తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ వేడుకలు.. జిల్లాల్లో జాతీయ జెండా రెపరెపలు
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. ఇటు గోల్కొండ కోటలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు జరిగాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకల సందర్భంగా అసెంబ్లీ అవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అటు తెలంగాణ భవన్‌లో కేకే జెండాను ఆవిష్కరించారు.
సిద్దిపేట: జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో హరీశ్ రావు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు.
జగిత్యాల: జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే కొత్తగూడెం ప్రగతి మైదాన్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ వినీత్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ తదితరులు నివాళులర్పించారు. అటు సింగరేణి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా డైరెక్టర్ ఆపరేషన్ ఎన్ వి కే శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పర్సనల్ విభాగం ఐ.జి. కమలాసన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం లోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయం, గాంధీ విగ్రహం, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే రఘునందన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి కలెక్టరేట్‌లను అధికారులు అందంగా ముస్తాబు చేశారు. ఆయా కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మహబూబ్ నగర్: జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో హోంమంత్రి మహమూద్ అలీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఆపై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎస్‌పీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
మెదక్: జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలు పాల్గొన్నారు.
వనపర్తి: జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల భవనంలో తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నిరంజన్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించి, జాతీయ పాతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్ లోక్‌నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ రక్షిత కె మూర్తి పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల: జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు హాజరై జాతీయ జండా ఎగురవేశారు.
నల్గొండ: నల్గొండలో అమర వీరుల స్థూపానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. ఆపై కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్, నోముల భగత్, భాస్కర్ రావు పాల్గొన్నారు.
వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ, దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలంగాణ అమరవీరుల స్థూపనికి నివాళ్ళు అర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆనంద్, మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, బిసి కమిషన్ సభ్యులు సుభప్రద్ పటేల్, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటి రెడ్డి తదితరులు హాజరయ్యారు.
కరీంనగర్: జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్: గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి డీజీపీ అంజనీ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ నివాళులు అర్పించారు.
నిర్మల్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలోకలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సత్సంకల్పంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలలో భాగంగా ఆలయ అర్చకుల చేత అధికారులు సుదర్శన హోమం నిర్వహించి మూలవరులకు సువర్ణ పుష్పార్చన చేశారు....
Jun 02 2023, 18:12