/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కరీంనగర్ జిల్లాలో" మేమ్ ఫేమస్ "చిత్ర బృందం సందడి Yadagiri Goud
కరీంనగర్ జిల్లాలో" మేమ్ ఫేమస్ "చిత్ర బృందం సందడి

కరీంనగర్ జిల్లా :

నూతన నటీనటులతో తెరకెక్కిన 'మేమ్ ఫేమస్' చిత్ర యూనిట్ శుక్రవారం కరీంనగర్ లో సందడి చేసింది. యూత్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేపట్టిన సినిమా యాత్రలో భాగంగా శుక్రవారం చిత్ర బృందం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

నగరంలోని శ్వేత హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ యువతపై తీసిన తమ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గంగాధర మండలం తాడిచెర్రి గ్రామంలో ఈ చిత్రాన్ని తీసినట్లు వారు తెలిపారు. ఆ గ్రామ ప్రజలు తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు.

ప్రత్యేకంగా గ్రామస్థుడు రామిడి సతీష్ సురేందర్ ఎంతో సహకరించారని తెలిపారు. అదేవిధంగా ఉప్పర్ మల్యాల గ్రామంలో సైతం సినిమా షూటింగ్ చేసినట్లు వారు తెలిపారు. ఈ చిత్రం యువతకు హత్తుకునేలా ఉంటుందని, సినిమా చూసినంతసేపు ప్రతి ఒక్కరూ మేమ్ ఫేమస్ గా ఫీల్ అవుతారని తెలిపారు.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: బెల్లంపల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆరిజన్‌ పాల సంస్థ భాగస్వామి శైలజ విషం తాగారు.

వెంటనే ఆమెను ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సుసైడ్‌ లెటర్‌ రాశారు. అందులో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన అనుచరులు భీమా గౌడ్‌, సంతోష్‌, పోచన్న, కార్తీక్‌ మానసికంగా హింసిస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే చిన్నయ్య నన్ను చంపుతానని అనుచరులతో బెదిరిస్తున్నారు. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న నా ఫోటోలను సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేశారు. అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో నేను తీవ్రమైన మనస్థాపానికి గురయ్యాను. ఈ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా సమస్య గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. అంతేగాక నాపైన తప్పుడు కేసులు పెడుతున్నారు. నేను చనిపోయిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందని సూసైడ్ లెటర్ రాస్తున్న’ అని లేఖలో పేర్కొన్నారు.

కాగా ఎమ్మెల్యే చిన్నయ్యకు, అరిజిన్‌ డెయిరీ పాల సంస్థ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులతో పాటు ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు బనాయించారని సదరు యువతి ఆరోపిస్తోంది. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవలె జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

ఆ బాధ తట్టుకోలేక ఎమ్మెల్యే దగ్గరకు అమ్మాయిలను పంపించాను

దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శైలజ ఆరోపించారు. ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల :

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శనివారం టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 76,963 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.97 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 37,422 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.....

SB NEWS

Karnataka CM: 'ఐదు గ్యారంటీల'కు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌.. ఈ ఏడాదే అమలు!.

బెంగళూరు: ఎన్నికల ముందు తాము ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య పేర్కొన్నారు..

'గృహజ్యోతి' (Gruha Jyothi) కింద రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు అందజేస్తాం. ఈ పథకాన్ని జులై 1 నుంచి అమలు చేస్తాం. కానీ, అంతవరకు పెండింగులో ఉన్న బిల్లులు మాత్రం చెల్లించాలి.

గృహలక్ష్మి (Gruha Lakshmi) పథకం కింద కుటుంబంలోని మహిళకు (కుటుంబ పెద్ద) నెలకు రూ.2వేలు అందజేస్తాం. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభమతుంది. ఇందుకోసం జూన్‌ 15 నుంచి జులై 15వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. మహిళలు ఆధార్‌, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వారి అకౌంట్లలో ఆగస్టు 15నుంచి డబ్బులు జమ అవుతాయి.

