కరీంనగర్

కరీంనగర్ - సిర్పూర్ టౌన్ కరీంనగర్ -నిజామాబాద్

నిజామాబాద్-కరీంనగర్

కాజీపేట-సిర్పూర్ టౌన్

బల్హర్షా-కాజీపేట

భద్రాచలం - బళ్లార్ష

సిర్పూర్ టౌన్ - భద్రాచలం

కాజీపేట - బల్హర్షా

బల్హర్షా-కాజీపేట

కాచిగూడ-మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్- కాచిగూడ కాచిగూడ - రాయచూరు

రాయచూరు - గద్వాల్

గద్వాల్ - రాయచుర్

రాయచురు - కాచిగూడ

సికింద్రాబాద్ - మేడ్చల్

మేడ్చల్-సికింద్రాబాద్

మత్తుతో విద్యార్థి చిత్తు

నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. సన్ సిటీ వద్ద ఓ విద్యార్థి డ్రగ్స్ తీసుకుంటుండగా శనివారం నార్సింగి పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అతని వద్ద 5 గ్రాముల MDMA డ్రగ్స్, 14 ఇన్సులిన్ సిరెంజస్, ఓ వెయింగ్ మిషన్ తో పాటు నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.

డ్రగ్స్‌తో పట్టుబడిన విద్యార్థి సాకేత్‌.. ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని గన్నవరం నివాసి. బెంగుళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ప్రాంతంలో విక్రయించడానికి వచ్చి పోలీసులకు సాకేత్ పట్టుబడ్డాడు.

NDPS యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరికి విక్రయించడానికి వచ్చాడు? బెంగుళూరు లో సాకేత్‌కు డ్రగ్స్ ఎవరు?ఇచ్చారు అనే కోణంలో నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ...