/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది Yadagiri Goud
బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది

బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు.

ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో హాస్టల్స్ రూముల తాళాలు పగల గొట్టిన సిబ్బంది.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేశారు.

ఈ నెల 7వ తేదీ నుండి విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఉండటంతో వారు తిరిగొచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలు.. పడేసిన సామాన్లు కోసం వెతుక్కోవాలా? లేదా పరీక్షలు రాయాలా? అని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు ఏవైనా ఆటంకాలు కలిగితే.. అందుకు బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాలని హెచ్చరించారు...

చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. దంపతులు మృతి.. కుమార్తెకు తీవ్రగాయాలు

విశాఖపట్నం:

భీమిలి బీచ్‌ రోడ్డులోని జోడుగుళ్లపాలెం సమీపంలో గల బేపార్క్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. వారి మూడేళ్ల కుమార్తె తీవ్రగాయాలతో కేజీహెచ్‌లో చికిత్సపొందుతోంది.

ఆరిలోవ పోలీసుల కథనం మేరకు.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరుకు చెందిన మైలపల్లి పెద్దయ్య (28) ఉపాధి కోసం చాలాకాలం కిందట విశాఖ నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. వన్‌టౌన్‌లోని పెయిందొరపేటలో నివాసం ఉంటున్నాడు.

చేపలకంచేరులో బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో శనివారం ఉదయం భార్య పావని (24), పెద్ద కుమార్తె నిషిత (3), ఏడాది వయస్సు కలిగిన రెండో కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పెళ్లి తంతు ముగియగానే నగరానికి తిరుగుపయనమయ్యారు.

చిన్నకుమార్తెను ఆటోలో వస్తున్న బంధువులకు ఇచ్చి భార్య, పెద్దకుమార్తెను తీసుకుని బైక్‌పై పెద్దయ్య నగరానికి బయలుదేరాడు. తెల్లవారుజామున 4.30 గంటలకు బీచ్‌రోడ్డులో జోడుగుళ్లపాలెం సమీపంలోని బేపార్క్‌ వద్దకు వచ్చేసరికి రోడ్డుపక్కన ఉన్న చెట్టుని ఢీకొనడంతో ముగ్గురూ డివైడర్‌పై పడిపోయారు.

పెద్దయ్య తలకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలపాలైన పావని, నిషితను సమీపంలోని గీతం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పావని మృతిచెందగా, నిషితను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఆరిలోవ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు....

ఖమ్మంలో మరో మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య

నిప్పంటించుకున్న విద్యార్థిని మానస

కొన్నాళ్ల క్రితమే తండ్రి మృతి

ఆ మనోవేదనే బలవన్మరణానికి కారణం?

ఖమ్మం జిల్లా :

సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన మరువకముందే.. ఖమ్మంలో మరో మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

వరంగల్‌ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందిన సముద్రాల మానస (22) ఖమ్మం మమత మెడికల్‌ కళాశాలలో డెంటల్‌ నాలుగో ఏడాది చదువుతూ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది.

ఆదివారం రాత్రి హాస్టల్‌ భవనం పై అంతస్తులో తాను ఉంటున్న గదిలోకి వెళ్లిన మానస.. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఆమె గదిలో నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన సీనియర్‌ విద్యార్థిని కేకలు వేయడంతో హాస్టల్‌ సిబ్బంది, విద్యార్థులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగలగొట్టి మంటలను ఆర్పారు. కానీ, మానస అప్పటికే మృతి చెందింది.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి వద్దకు చేరుకుని మానస మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా..కొంతకాలం క్రితం మానస తండ్రి మృతి చెందారని.. అప్పట్నుంచీ ఆమె మనోవేదనతో ఉందని సమాచారం...

సిగ్నల్‌ లోపం వల్లే...!

•కోరమండల్‌ ట్రాక్‌పై రెడ్‌సిగ్నల్‌

•అందుకే ట్రాక్‌ మారి లూప్‌ లైన్లోకి

సిగ్నల్‌ సమస్యే ప్రమాదానికి ప్రధాన కారణమని రైల్వే శాఖ సంయుక్త తనిఖీ కమిటీ తేల్చింది. కోరమండల్‌ మొదటి మెయిన్‌ లైన్లోంచి లూప్‌ లైన్లోకి మారి దానిపై గూడ్సును ఢీకొట్టి పట్టాలు తప్పింది. దాని బోగీలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని వెళ్లి రెండు మెయిన్‌ లైన్లపై పడ్డాయి. అదే సమయంలో రెండో మెయిన్‌ లైన్‌పై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ ఆ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి’’ అని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. అందులో ఇంకా ఏముందంటే...

