/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పశువుల రవాణా బిల్లు 2023 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరణ Yadagiri Goud
పశువుల రవాణా బిల్లు 2023 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరణ

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ అండ్ లైవ్‌స్టాక్ ట్రాన్స్‌పోర్ట్ బిల్లు 2023ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది, అయితే విస్తృత నిరసనల తర్వాత, డ్రాఫ్ట్ ఇప్పుడు ఉపసంహరించబడింది.

అవసరాన్ని బట్టి, పశువుల దిగుమతి చట్టం 1898లో మార్పులు చేస్తూ, పశువుల ఉత్పత్తి మరియు పశువుల దిగుమతి మరియు విస్తరణ బిల్లు 2023 యొక్క ముసాయిదా పబ్లిక్ డొమైన్‌లో ఉంచబడింది.

సంప్రదింపుల సమయంలో, ప్రతిపాదిత డ్రాఫ్ట్‌ను అర్థం చేసుకోవడానికి మరియు తదుపరి వ్యాఖ్యలు లేదా సూచనలను అందించడానికి తగిన సమయం అవసరమని గమనించినట్లు డ్రాఫ్ట్ ఉపసంహరణ అధికారిక ఉత్తర్వు పేర్కొంది.

ఇంకా, జంతు సంక్షేమం మరియు సున్నితత్వాలు మరియు భావోద్వేగాలకు సంబంధించిన సంబంధిత అంశాలతో కూడిన ప్రతిపాదిత ముసాయిదాపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రాతినిధ్యాలు అందించబడ్డాయి మరియు అందువల్ల విస్తృత సంప్రదింపులు అవసరం.

"పై పరిగణనలను దృష్టిలో ఉంచుకుని మరియు సమర్థ అధికారం యొక్క ఆమోదంతో, ప్రతిపాదిత ముసాయిదా బిల్లు ఉపసంహరించబడుతుంది" అని ఆర్డర్ పేర్కొంది.

జంతు హక్కుల కార్యకర్తలు, రైట్‌వింగ్ గ్రూపులు మరియు జైన మత పెద్దలు ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు, వారు వివిధ కారణాల వల్ల దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్‌లోని వర్గాలు ఈ బిల్లు విచ్చలవిడి పశువుల బెడదకు దివ్యౌషధం కావచ్చని, అయితే మతపరమైన మనోభావాలు మరియు సాంస్కృతిక విశ్వాసాలను దెబ్బతీసేందుకు సంస్థ అనుమతించదని పేర్కొంది.

2022-23లో, భారతదేశం $5.11 మిలియన్ల విలువైన ప్రత్యక్ష పశువులను ఎగుమతి చేస్తుందని అంచనా వేయబడింది, వీటిలో ఎక్కువ భాగం గొర్రెలు మరియు మేకలు.

ఈ జంతువులను పండుగల సమయంలో పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తారని వాణిజ్య వర్గాలు తెలిపాయి.

“పశువుల దిగుమతి మరియు ఎగుమతి బిల్లు జంతువుల పట్ల క్రూరత్వాన్ని స్పష్టంగా పెంచుతుంది. పశువుల నిర్వచనంలో కుక్కలు మరియు పిల్లులు మరియు పక్షులను చేర్చడం హాస్యాస్పదంగా ఉంది. ఈ బిల్లు ఖచ్చితంగా శాపం, దీనిని వ్యతిరేకించాలి.

న్యూజిలాండ్ వంటి దేశాలు సజీవ జంతువులను సరుకులుగా రవాణా చేసే క్రూరమైన పద్ధతిని నిలిపివేసినట్లు జంతు హక్కుల కార్యకర్త ఫైజాన్ జలీల్ మీడియాకు తెలిపారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు.. రేవంత్‌తో కీలక భేటీ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపార్టీలో చేరుతున్నారనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పొంగులేటి ఎపిసోడ్‌ ఉత్కంఠతకు ఇవాళ్టితో తెరపడనుంది. పొంగులేటి కాంగ్రెస్‌లో ఎంట్రీకి దాదాపు ఖాయమైంది. హస్తంపార్టీలో చేరేందుకు అటు పొంగులేటి సైతం రంగం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్‌లో చేరికపై అనుచరులతో కలిసి అధికారికంగా ప్రకటించనున్నారు పొంగులేటి.

దీనికోసం ఇప్పటికే ముఖ్య అనుచరులతో మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్‌కు రావాలంటూ అనుచరులకు ఫోన్లు చేశారు. అనౌన్స్‌మెంట్ తర్వాత నియోజక వర్గానికి ఇద్దరు చొప్పున తన అనుచరులతో కలిసి పొంగులేటి ఢిల్లీ వెళ్లనున్నారు.

ఇక ఇవాళ పొంగులేటి ఇంటికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జూపల్లి, పొంగులేటితో సమావేశం అవుతారు రేవంత్‌ రెడ్డి. పార్టీలో చేరాల్సిందిగా ఇద్దరి నేతలను రేవంత్ ఆహ్వానించనున్నారు.

ఇదే క్రమంలో పొంగులేటితో పాటు వచ్చే మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా రేవంత్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. రేవంత్‌తో భేటీ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. యూస్ టూర్‌ను ముగించుకుని 22న ఢిల్లీకి చేరుకోనున్నారు. రాహుల్ ఢిల్లీకి రాగానే తమ అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు పొంగులేటి, జూపల్లి వెళ్లి.. ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని పేర్కొంటున్నారు.

ముందుగా బీఆర్‌ఎస్‌ పట్ల అసంతృప్తిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కరే ప్రకటించగా.. నెల రోజుల క్రితం ఆయనకు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆయనతో జత కలిశారు. జూపల్లి జతకలిశాక.. తాము ఎటువైపు వెళ్లాలన్నదానిపై పలు సమావేశాలు కూడా నిర్వహించారు. ఒకానొక దశలో స్వంతగా పార్టీని ఏర్పాటు చేస్తారనే టాక్ కూడా వినిపించింది. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి ఖమ్మం, మహబూబ్ నగర్ లలో నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై కూడా వారి ఆత్మీయులతో సుధీర్ఘంగా చర్చించారు....

India: ఉగ్రవాదులకు చైనా అండ.. మండిపడ్డ భారత్‌..

దిల్లీ: పాకిస్థాన్‌ కేంద్రంగా విద్రోహ చర్యలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్‌ మిర్‌ను నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చకుండా చైనా అడ్డుపుల్ల వేసింది..

దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

'అనేక సభ్య దేశాలు మద్దతు ఇచ్చినప్పటికీ.. ఈ ప్రతిపాదన విజయవంతం కాకపోతే, గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఆర్కిటెక్చర్‌లో నిజంగా ఏదో తప్పు ఉందని నమ్మడానికి మాకు న్యాయమైన కారణాలు ఉన్నాయి. అల్పమైన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను నిషేధిత జాబితాలోకి చేర్చలేకపోతే.. మనకు ఉగ్రవాదంపై పోరాడే నిజమైన సంకల్పం లేనట్టే' అని చైనాపై తీవ్రంగా మండిపడింది.

ఎవరీ సాజిద్‌ మీర్‌..

పాక్‌ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా ఉగ్ర ముఠాలో సాజిద్‌ మీర్‌ 2001 నుంచి కీలక సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 2006 నుంచి 2011 వరకు ఈ ముఠా విదేశాల్లో జరిపిన దాడులకు మీర్‌ ఇంఛార్జ్‌గా వ్యవహరించాడు. 2008లో ముంబయిలో చోటుచేసుకున్న 26/11 పేలుళ్లలో ఇతడే కీలక సూత్రధారి. అతడిపై అమెరికా 5 మిలియన్‌ డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. కాగా.. గతంలో సాజిద్‌ మీర్‌ చనిపోయినట్లు పాకిస్థాన్‌ ప్రచారం చేసింది. కానీ, పశ్చిమ దేశాలు నమ్మలేదు. అతడి మృతిపై ఆధారాలు చూపించాలంటూ డిమాండ్‌ చేశాయి. దీంతో వెనక్కి తగ్గిన పాక్‌.. గత ఏడాది జూన్‌లో అతడికి 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

మరోపక్క, భారత్‌ సాజిద్‌ను మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. సాజిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ భారత్‌, అమెరికా సంయుక్తంగా ఓ ప్రతిపాదననూ సిద్ధం చేశాయి. దీనిని ఐక్యరాజ్య సమితి(ఐరాస)లోని భద్రతా మండలికి చెందిన 'అల్‌ఖైదాపై ఆంక్షల కమిటీ'సమావేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా చైనా అడ్డుకుంది.

ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం: గవర్నర్‌ నజీర్‌

విజయవాడ: దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, ఏపీలో కూడా యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి..

కాగా, రాజ్‌భవన్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌భవన్‌లో అధికారులతో కలిసి గవర్నర్‌ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు స్పెషల్‌ సీఎస్‌ అనిల్‌ కుమార్‌ సింఘల్‌ యోగాసనాలు వేశారు. అనంతరం, గవర్నర్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం.

యోగా ప్రక్రియ ద్వారా మానసిన ప్రశాంతత చేకూరుతుంది. యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా అంతర్గత శక్తి, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగాతో అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు..

గద్దర్‌ కొత్త పార్టీ : పెట్టబోతున్నారా❓️

గద్దర్‌ తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? ప్రస్తుతం రాజకీయాల్లో ఇదే చర్చ కొనసాగుతుంది. గత కొద్దీ రోజులుగా గద్దర్ ఏ పార్టీ లో చేరుతారనే చర్చ కొనసాగుతుండగా..గద్దర్ మాత్రం ఓ పార్టీ లోకి వెళ్లడం కంటే తానే కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ పార్టీకి గద్దర్ అధ్యక్షుడిగా, నరేష్ కార్యదర్శిగా, గద్దర్ సతీమణి నాగలక్ష్మి కోశాధికారిగా వ్యవహరించబోతున్నారు. మూడు రంగులతో ఉండే పార్టీ జెండాలో పిడికిలి గుర్తు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల కమిషన్‌తో భేటీ అయి గద్దర్ ప్రజా పార్టీ పేరును కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. గద్దర్ విప్లవానికి పోరాటానికి ప్రతీక. అందువల్లే “గద్దర్ ప్రజా పార్టీ” జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది.

గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఉద్యమానికి ఆకర్షితులై ఆయన పాటలతో ప్రజల్లోకి వెళ్లారు. బహుజనులను జాగృతం చేసేందుకు ప్రయత్నించారు. పాటలతో ఉద్యమాన్ని రగిలించారు. పాటతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి.. పాటతోనే ప్రజా ప్రస్థానాన్ని ముగిస్తానని చెప్పిన గద్దర్ ఓట్ల రాజకీయాలపై రావాలని నిర్ణయించుకున్నారు.

గద్దర్ చాలా కాలంగా రాజకీయ పార్టీలతో కలుస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో సమావేశం అయ్యారు. మునుగోడు ఎన్నికలకు ముందు కేఏ పాల్ ను కూడా కలిశారు. ఆయన సమక్షంలోనే .. తన ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ ను అభ్యర్థిగా ప్రకటించారు పాల్. తర్వాత గద్దర్ సైలెంట్ అయ్యారు. ఇటీవల కేసీఆర్‌ పై పోటీ చేస్తానని ప్రకటిస్తారు. ఈ క్రమంలో సొంత పార్టీ పెట్టడంతో ఆ ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది.....

Lohit Express: తప్పిన రైలుప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్‌ప్రెస్‌..

ఒరిస్సా రైలు ప్రమాదం ఘటన మరిచిపోకముందే.. మరో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోహిత్ ​ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు ఇంజన్‌ నుంచి విడిపోయాయి..

అస్సాంలోని గౌహతి నుంచి జమ్మూ తపాయికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. దీంతో లోహిత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు పార్ట్ లుగా విడిపోయింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర భమాందోళనకు గురయ్యారు. కొందరు భయంతో రైలు నుంచి కిందికి దూకారు..

