ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
రైల్వే మంత్రి వెంటనే రాజీనామా చేయాలి.
మృతుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం తో పాటు,భద్రత గల ఉద్యోగం ఇవ్వాలి.
ఈరోజు మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన బి.ఎస్.పి ముఖ్య కార్యకర్త సమావేశంలో మునుగోడు నియోజకవర్గం నాయకులు పెండెం ధనుంజయ నేత పాల్గొని మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్ప గిస్తున్నది. అందు కోసం ఆయా రంగాల రెగ్యులర్ ఉద్యోగులను తగ్గిస్తూ కాంట్రాక్ట్ కార్మికులను పెంచుతున్నది.
రెండు జూన్ రాత్రి ఏడున్నర గంటలకు జరిగిన ప్రమాదం కూడా రైల్వేలో ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక పరిణామా ల ఫలితమే నని రైల్వే కార్మికులు అంటున్నారు.
ప్రైవేటీ కరణ వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల సంఖ్య చాలా తగ్గించారు. ట్రాక్ పరిశీలన చేసే వాళ్లు తగ్గి పోయారు. ఇంకో వైపు ఈ పాత ట్రాక్ ల మీదనే వేగంగా నడిచే వందే భారత్ రైళ్లు ప్రవేశ పెడుతున్నారు.
ఏకారణాలతో పట్టాలు ఎలా మారుతున్నాయో పరిశీలన లేదు. రైల్వే శాఖ వైఫల్యానికి ఆ రైళ్లలో ప్రయాణం చేస్తున్న వారి నిండు ప్రాణాలు బలి అయ్యాయి. ఇవి కేవలం ప్రమాద మరణాలు కావు. రైల్వే శాఖ చేసిన హత్యలు.
మహబూబ్ నగర్ జిల్లా లో అప్పన్న పల్లి దగ్గర రైల్ ప్రమాదం జరిగినప్పుడు రైల్వే శాఖ మంత్రి గా ఉండిన లాల్ బహదూర్ శాస్త్రి గారు తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జరిగింది అంతకన్నా మూడు నాలుగు రెట్లు పెద్ద తీవ్ర ప్రమాదం.
కరుణ గల భారత ప్రజలందరూ ఈ ప్రమాదాన్ని ప్రభుత్వ వైఫల్య మని గుర్తించాలని బాధితులకు న్యాయం కోసం కృషి చేయాలని కోరుతున్నాము.
ప్రధాన మంత్రి, రైల్వే మంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటనలు చేస్తూ కన్నీరు కారుస్తూ చేతులు దులుపుకుంటున్నారు. వీరందరూ దేశంలో అమలు అవుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విధానాలకు బాధ్యులు. ఈ మరణాలకు కూడా వీరు బాధ్యత వహించాలి.
ప్రతి బాధిత కుటుంబానికి ఒక కోటి రూపాయల పరిహారం తో పాటు ప్రతి కుటుంబానికి ఒక భద్రత గల ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం.
ఊహించకుండా మృత్యు వాత పడిన, కోలుకోలేని విధంగా గాయాల బారిన పడిన వారందరికీ సానుభూతి ప్రకటిస్తూ...
ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి నాయకులు బొట్టు శివ, పందుల సూరన్న, హరీష్, తీగల రమేష్, శివ, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


 
						






 

 ప్రెస్ నోట్..
ప్రెస్ నోట్..

 ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం ఇది..! తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం ఇది..! తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
 

 నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల, మునిసిపల్ చైర్మన్ సైదిరెడ్డి
నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల, మునిసిపల్ చైర్మన్ సైదిరెడ్డి


 అభాగ్యులకు అండగా
అభాగ్యులకు అండగా పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే కంచర్ల
పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే కంచర్ల
 NLG: కిడ్స్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే
NLG: కిడ్స్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే
 Haryana: ఆఫీస్‌లో ఉద్యోగులు బీర్ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!
Haryana: ఆఫీస్‌లో ఉద్యోగులు బీర్ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!
Jun 12 2023, 11:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
28.0k