'అన్నభాగ్య' (Anna Bhagya) పథకం కింద బీపీఎల్‌ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి పది కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తాం. జులై 1 దీన్ని ప్రారంభిస్తాం.

యువనిధి (Yuva Nidhi) పథకం ద్వారా నిరుద్యోగులకు 24 నెలల పాటు భృతి అందజేస్తాం. డిగ్రీ అభ్యర్థులకు రూ.3వేలు, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.1500 ఇస్తాం. 2022-23లో పాసైన వారికి ప్రతినెల వీటిని అందజేస్తాం. డిగ్రీ పూర్తయిన ఆరు నెలల తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

శక్తి (Shakti) పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. జూన్‌ 11 నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఏసీ, లగ్జరీ మినహా అన్ని బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితం.

ప్రజా క్షేత్రంలోకి పవన్

ఈనెల 14వ తేదీ నుండి తూర్పుగోదావరి జిల్లా నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర..

ఉభయ గోదావరి జిల్లాల్లో షెడ్యూల్ ఖరారు..

క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమం రూపకల్పన..

ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పాటు పర్యటన..

పర్యటనలో భాగంగా మొదటి రోజు ఫీల్డ్ విజిట్..

రెండవ రోజు వివిధ వర్గాల ప్రజా సమస్యలు తెలుసుకుంటారు..

ఈ యాత్ర ఉభయగోదావరి జిల్లాలో రెండు నెలపాటు కొనసాగుతుంది..

మొత్తం 12 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది..

ఏపీ పర్యటనకు అమిత్ షా, జేపీ నడ్డా

అమరావతి..

వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయింది..

తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. తమ అభ్యర్థుల పేర్లను కూడా పార్టీలు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు ఏపీపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు..

ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు వస్తున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా… బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు.

ఇంకోవైపు జనసేనతో పొత్తు కొనసాగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జననేన అధినేత పవన్ చెపుతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే యోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై బీజేపీ నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు..

తెలంగాణ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు..

అమరావతి: తెలంగాణ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారు, తెలుగు జాతి ఎక్కడున్నా..

అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. తెలుగుజాతి కోసం టీడీపీ నిరంతరం శ్రమించిందని గుర్తుచేశారు. తెలుగుజాతి కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని కొనియాడారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి ఎన్టీఆర్ చాటారని తెలిపారు..

దేశానికి దశ - దిశ చాటిన నాయకుడు పీవీ నరసింహారావు అని చంద్రబాబు పేర్కొన్నారు. 1991లో దేశ ఆర్థిక సంస్కరణలకు పీవీ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇప్పుడు తెలుగుజాతి పునర్నిర్మాణానికి కృషి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

సమైక్య రాష్ట్రంలో విజన్ 2020 (Vision 2020)తో అభివృద్ధికి బాటలు వేశామని, ఏపీలో రెండోతరం సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. సంస్కరణలకు సాంకేతికత జోడించామని, సంపద సృష్టించి పేదలకు సంక్షేమ పథకాలు అందించామని చంద్రబాబు తెలిపారు..

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రెడీ-

ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక సంకేతాలు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది..

తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణతో పాటే జగన్ కూడా డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు అలర్ట్ అయి మహానాడులో మినీ మ్యానిఫెస్టో కూడా ప్రకటించారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది..

పవన్ చేపట్టబోయే వారాహి యాత్రపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చర్చలు ప్రారంభించారు. వారాహి యాత్ర రూట్ మ్యాప్, ఇతర అంశాలపై నేతలతో ఇప్పటికే పలుమార్లు చర్చించిన నాదెండ్ల.. ఇవాళ మంగళగిరిలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. వారాహి యాత్ర గోదావరి జిల్లాల నుంచే ప్రారంభమవుతుందన్న సంకేతాల నేపథ్యంలో ఇవాళ జనసేన గోదావరి జిల్లాల నేతలతో నాదెండ్ల నిర్వహించిన సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది..

పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఉత్తరాంధ్ర నుంచి వారాహి యాత్ర ప్రారంభిస్తారనే ప్రచారం సాగింది. టీడీపీ యువనేత నారా లోకేష్ ఇప్పటికే రాయలసీమ నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఉత్తరాంధ్ర నుంచి వారాహి యాత్ర ప్రారంభించేందుకు పవన్ ప్లాన్ చేశారు. కానీ ఉత్తరాంధ్రతో పోలిస్తే గోదావరి జిల్లాల్లో స్పందన ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అక్కడి నుంచి ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించి గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మరో ప్రచారం సాగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది..

దేశానికే అన్నపూర్ణ మన తెలంగాణ : సీఎం కేసీఆర్

మన తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు నివాళులర్పించారు. ఒకసారి పోరాట చరిత్ర, అభివృద్ధి ప్రస్తానాన్ని తలచుకుందామని, భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభసందర్భంలో ప్రజలందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు. మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఘనంగా తలుచుకుందామన్నారు. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామన్నారు.

ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్రాప్రాంతంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారన్నారు. 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది, దారుణమైన అణచివేతకు గురైందన్నారు. 1971 లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కు మద్దతుగా ప్రజాతీర్పు వెలువడినప్పటికీ.. దానిని ఆనాటి కేంద్ర ప్రభుత్వం గౌరవించలేదన్నారు. ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశా నిస్పృహలు ఆవరించాయన్నారు.

ఉద్యమాన్ని రగిలించేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినా.. నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడంవల్ల, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదన్నారు. 2001 వరకూ తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలిందన్నారు. ‘ఇంకెక్కడి తెలంగాణ’ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది. ఆ నిర్వేదాన్ని, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర నాకు లభించినందుకు నా జీవితం ధన్యమైందన్నారు. అహింసాయుతంగా, శాంతియుత పంథాలో వివేకం పునాదిగా, వ్యూహాత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి క్రమక్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయన్నారు.

ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులూ, విద్యావంతులూ, ఉద్యోగ ఉపాధ్యాయులూ, కవులూ, కళాకారులూ, కార్మికులూ, కర్షకులూ, విద్యార్ధులూ, మహిళలూ కులమత భేదాలకు అతీతంగా, సిద్ధాంతరాద్ధాంతాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై కదిలారన్నారు. వారందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నానన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన త్యాగధనులైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటినుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా అంకితమైందని సీఎం కేసీఆర్ తెలిపారు.

అమరవీరులను స్మరిస్తూ గవర్నర్ తమిళిసై భావోద్వేగం... మొత్తం తెలుగులోనే ప్రసంగం

అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గవర్నర్ రాజ్‌భవన్‌లో కేక్ కట్ చేశారు.

అక్కడ నృత్యకారులతో కలిసి గవర్నర్ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. గవర్నర్ తొలిసారి తన ప్రసంగాన్ని మొత్తం తెలుగులో మాట్లాడారు. అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదమన్నారు.

ఆధునిక ప్రపంచంలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. స్వరాష్ట్ర ఏర్పాటులో భాగంగా తనువు చాలించిన వారి పేర్లను స్మరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల మంది అమరులయ్యారన్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ఎన్నో ప్రత్యేకతలు చవి చూసిందని చెప్పారు. తెలంగాణ అంటే స్లోగన్ కాదని.. అది ఆత్మ గౌరవ నినాదమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ తమిళి సై ఆకాంక్షించారు.

నా జీవితం ప్రజల కోసమే...

తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదని గవర్నర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుందని చెప్పారు. వచ్చే సంవత్సరం నాటికి దేశంలో తెలంగాణ నంబర్1 కావాలని ఆకాంక్షించారు. అమరవీరులందరికీ జోహార్లు తెలిపారు. ‘‘నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే.. దేవుడు నన్ను తెలంగాణకు పంపడం గొప్ప అదృష్టం. నేను మీతో ఉన్నాను. మీరు నాతో ఉన్నారు’’ అంటూ గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు.