నేటి నుంచి ఏపీలో గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షలు
అమరావతి :
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు ఈరోజు నిర్వహించారు ఇవి ఈ రోజు నుంచి జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 6,455 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 జిల్లాల్లో ఈ పరీక్ష సెంటర్లను కేటాయించారు.
11 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు జూన్ 10 వరకు జరగనున్నట్లు ఏపీపీఎస్సీ సెక్రటరీ ప్రదీప్కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ సారి బయోమెట్రిక్ తో పాటు.. తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని సెక్రటరీ ప్రకటించారు. దీని కోసం మొత్తం 70 బయో మెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్ష రాసే దివ్యాంగుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 290 మంది దివ్యాంగ అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు. వారికి గంట అదనపు సమయం ఇస్తామన్నారు. పరీక్షను పూర్తిగా ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రశ్నాపత్రాలతో పాటు జవాబు పత్రాల బుక్ లెట్ ఇస్తామన్నారు. మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం ఉండదన్నారు. పేపర్ లీకేజీకి అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరి 8 న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. పరీక్షలు నిర్వహించిన కేవలం 19 రోజులకే ఫలితాలను విడుదల చేసి రికార్డు సృష్టించింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం 92 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు 1,26,449 మంది అప్లై చేసుకోగా.. మెయిన్స్ కు 6,455 మంది అర్హత సాధించారు. జులైలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు, ఆగస్టులో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ప్రణాళిలకు రూపొందిస్తున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ ఇటీవల వెల్లడించారు....
Jun 03 2023, 20:29