/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz చిక్కిన చిరుత : ఊపిరి పీల్చుకున్న భక్తులు Yadagiri Goud
చిక్కిన చిరుత : ఊపిరి పీల్చుకున్న భక్తులు

తిరుమల:జూన్ 24

తిరుమల నడక దారిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు ఆ చిరుత కోసం జల్లెడ పట్టారు. మొత్తానికి చిరుత బోనుకి చిక్కింది.

అలిపిరి మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుతగా అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతను అటవీ అధికారులు బంధించారు. దీంతో.. ఈ ఘటన జరిగినప్పటి నుంచి బిక్కుబిక్కుమంటూ నడక దారిలో వెళుతున్న శ్రీవారి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

చిరుతను పట్టుకోవడానికి తిరుమల నడక దారిలో రెండు బోన్లు, 30 కెమెరాలను ఏర్పాటు చేశారు. 2008లో కాలి నడక భక్తులపై చిరుత దాడి చేసినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తాజా ఘటనలో కూడా బాలుడిపై చిరుత దాడి చేసినా మెడ, ముఖం పైన గాయాలు తప్ప ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే దాడి చేసిన చిరుతను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ప్రాంతంలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో తెలుసుకోవడానికి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

అసలేం జరిగిందంటే..

పోలీస్‌ పోస్టు వెనుక వైపు అడవిలోకి బాలుడిని చిరుత పులి నోట కరుచుకుని ఈడ్చుకుంటూ వెళ్లింది. కాసేపటికి దాదాపు 20 మంది పోగయ్యారు. అందరూ కలిసి మొబైల్‌ టార్చ్‌లు ఆన్‌ చేసుకుని అడవిలోకి బయలుదేరారు. అరుస్తూ, కేకలు పెడుతూ అడవంతా గాలించారు. దాదాపు 25 నిమిషాల తర్వాత 150 మీటర్ల దూరంలో రిపీటర్‌ స్థలం వెనుక లోయలో పిల్లాడి ఏడుపు వినిపించింది. ధైర్యం చేసి కిందికి దిగారు. ముఖమంతా నెత్తురోడుతూ చిన్నారి కౌశిక్‌ రోదిస్తున్నాడు. అమాంతం బిడ్డను జవురుకుని రోడ్డు మీదకి జనం పరుగు తీశారు.

ప్రాణాలతో దక్కిన బిడ్డను గుండెలకు హత్తుకుని అల్లుకుపోయింది తల్లి. ఆ తర్వాత భద్రతా సిబ్బంది సాయంతో ఆసుపత్రికి బాబుని తరలించారు. జనం అరుపులు కేకలు, రాళ్ల దాడితో బెదిరిపోయిన చిరుత పులి పిల్లాడిని వదిలి బతుకుజీవుడా అంటూ పారిపోయింది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆస్పత్రిలో చిన్నారి కౌశిక్‌ కోలుకుంటున్నాడు.కౌశిక్‌ను శుక్రవారం టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పరామర్శించారు......

తిరుమలలో నేడు శనివారం భక్తుల రద్దీ

తిరుపతి :జూన్ 24

తిరుమలలో నేడుశనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

నిన్న శుక్రవారం శ్రీవారిని 72,304 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 32,504 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

రాజ్‌నాథ్ సింగ్‌తో కేటీఆర్ భేటీ, అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీలో కలిశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కంటోన్మెంట్ లో స్కైవేల నిర్మాణంపై చర్చించమన్నారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, మౌళిక వసతుల కల్పనలో కేంద్రం చేయూత నివ్వాలన్నారు.

అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని కోరామన్నారు. రాజీవ్ రహదారిలో స్కైవే నిర్మాణానికి 96 ఎకరాల కంటోన్మెంట్ ల్యాండ్ అడిగామన్నారు. ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇస్తామన్నారు. 9 ఏళ్ల నుంచి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.

కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన సాయం సున్నా అన్నారు. హైదరాబాద్ లో స్కై వాక్స్ నిర్మిస్తున్నామన్నారు. ఉప్పల్ లో స్కై వాక్ ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. లీజ్ ల్యాండ్స్ ని జీహెచ్ ఎంసీకి బదలాయించాలని కోరామన్నారు. తెలంగాణకు చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు...

ఖమ్మం జిల్లా లో కాంగ్రెస్ నుంచి గాడిదను నిలబెట్టిన గెలుస్తోంది: రేణుకా చౌదరి

బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

పొంగులేటి చేరిక నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన ఆమె తనకు ఖమ్మం జిల్లాలో మూడు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు వార్తలు వచ్చాయి.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికను స్వాగతించిన ఆమె.. 24 గంటల గడవక ముందే స్వరం మార్చారు. కాంగ్రెస్ పార్టీలో గాడిదను నిలబెట్టినా గెలుస్తుందన్న రేణుకా చౌదరి.. పొంగులేటికి అంత సత్తా, ఫాలోయింగ్ ఉంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే 10కి 10 సీట్లు ఎందుకు గెలవలేకపోయాడని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి.

కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తర్వాత మంచి జోష్ మీదన్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ల రూపాన స్పీడ్ బ్రేకులు పడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీని వదిలి హస్తం గూటికి చేరాలనుకుంటున్న నేతలకు ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే అడ్డు తగులుతున్నట్లు ఉన్నాయి. రాష్ట్రంలో మంచి ఇమేజ్, కేడర్ ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఇప్పటికే కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే తమకు ఎలాంటి సమాచారం లేకుండానే రేవంత్ రెడ్డి వారిని చేర్చుకుంటున్నారని నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుస్సా అయ్యారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఇది సమసిపోతున్న క్రమంలోనే రేణుకా చౌదరి చేసిన కామెంట్స్ రేవంత్ రెడ్డికి కంటిమిద కునుకు లేకుండా చేస్తున్నాయి..........

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో ఈరోజు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం సందర్భంగా

ఆ మహానీయునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ తన చిత్రపటానికి పూలమాలవేసి తులసి మొక్కను నాటిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు. ఏక్ దేశ్ మే దో విధాన్, ధో ప్రధాన్, ధో నిషాన్ నహి చలేగా, అంటూ నినదించి దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన జన సంఘ్ వ్యవస్థాపకులు గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు అని అన్నారు.

ఖండిత భారతపు అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పుణ్యతిధి నేడు అని అన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతమాత కన్న మహా సంతానంలో ఒకరు వారి జీవితంలో ప్రతిక్షణం శరీరంలో ప్రతి కణం మాతృభూమి సేవకే సమర్పితం అయ్యాయి అని అన్నారు. గాఢాంధకార భవిష్యత్తులో మునిగి ఉన్న భారత ప్రజానీకానికి భారతీయ జన సంఘం ద్వారా నూతన దిశను ప్రారంభించారు.

భౌతిక సుఖాలే లక్ష్యంగా మనుషులను యంత్రాలుగా మార్చి పని చేయించే విధానాల ద్వారా ఏ జాతి గొప్పదనాన్ని సాధించలేదు. పాఠ్యాత్యుల నైపుణ్యం విజ్ఞానం నుండి శక్తిని సంపాదించుకునే విధంగా మన సంస్కృతి నాగరికతలతో విద్యా విధానాన్ని అనుసంధానం చేయడమే మన ఆదర్శం కావాలి అని స్వర్గీయ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అన్నారన్నారు. కాశ్మీర్ గురించి ఎన్నో పోరాటాలు చేశారు అని అన్నారు.

మాతృభూమి సేవలో నిజమైన యోధుడిగా శ్యామ ప్రసాద్ కాశ్మీర్ విలీనం కోసం సాగిన పోరాటంలో అగ్ర భాగాన నిలిచి బలిదానం చేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసం అయితే బలిదానం అయ్యారో దానిని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 370వ అధికరణను తొలగించి వారికి ఘనమైన నివాళి అర్పించింది అని పల్లపు బుద్ధుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నకిరేకల్ అసెంబ్లీ కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, మీడియా సెల్ కన్వీనర్ ఉయ్యాల లింగ స్వామి గౌడ్, చిట్యాల మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు పొలిమేర రామ్ కుమార్, బూత్ కమిటీ అధ్యక్షులు ఈదుల పవన్, చింతకాయల రాము, మల్లేష్ యాదయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

BJP: ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి భాజపా అధిష్ఠానం పిలుపు..

దిల్లీ: తెలంగాణపై భాజపా అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని దిల్లీ రావాలని ఆదేశించారు..

ఈ మేరకు వీరిద్దరు ఇవాళ లేదా రేపు దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమాలకు పలువురు సీనియర్లు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భాజపా కాస్త డీలా పడినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించి.. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిపై భాజపా అధిష్ఠానం దృష్టి పెట్టింది.

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇతర పార్టీలకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిని దిల్లీకి రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకొంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని నిర్ణయించింది. మొత్తం మీద తెలంగాణ భాజపా నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..

తెలంగాణకు భారీ వర్షసూచన

హైదరాబాద్ :జూన్ 23

తెలంగాణకు చల్లటి కబురు అందింది. చాలా రోజుల నుంచి మండుటెండలతో సతమతం అయిన ప్రజలకు తీపి కబురు అందింది.

నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు,రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

ముఖ్యంగా నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేటతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయంట...

జైలు నుంచి బయటకొచ్చి మళ్లీ 3 హత్యలు

•సైకో సీరియల్‌ కిల్లర్‌ అరెస్టు

రాజేంద్రనగర్ అతను కరడుగట్టిన నేరస్థుడు. అయిదుగుర్ని కిరాతకంగా చంపాడు. ఒళ్ళు గగుర్పొడిచే నేరచరిత్ర ఉన్న అతనికి యావజ్జీవ శిక్ష పడింది. కానీ క్షమాభిక్ష లభించి జైలు నుంచి బయటికొచ్చాడు. మళ్లీ అతనిలో ఉన్మాది నిద్రలేచాడు. వరుసగా మూడు హత్యలు చేశాడు. హైదరాబాద్‌ ప్రజలను భయభ్రాంతులను చేసిన ‘సైకో సీరియల్‌ కిల్లర్‌’ బ్యాగరి ప్రవీణ్‌ (34)ను పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు.

ఈ కేసుల వివరాలను రాజేంద్రనగర్‌ డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. రాజేంద్రనగర్‌ ఇంద్రారెడ్డి నగర్‌ బస్తీకి చెందిన ప్రవీణ్‌ కూలీ పనిచేసేవాడు. 2011లో బుద్వేల్‌లో ప్రకాశ్‌ అనే వ్యక్తి బయట పడుకుని ఉండగా బండరాయితో మోది చంపాడు. కొన్ని రోజులకు అలాగే అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.127 వద్ద ఓ యాచకుడిని హతమార్చాడు. తర్వాత ప్రవీణ్‌ తన మిత్రులు షేక్‌ ఫయాజ్‌, దర్గా నరేశ్‌తో కలిసి ఇంద్రారెడ్డినగర్‌ బస్తీకి చెందిన భార్యాభర్తలు, వారి కొడుకుని హత్య చేశారు. ఇంటి బయట పడకున్న వ్యక్తిని చంపి, ఇంట్లోకి వెళ్లి అతని భార్యపై అత్యాచారం చేసి గొంతు కోసి హతమార్చారు. ఆమె పక్కనే ఉన్న కొడుకుని కూడా చంపి పారిపోయారు. అప్పట్లో వరసగా జరిగిన 5 హత్యలు కలకలం రేపాయి. 2014 జూన్‌లో ప్రవీణ్‌కు యావజ్జీవ శిక్ష పడింది. గతేడాది అక్టోబరు 29న క్షమాభిక్షపై విడుదలయ్యాడు. తర్వాత ప్రవీణ్‌లోని ఉన్మాది మళ్లీ నిద్రలేచాడు. ఈ నెల 8న నేతాజీనగర్‌లో ఆరుబయట పడుకున్న గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశాడు. మంగళవారం (20వ తేదీ)అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మరో ఇద్దర్ని చంపాడు. కాటేదాన్‌ స్వప్న థియేటర్‌ సమీపంలో ఖజారియా దుకాణం ముందు పడుకున్న గుర్తు తెలియని వ్యక్తి తలపై బండరాయితో మోది చంపి అతని వద్ద ఉన్న రూ.400 తీసుకుని దుర్గానగర్‌ వైపు వెళ్లాడు. అక్కడ దుప్పట్లు అమ్ముకునే ప్రకాశ్‌ (55) అనే వ్యక్తి ఆరుబయట పడుకుని ఉండగా అతని తలపై బండరాయితో మోది హత్య చేశాడు. అతని వద్ద ఉన్న రూ.1500 తీసుకుని పారిపోయాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు నిందితుడిని 24 గం టల్లో పట్టుకున్నారు. ప్రవీణ్‌పై చోరీ, దోపిడీ, చైన్‌స్నాచింగ్‌ కేసులు కూడా ఉన్నట్టు గుర్తించారు...

మాల్ ప్రాక్టీస్ కింద 29 మంది విద్యార్థులు బుక్

కేయూ క్యాంపస్ :జూన్ 23

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నేడు జరిగిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 29 మంది మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ పి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎ నరేందర్ తెలిపారు.

200 మంది మాల్ ప్రాక్టీస్ క్రింద బుక్ కావడం నిజమేనా?

కేయూ పరిధిలో ఇప్పటి వరకు నిర్వహించిన డిగ్రీ పరీక్షల్లో సుమారు గా 200 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ క్రింద బుక్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థుల ను ఎడాపెడా మాల్ ప్రాక్టీస్ క్రింద బుక్ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. పరీక్షల నిర్వహణకు కనీస సౌకర్యాలు లేని పరీక్షా కేంద్రాలను బాధ్యులు చేయకుండా విద్యార్థులను చిన్న చిన్న కారణాలతో డిబార్ చేస్తుండడంతో, ఇటీవలి కాలంలో యూనివర్సిటీ లో పరీక్షల ఫీజులు కూడా పెద్ద ఎత్తున పెంచే సరికి ఈ కోణంలో ఏమైనా కారణం ఉందా అని ఫెయిల్,డిబార్ అయిన విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఫెయిల్,డిబార్ విద్యార్థులు ఫీజులు తప్పనిసరిగా కట్టాల్సి వస్తుంది.

ఫీజులు రూపంలో గణనీయంగా వసూలు చేసుకోవడానికి ఈ విధంగా డిబార్ అనే కారణాలతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సమాచారం. అసలు విశ్వవిద్యాలయంలో సరిపోయినంత మంది బోధనా సిబ్బంది లేరు అనే అపవాదు ఉండనే ఉన్నది. దీనికి తోడు భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్ తదితర కేంద్రాలకు తనిఖీలకు వెళ్లడానికి సిబ్బంది ఎలా సరిపోతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనా ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీ పరిధి లో రెండు వందల మంది విద్యార్థుల ను మాల్ ప్రాక్టీస్ క్రింద బుక్ చేసి అపవాదు మూట కట్టుకొంటున్నది. చూడాలి ఇంకా ఎంత మందిని బుక్ చేస్తారో...

కెసిఆర్ తక్షణమే అనాథలకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి - MRPS

కలెక్టర్ కార్యాలయం ముందు "అనాథల అరిగోస దీక్ష"

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాథలకు అనేక హామీలు ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఒక్క హామీ కూడా ఇప్పటివరకు కేసీఆర్ నెరవేర్చలేదని తక్షణమే అనాథలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ గారి పిలుపుతో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు MRPS, మహాజన సోషలిస్ట్ పార్టీ(MSP) ఆధ్వర్యంలో అనాథ పిల్లలతో "అనాథల అరిగోస దీక్ష"ను చేపట్టారు.

ఈ దీక్షకు MSF జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ.. సమాజంలో తల్లిదండ్రులు లేని, సంరక్షకులు లేని అత్యంత నిస్సహాయులైన అనాథలను సైతం మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.

KCR అనాథలకు అనేక హామీలుఇస్తూ అనాథలకు ఇక ప్రభుత్వమే అమ్మానాన్న అని, వారికి గురుకుల పాఠశాలలు ఏర్పరుస్తామని, అనాథ పిల్లలందరికీ స్మార్ట్ కార్డులు ఇస్తామని, వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, వారికి ఆర్థిక భద్రతను కల్పిస్తామని, రోడ్లపైన కూడళ్ల పైన బిక్షటన చేసే వారిని ప్రభుత్వమే గుర్తించి హోమ్స్ లో షేల్టర్ కల్పిస్తామని, అనాథల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడి యాక్ట్ నమోదు చేస్తామని అనేక హామీలు ఇచ్చి వీటి పైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు కూడా చేసి ఇప్పటివరకు ఒక్క హామీనీ నెరవేర్చలేదని అన్నారు.

తక్షణమే వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని,వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ దీక్షలో అనాథ బాలురు, బాలికలు పాల్గొన్నారు.

ఈ దీక్షలో MSP నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ, MRPS నల్లగొండ జిల్లా ఇంచార్జీ బోడ సునీల్ మాదిగ, MRPS జిల్లా కో- కన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ, MSP జిల్లా నాయకులు ఆడేపు నాగార్జున మాదిగ, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి శంకర్ మాదిగ, MSP నాగార్జునసాగర్ ఇంచార్జ్ మడుపు శ్రీనివాస్ మాదిగ, MSP మిర్యాలగూడ ఇంచార్జ్ మచ్చ ఏడుకొండల్ మాదిగ, MSP మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ కొమిరే స్వామి మాదిగ, ఎంఎస్పి నల్గొండ మండలం ఇంచార్జ్ బొజ్జ దేవయ్య MRPS నాయకులు సన్నీ మాదిగ, ఏర్పుల వెంకటయ్య బోర్ర మోష, ఏడుకొండలు మాదిగ , MSF నాయకులు త్రినేత్ర మాదిగ, వంగూరి బన్ని మాదిగ, విజ్ఞాన్ మాదిగ, శివ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి తదితర నాయకులు పాల్గొన్నారు.