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని దల్‌ఖోలా - బీహార్‌లోని కిషన్‌గంజ్ మధ్య ఉన్న సూర్యకమల్ రైల్వే స్టేషన్ దగ్గరలో మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంజన్‌ ముందుకు కదిలి వెళ్లిపోవడంతో.. దాదాపు పది కోచ్‌లు పట్టాలపైనే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటన ఘటనాస్థలికి చేరుకుని ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను ఆపివేశారు.

అనంతరం విడిపోయిన బోగీలను మళ్లీ ఇంజిన్‌కు జతచేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే రైలు 16 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కప్లింగ్ వైఫల్యం కారణంగా రైలు కోచ్‌లు విడిపోయినట్లు తెలుస్తోంది. ఒరిస్సా రైలు ప్రమాదం జరిగిన తర్వాత వరుసగా ట్రైన్ యాక్సిడెంట్స్ కు సంబంధించినవి ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ట్రైన్ లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు జంకుతున్నారు.

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస కత్తిపోట్ల కలకలం

హైదరాబాద్ :జూన్ 21

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం వరుస కత్తిపోట్లు కలకలం రేపాయి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అనంతరం మందుబాబులు చెలరేగిపోయారు.

మద్యం మత్తులో కత్తిపోట్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కరోజే మూడు కత్తిపోట్ల ఘటనలు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.

ఈ మూడు ఘటనల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కళ్యాణోత్సవం అనంతరం గత రాత్రి జరిగిన ఘటనలుగా పోలీసులు గుర్తించారు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు...

SB NEWS

జూబ్లీహిల్స్‌లోని క్యూటీబీ పబ్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్:జూన్ 21

నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల ఓ పబ్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 1671, జూబ్లీహిల్స్‌ 36 క్యూటీబీ పబ్‌లోని నాలుగవ అంతస్థులో అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుచ్చారు.

కాగా.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది....

SB NEWS

తిరుమలలో నేడు భక్తుల రద్దీ

తిరుమల :జూన్ 21

తిరుపతి లో నేడు బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు17 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం 71,935 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి హుండీ ఆదాయం 4.11 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 31,831 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

SB NEWS

జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం

•శుభాకాంక్షలు తెలియజేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు

చిట్యాల మండల మరియు మున్సిపాలిటీ ప్రజలకు జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గారు శుభాకాంక్షలు తెలియజేశారు.

ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ గారు విశ్వశాంతి కొరకు ప్రతి ఒక్కరు ప్రతినిత్యం యోగా చేయాలని అదేవిధంగా సుదర్శన క్రియ, ప్రాణాయామం, మెడిటేషన్ చేయడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అన్నారు, సర్వరోగ నివారిణి యోగ అని పల్లపు బుద్ధుడు అన్నారు, యోగ అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం అని,

మోక్ష సాధనలో భాగమైన ధ్యానం అంతః దృష్టి పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది అని, ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడుపడుతుందని, పతంజలి యోగ సూత్రాల ద్వారా ధారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒక్కచోట చేర్చారన్నారు, శరీర ధారుడ్యానికి, ఆరోగ్య సంరక్షణకి రోగ నిరోధకానికి సహాయ పడే శారీరక ఆసనాలను అష్టాంగ యోగము వివరిస్తుందన్నారు.

జీవితం ఆనందదాయకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా, సుదర్శన క్రియ ప్రతినిత్యం చేయాలన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా హ్యాపీనెస్ అనే కోర్సుతో ఒత్తిడిని పారదోలి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు, ధ్యానం మరియు ఉఛ్వాస నీశ్వాసలను చక్కగా పొందుతారని తెలియజేశారు. శ్వాసను పట్టుకో ఆరోగ్యాన్ని పెంచుకో జీవితం ఆనందదాయకంగా ఉంటుందన్నారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారు ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల లోని అన్ని వర్గాలవారు 45 మిలియన్ ప్రజలకు దీని ద్వారా గొప్ప ప్రయోజనాలను పొందారన్నారు. అదేవిధంగా చిట్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో యోగా, సుదర్శన్ క్రియ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తామన్నారు.