సాయంత్రం 6.52 గంటల సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బహనగా స్టేషన్‌ను దాటుతుండగా ప్రమాదం జరిగింది.

ఈ స్టేషన్‌ వద్ద రెండు మెయిన్‌ లైన్లతో పాటు వాటికిరువైపులా రెండు లూప్‌ లైన్లున్నాయి.

పాసింజర్‌ హాల్ట్‌ స్టేషన్‌ గనుక ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు వచ్చినప్పుడు గూడ్స్‌లను లూప్‌ లైన్లకు తరలిస్తారు.

శుక్రవారం సాయంత్రం ఒక గూడ్స్‌ ముందుగా స్టేషన్‌ సమీపానికి చేరుకుంది. వెనకే కోరమండల్‌ వస్తుండటంతో గూడ్స్‌ను లూప్‌లైన్‌కు మళ్లించారు.

కోరమండల్‌ వెళ్లాల్సిన మెయిన్‌ లైన్‌పై అప్పటికి రెడ్‌ సిగ్నల్‌ ఉంది. స్టేషన్‌ సిబ్బంది 17ఏ స్విచ్‌ నొక్కి దాన్ని గ్రీన్‌గా మార్చాలి. కానీ ఆ స్విచ్‌ను నొక్కినా పని చేయలేదు (సిగ్నల్‌ ఇచ్చి, మళ్లీ వెనక్కు తీసుకున్నారని కూడా చెబుతున్నారు). రెడ్‌ సిగ్నలే కొనసాగడంతో కోరమండల్‌ లూప్‌లైన్‌లోకి మళ్లి గూడ్స్‌ను ఢీకొట్టింది.

గూడ్స్‌ని బలంగా ఢీకొట్టిన తర్వాత కోరమండల్‌ కోచ్‌లు ఎగిరిపడి.. పక్కన ఉన్న మరో మెయిన్‌లైన్‌పైకి వెళ్లాయి.

 అదే సమయంలో ఆ లైన్‌లో 130 కి.మీ. వేగంతో (116 కి.మీ. అని కూడా చెప్తున్నారు) వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌ చివరి బోగీలపై కోరమండల్‌ బోగీలు పడ్డాయి. దాంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

హౌరా 3 నుంచి 5 సెకెన్ల ముందుగా వచ్చుంటే ప్రమాదం తప్పేది.

సూపర్‌ ఫాస్ట్‌ రైళ్ల గరిష్ట వేగం 130 కి.మీ.

ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు....

సారూ... మీరు మారిపోయారా❓️

అవును.. సారు మారిపోయారు.. ఎంతలా అంటే బాబోయ్ ఇంతకీ ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనా.. లేకుంటే వేరేనా..? అనేంతలా మారిపోయారు..! ఈయన ప్రసంగం విన్న తెలంగాణ ప్రజానీకం ఒకింత కంగున్నది..!.. ఇక ప్రతిపక్షాలు అయితే నోరెళ్లబెట్టాయి.. గులాబీ బాస్‌లో సడన్‌గా ఇంత మార్పు ఏంటబ్బా..? అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం ఆలోచనలో పడ్డారు.. ఇందుకు కారణం ఆదివారం నాడు నిర్మల్ బహిరం ఏం మాట్లాడారు.

సీఎం కేసీఆర్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా.. బహిరంగ సభలో మాట్లాడినా మాటకు ముందు.. వెనుక బీజేపీని దుమ్మెత్తి పోస్తుండేవారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రతో మొదలుపెట్టిన బహిరంగ సభలు మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించాలని లెక్కలేసుకుని మరీ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన పలువురు కీలక నేతలకు గులాబీ కండువా కప్పారు.. ఇప్పటికే ఒకసారి ఎన్నికలో కూడా పాల్గొన్నారు. ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో ముందుకెళ్తున్న కేసీఆర్.. బీజేపీని విమర్శించడానికి ఏ చిన్న చాన్స్ వచ్చినా సరే అస్సలు వదులుకోరు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు సందర్భాల్లో అందరూ గమనించే ఉంటారు. అధికారుల బదిలీలు, పోస్టింగ్ లాంటి కీలక విషయాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టినెన్స్ విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోరాటం చేస్తున్నారు. ఇందుకు కేసీఆర్ మద్దతు కూడా ఇచ్చారు. ఇటీవలే.. హైదరాబాద్ వేదికగా ఈ ఇద్దరు కలుసుకుని మీడియా మీట్ పెట్టి.. బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంపై తాడోపేడో తేల్చుకునేంత రేంజ్‌లో ఆగ్రహంతో ఊగిపోతూ కేసీఆర్ ప్రసంగించారు. అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు కూడా బీజేపీపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మాట్లాడేవారు. కానీ.. గులాబీ బాస్ ఎందుకో మారిపోయారు.. ఇన్ని బద్ధ శత్రువుగా చూసిన బీజేపీని మిత్రుడిగా చూస్తున్నారు..!

కేజ్రీవాల్- కేసీఆర్ భేటీ జరిగి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు.. ఈ వ్యవధిలోనే సార్ ఎందుకో మారిపోయారు..! ఆదివారం నాడు నిర్మల్‌లో జిల్లా క‌లెక్టరేట్‌, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో బాస్ మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలు, యథావిధిగా బీజేపీపై విమర్శలు ఉంటాయని బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు.. తెలంగాణ ప్రజానీకం ఆశించింది కానీ.. కేసీఆర్ వింత వైఖరి ప్రదర్శించారు. అరగంటపైగా కేసీఆర్ ప్రసంగించినప్పటికీ ఎక్కడా బీజేపీ ఊసే ఎత్తలేదు. బీజేపీని పూర్తిగా పక్కనెట్టిన కేసీఆర్.. కాంగ్రెస్‌పై విమర్శల దాడికి దిగారు. ఇన్నిరోజులు బీజేపీ అంటే ఒంటికాలిపై లేచిన సారు.. ఇప్పుడు పూర్తిగా పక్కనెట్టేశారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీ పార్టీ పేరు పలకడానికి కేసీఆర్ సాహసించలేదు. అంతేకాదండోయ్.. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ శాపనార్థాలు కూడా పెట్టారు. 50 ఏళ్ల పాలనలో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతు బంధుకు రాం రాం... రైతు బీమాకు జై భీమ్ చెబుతారని తెలంగాణ ప్రజలను కేసీఆర్ హెచ్చరించారు. ఇదే సభావేదికగా నిర్మల్‌ జిల్లాలోని 396 గ్రామపంచాయతీలకు రూ.10 లక్షలు.. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు.. జిల్లాలోని 19 మండలాలకు రూ.25 లక్షల చొప్పున నిధులు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

మొత్తానికి చూస్తే.. ఇన్నిరోజులుగా కేసీఆర్ వర్సెస్ బీజేపీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయాయన్న మాట. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అని ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు గాను బీజేపీతో కేసీఆర్ చేతులు కలిపారని పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పాటు ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ బీజేపీ గురించి పొల్లెత్తి మాట కూడా మాట్లాడకపోవడం ఆ అనుమానాలు, ఆరోపణలను నిజం చేసినట్లయ్యింది. ఇన్నిరోజులుగా బీజేపీని దుమ్ములేచిపోయే రేంజ్‌లో తిట్టిన కేసీఆర్ సడన్‌గా ఇలా మారిపోవడం వెనుక ఏం జరిగిందో.. ఏంటో మరి..!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు సోమవారం స్వామివారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఆదివారం స్వామివారిని 87,434 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 39,957 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

SB NEWS

Rahul Gandhi: తెలంగాణలోనూ భాజపాను తుడిచిపెట్టేస్తాం: రాహుల్‌ గాంధీ

న్యూయార్క్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు..

తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లోనూ భాజపా (BJP) తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాదని.. యావత్తు దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని భాజపాపై నిప్పులు చెరిగారు.

''భాజపాను తుడిచిపెట్టేయగలమని కర్ణాటకలో నిరూపించాం. మేం వారిని కేవలం ఓడించలేదు. తుడిచిపెట్టేశాం'' అని న్యూయార్క్‌లో ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌- యూఎస్‌ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ (Rahul Gandhi) అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్‌, వాషింగ్టన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో కార్యక్రమాలను ముగించుకొని మాన్‌హాటన్‌ చేరుకోనున్నారు..

