/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సురక్షా దినోత్సవం Yadagiri Goud
పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సురక్షా దినోత్సవం

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సురక్షా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఫుట్‌ పెట్రోలింగ్‌, బైక్‌ రాల్యీలు, పెట్రోలింగ్‌ కార్లు‌, బ్లూ క్లోట్స్‌, ఫైర్‌ వెహికిల్స్‌తో ర్యాలీ నిర్వహిస్తున్నారు.

సురక్షా దినోత్సవంలో భాగంగా హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీని హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. లిబర్టీ, అబిడ్స్‌, చార్మినార్‌, తెలుగుతల్లి విగ్రహం మీదుగా ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, అగ్నిమాపక శకటాలను ప్రదర్శించారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పోలీసుల బైక్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని

వీధులమీదుగా సాగిన ర్యాలీలో ఎమ్మెల్యేల ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌ పోలీసుల బైక్‌ ర్యాలీని ప్రారంభించారు.

నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ప్రారంభించారు.

పెద్దపల్లిలో ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు,

భూపాలపల్లిలో గండ్ర వెంకట రమణారెడ్డి పోలీసు బైక్‌ ర్యాలీ, కవాతును ప్రారంభించారు....

రైలు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్‌.. పరిహారం వివరాలు ఇవే..

తాడేపల్లి: ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

కాగా, బాలాసోర్‌ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి మృతిచెందారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలుస్తూ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాదంలో మృతిచెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇ‍వ్వాలన్నారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం సాయానికి అదనంగా పరిహారం ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు..

Odisha Train Accident: నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్‌ దిగ్భ్రాంతి..

వాషింగ్టన్‌: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident)పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

ఈ హృదయ విదారక వార్త వినగానే తన మనసు చలించిపోయిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

''భారత్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించిన విషాద వార్త విని నా హృదయం ముక్కలైంది. జిల్‌ బైడెన్‌ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భయానక ఘటన వల్ల ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలు, గాయపడిన వారి గురించి ప్రార్థిస్తున్నాం.

భారత్‌, అమెరికాను ఇరు దేశాల కుటుంబ, సాంస్కృతిక విలువల్లో ఉన్న మూలాలే ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో మా ఆలోచనలన్నీ బాధితుల కుటుంబాలపైనే ఉన్నాయి'' అని బైడెన్‌ అన్నారు..

నిర్మల్ జిల్లా కేంద్రంలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన..

నిర్మల్ జిల్లా :

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

అలాగే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఆ తరువాత ఆయన నేరుగా కొండాపూర్‌ వద్ద నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఎల్లపెల్లి రోడ్డు క్రషర్‌ స్థలంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మొత్తం సీఎం కేసీఆర్‌ పర్యటన బాధ్యతలను తన భుజాలపై వేసుకొని గత వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎం పాల్గొనే బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్మల్ జిల్లా నేతలు తలపెట్టారు. కాగా ఇప్పటికే నిర్మల్‌ పట్టణాన్ని గులాబీమయం చేశారు. భారీ ఫ్లెక్సీ బ్యానర్‌లు, కటౌట్‌లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఈ భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో నిర్మల్‌ పట్టణమంతా గులాబీమయంగా మారిపోయింది.

దాదాపు 2500 మంది పోలీసులు సీఎం సభ కోసం బందోబస్తు చేపడుతున్నారు. పట్టణ నలుమూలల నుంచి జనం కేసీఆర్‌ సభకు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉండడంతో రెండు కిలో మీటర్ల దూరంలోనే వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొత్త కలెక్టరేట్‌, పార్టీ ఆఫీసును అందంగా అలంకరించారు.....

మెరుస్తున్న సిరిసిల్ల.. బోసిపోయిన కరీంనగర్​

కరీంనగర్ :

తెలంగాణ దశాబ్ది వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలు రెడీ అవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసులు, పబ్లిక్​ ప్లేసుల్లో విద్యుత్​ లైట్ల వెలుగులతో అలంకరించారు. కానీ ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్​లో ఆ ఏర్పాట్లేమీ కనిపించడం లేదు.

కలెక్టరేట్​, సిటీలోని బస్టాండ్​ జంక్షన్​, కోర్టు జంక్షన్​, గీతా భవన్​ జంక్షన్లలో ఏర్పాట్లు చేయకపోవడంతో చీకట్లోనే ఉన్నాయి..  అమరవీరుల స్థూపానికి సైతం లైటింగ్​ ఏర్పాటు చేయలేదు. దీంతో సిటీలో దశాబ్ది ఉత్సవాల సందడి కనిపించలేదు. 

పరేడ్​ గ్రౌండ్‌లో వేడుకులకు గంగుల

దశాబ్ది వేడుకలకు సిటీలోని పరేడ్​ గ్రౌండ్ ముస్తాబైంది. ఉదయం 9 గంటలకు మంత్రి గంగుల కమలాకర్​ జెండా ఆవిష్కరించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించనున్నారు. కలెక్టరేట్, మున్సిపల్ ఆఫీస్, జడ్పీ ఆఫీసుల్లో జెండా ఆవిష్కరణలు చేయనున్నారు. 

అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో రాష్ట్ర అవతరణ దశాబ్దిఉత్సవాలను నిర్వహించేందుకు అంతా రెడీ చేశారు. ఇక్కడి వేడుకలకు మంత్రి కేటీఆర్​ హాజరుకానున్నారు. అన్ని వర్గాల ప్రజల దశాబ్ధి వేడుకల్లో పాల్గొనాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు. జూన్​2 నుంచి 22 వరకు జరిగే ఉత్సవాల్లో తెలంగాణ అభివృద్ధి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​ చెప్పారు...

ట్యాంకుబండ్‌పై బైకును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి టెకీ ప్రాణాలు కోల్పోయాడు. శామీర్‌పేట ఆలియాబాద్‌లో నివాసముంటున్న లక్ష్మీనారాయణ పెద్ద కుమారుడు మనోజ్‌కుమార్‌ (27) హైటెక్‌సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

విధులు ముగించుకొని ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో బైక్‌పై తన నివాసానికి వెళ్తుండగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న కందుకూరి వీరేశలింగం విగ్రహం వద్దకు రాగానే అటునుంచి మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో సోని ట్రావెల్స్‌ బస్సు మనోజ్‌ బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో బైక్‌ బస్సు ముందు టైర్ల కిందకు దూసుకుపోవడంతో మనోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారుల సమాచారంతో అక్కడికి చేరుకున్న దోమలగూడ పోలీసులు మనోజ్‌ను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మనోజ్‌ మృతి చెందాడు.

ఇటు బస్సు డ్రైవర్‌ సయ్యద్‌ వసీం పాషా(35) పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మనోజ్‌ కుటుంబీకులకు సమాచారమందించారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి బస్సును సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

16 మంది త‌హసీల్దార్ల‌కు డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా ప‌దోన్న‌తి*l

హైద‌రాబాద్ :తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది వేడుక‌ల వేళ రాష్ట్రంలోని ప‌లువురు త‌హ‌సీల్దార్లు, సెక్ష‌న్ ఆఫీస‌ర్ల‌కు తెలంగాణ‌ ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది.

16 మంది త‌హ‌సీల్దార్లు, ఇద్ద‌రు సెక్ష‌న్ ఆఫీస‌ర్లు, ఒక సీసీఎల్ఏ ఆఫీస‌ర్‌కు డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా ప‌దోన్న‌తి క‌ల్పించింది. ఈ మేర‌కు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా ప‌దోన్న‌తి పొందిన త‌హ‌సీల్దార్లు, సెక్ష‌న్ ఆఫీస‌ర్లు సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా ప‌దోన్న‌తి పొందింది వీరే..

కే మ‌హేశ్వ‌ర్, త‌హ‌సీల్దార్

ఎం సూర్య ప్ర‌కాశ్, త‌హ‌సీల్దార్

ముర‌ళీ కృష్ణ‌, త‌హ‌సీల్దార్

కే మాధ‌వి, త‌హ‌సీల్దార్

పీ నాగ‌రాజు, సెక్ష‌న్ ఆఫీస‌ర్

ఎల్ అలివేలు, త‌హ‌సీల్దార్

బీ శకుంత‌ల‌, త‌హ‌సీల్దార్

కే స‌త్య‌పాల్ రెడ్డి, త‌హ‌సీల్దార్

పీ మాధ‌వి దేవీ, సీసీఎల్ఏ ఆఫీస్

వీ సుహాషినీ, త‌హ‌సీల్దార్

భూక్యా బ‌న్సీలాల్, త‌హ‌సీల్దార్

బీ జ‌య‌శ్రీ, త‌హ‌సీల్దార్

ఎం శ్రీనివాస్ రావు, త‌హ‌సీల్దార్

డీ దేవుజ‌, త‌హ‌సీల్దార్

డీ ప్రేమ్ రాజ్, త‌హ‌సీల్దార్

ఐవీ భాస్కర్ కుమార్, సెక్ష‌న్ ఆఫీస‌ర్

ఉప్ప‌ల లావ‌ణ్య‌, త‌హ‌సీల్దార్

డీ చంద్ర‌క‌ళ‌, త‌హ‌సీల్దార్

ఆర్‌వీ రాధా బాయి, త‌హ‌సీల్దార్...

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

పల్నాడు జిల్లా:

దాచేపల్లి దగ్గర ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ ని ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది...

Tirupathi: తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం రోజున భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.

టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

కాగా నిన్న శనివారం శ్రీవారికి నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. 85,366 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 48,183 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.........

SB NEWS

Encounter ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌, మావోలకు మధ్య ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ డివిజన్‌లోని నక్సల్స్‌ ప్రభావిత సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది..

ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నుంచి నలుగురు మావోయిస్టులు గాయపడ్డట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి..

ఎన్‌కౌంటర్‌ను జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. జిల్లాలోని ఎర్రబోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారాయిగూడ-రేగడగట్ట ప్రాంతంలో కోట ఏరియా కమిటీ కమాండర్ మంగడు, వెట్టి భీమాతో పాటు పలువురు మావోలు ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు డీఆర్‌జీ బృందం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిందని పేర్కొంది..

అటవీ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగానే.. రేగడగట్ట గ్రామ సమీపంలోకి జవాన్లను చూసిన మావోలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన డీఆర్‌జీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో నలుగురైదుగురు గాయపడ్డారని భద్రతా దళం ప్రకటించింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు మాత్రమే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని వివరించారు..