హైదరాబాద్ లో ఎం జరుగుతుంది ❓️
శాంతిభద్రతల్లో దేశంలో అంత్యంత సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా హైదరాబాద్ పేరు తెచ్చుకుంది.. కానీ ఇప్పుడు ఆ పేరుకే ప్రశ్న తగిలేలా పరిస్థితి ఏర్పడింది.. జంట నగరాల్లో 15 గంటల్లోనే ఐదు ప్రాంతాల్లో హత్యలు జరిగాయి. గంటల వ్యవధిలో జరిగిన హత్యలు భాగ్యనగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి..ఇంతకీ ఈ హత్యలకు కారణం ఎంటి ?? లక్షలాది సీసీ కెమెరాలు ఉన్నాయన్న భయం ఏ మాత్రం నిందితులకు పట్టనట్టు ఉంది..
హైదరాబాద్‌లో అసలేం జరుగుతోంది.. ఒక వైపు శాంతి భద్రతల పరిరక్షణ లో దేశంలోనే నెంబర్ 1 గా. తెలంగాణ పోలీస్..కానీ ఇలా గంటల వ్యవధిలోనే ఇన్ని దారుణ హత్యలు ఆందోళనకరంగా మారాయి.అర్ధరాత్రి టప్పాఛబుత్రలో ఇద్దరు ట్రాన్స్జెండర్ల హత్యను గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ లిమిట్స్‌లో రెండు హత్యలు జరిగాయి.
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో కొట్టి దుండగులు చంపారు. చాదర్‌ఘాట్ పీఎస్ లిమిట్స్ పరిధిలో మరొకరిని హత్య చేశారు. అజంపురాలో గుర్తుతెలియని వ్యక్తిని హతమార్చారు దుండగులు. రాత్రే కాదు పట్టపగలు సైతం హత్యలు చేస్తున్నారు. వరుస హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఇక మరో వైపు నార్సింగిలో తనను ప్రేమించలేదని యువతిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. బాధితురాలు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా.. నిందితుడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ గుంటూరు జిల్లాలో ఒకే ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. ఇక చాదర్ ఘాట్‌లో ఓ యువకుడిని నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. యువకుడిని వెంబడించిన ఓ వ్యక్తి.. అతడిని కత్తితో వెనుక నుంచి పొడిచి పారిపోయాడు. బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజంపురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడి బైక్‌పై తన భార్యను చూసి కోపోద్రిక్తుడైన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది,......
Jun 22 2023, 09:14