2024 ఎన్నికల్లోనూ భాజపా (BJP)ను ఓడిస్తామని రాహుల్‌ అన్నారు. ప్రతిపక్షాలు ఏకమయ్యాయని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఓవైపు భాజపా విద్వేషపూరిత సిద్ధాంతం.. మరోవైపు కాంగ్రెస్‌ ప్రేమపూర్వక సిద్ధాంతం ప్రజల ముందున్నాయని వ్యాఖ్యానించారు..

కర్ణాటక ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ మంత్రి టి వెంకటేష్ గోవధపై వివాదాస్పద వ్యాఖ్య

గేదెలు, ఎద్దులను వధిస్తే ఆవులను ఎందుకు వధించకూడదు

కర్ణాటక ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ మంత్రి టి వెంకటేష్ గోవధపై రాజకీయాలు వేడెక్కేలా చేసిన ప్రకటన.. గేదెలు, ఎద్దులను వధిస్తే ఆవులను ఎందుకు వధించకూడదని ఆయన శనివారం వివాదానికి దిగారు. రాష్ట్రంలోని గత బొమ్మై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆవు వధ మరియు పశువుల సంరక్షణ (సవరణ) బిల్లు 2020కి సవరణలను పరిశీలిస్తోంది. కర్నాటక పశుసంవర్ధక, పశువైద్య శాఖ మంత్రి కె.వెంకటేష్‌ చేసిన ప్రకటన ఈ దిశగా సాగుతోంది.కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్ణాటక ప్రభుత్వ మంత్రులు రోజుకో కొత్త ప్రకటనలు చేస్తున్నారు. భజరంగ్‌దళ్‌పై నిషేధం విషయం.. హిజాబ్‌ వ్యవహారం.. ఇలా అన్ని విషయాలపై మంత్రులు ప్రభుత్వానికి బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారు.

మైసూరులో విలేకరుల సమావేశంలో టి వెంకటేష్ మాట్లాడుతూ కర్ణాటక జంతు వధ నిరోధక మరియు జంతు సంరక్షణ చట్టాన్ని సంప్రదింపుల తర్వాత ఉపసంహరించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు సాయం చేస్తానన్న వాడు ఉదాహరిస్తే నిర్ణయం తీసుకుంటానని మంత్రి వెంకటేశ్‌ మాట్లాడుతూ.. నా నివాసంలో మూడు నాలుగు ఆవులను పెంచుతానని, అందులో ఒకటి చనిపోయిందని, దీని కోసం చాలా కష్టపడ్డానని మంత్రి అన్నారు. అంతిమ సంస్కారాలు.. 25 మంది కష్టపడాల్సి వచ్చినా మృతదేహాన్ని పైకి లేపలేకపోయారు.

అతను ఎద్దులు మరియు గేదెలను వధించడానికి అనుమతించే 1964 చట్టాన్ని ఉదహరించాడు, అయితే కొత్త చట్టం అన్ని వయస్సుల ఆవులు, దూడలు మరియు ఎద్దులను మరియు 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న గేదెలను వధించడాన్ని నిషేధిస్తుంది. ఎద్దులు, గేదెలను వధించేందుకు చట్టం అనుమతిస్తే ఆవులను ఎందుకు చంపకూడదని అన్నారు.

కర్ణాటకలో జంతువులకు సంబంధించిన చట్టాన్ని సవరించడం, ఆపై బిల్లును ఉపసంహరించుకోవడం కొత్తేమీ కాదని మీకు తెలియజేద్దాం. 1964 చట్టాన్ని సవరిస్తూ 2010 మరియు 2012లో బిఎస్ యడ్యూరప్ప యొక్క మునుపటి బిజెపి ప్రభుత్వం ఆవు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే దీని తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిల్లును ఉపసంహరించుకుంది. ఆ తర్వాత బొమ్మయి ప్రభుత్వం వచ్చి మళ్లీ సవరణలు చేసి ఇప్పుడు మళ్లీ చట్టాన్ని తిప్పికొట్టాలనే చర్చ సాగుతోంది.

ప్రపంచంలో ఫస్ట్ టైమ్.. సెక్స్ టోర్నమెంట్?

స్వీడన్ :

ఇప్పటి వరకూ ఫుట్ బాల్ టోర్నమెంట్ చూసి ఉంటారు.. బాస్కెట్ బాల్ టోర్నమెంట్ చూసి ఉంటారు.., క్రికెట్ టోర్నమెంట్ చూసి ఉంటారు. అయితే ప్రపంచంలో మెుదటిసారిగా.. సెక్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజంగా నిజం.

ఇప్పటి వరకు.. క్రికెట్, ఫుట్ బాల్ టోర్నమెంట్స్ చూసి ఉంటారు. ఇక రోజులు మారాయి. ఇప్పుడు కొత్త రకం టోర్నమెంట్ చూడబోతున్నారు. అదే రతి క్రీడా పోటీలు. ప్రపంచంలో ఇలా ఎప్పుడూ లేదు. మెుదటిసారిగా సెక్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మరికొన్నిరోజుల్లో రతి క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ సెక్స్ టోర్నమెంట్ జూన్ 8 నుండి స్వీడన్‌ లోని గోథెన్‌బర్గ్‌లో మెుదలవుతాయి. స్వీడన్ సెక్స్‌ను అధికారిక క్రీడగా ప్రకటించింది. పైన పేర్కొన్న తేదీ నుండి సంబంధిత టోర్నమెంట్‌లు దేశంలో జరుగుతాయి.

ఆ మధ్య కాలంలోనూ స్వీడన్ దేశం కొత్తరకం రూల్ తో ముందుకు వచ్చింది. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు డ్యూటీ మధ్యలో సెక్స్(Sex) కోసం ఒక గంట పెయిడ్ పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఏకంగా రతి క్రీడా పోటీలనే నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ వార్త వైరల్ అయింది. జూన్ 8వ తేదీ నుంచి గోథెన్ బర్గ్ లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ క్రీడా పోటీలు నిపుణుల పర్యవేక్షణలో జరుగుతాయి. న్యాయనిర్ణేతల అభిప్రాయాలతో గెలుపోటములు నిర్ణయిస్తారు.

ఇలా రతి క్రీడా పోటీలు నిర్వహించడం ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైమ్. ఇందులో ఆడా, మగా ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే ఒక కండీషన్ ఉంది.. సెక్స్ టోర్నమెంట్ లో రోజుకు 6 గంటలపాటు పాల్గొనాలి. అంటే రోజుకు ఆరు గంటలు అలసిపోవాలన్నమాట.

ఈ టోర్నమెంట్లో ఊరికనే పాల్గొంటే గెలవారు. చాలా రకాలుగా ప్రయత్నం చేస్తేనే విజయం సాధిస్తారు. మసాజ్, ఓరల్ సెక్స్, అందమైన భంగిమలు, కష్టమైన భంగమలు ఇలా అన్నింటిని ట్రై చేసి.. మెప్పించాలి. మరో విషయం ఏంటంటే.. సెక్స్ చేస్తే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా చేసే శబ్దాలు కూడా గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభమైతే.. ఇంటర్నెట్ షేక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదేనా సైట్ లో లైవ్ ఇస్తే మాత్రం.. వ్యూయర్ షిప్ ఘోరంగా వస్తుంది. ఈ రతి క్రీడలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు...

పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సురక్షా దినోత్సవం

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సురక్షా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఫుట్‌ పెట్రోలింగ్‌, బైక్‌ రాల్యీలు, పెట్రోలింగ్‌ కార్లు‌, బ్లూ క్లోట్స్‌, ఫైర్‌ వెహికిల్స్‌తో ర్యాలీ నిర్వహిస్తున్నారు.

సురక్షా దినోత్సవంలో భాగంగా హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీని హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. లిబర్టీ, అబిడ్స్‌, చార్మినార్‌, తెలుగుతల్లి విగ్రహం మీదుగా ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, అగ్నిమాపక శకటాలను ప్రదర్శించారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పోలీసుల బైక్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని

వీధులమీదుగా సాగిన ర్యాలీలో ఎమ్మెల్యేల ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌ పోలీసుల బైక్‌ ర్యాలీని ప్రారంభించారు.

నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ప్రారంభించారు.

పెద్దపల్లిలో ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు,

భూపాలపల్లిలో గండ్ర వెంకట రమణారెడ్డి పోలీసు బైక్‌ ర్యాలీ, కవాతును ప్రారంభించారు....