నల్గొండలో తప్పిపోయిన వృద్ధులకు మరియు తల్లిదండ్రులు లేని పిల్లలకు బాసటగా నిలుస్తున్న ఆర్టీసీ ఉద్యోగి, సామాజిక కార్యకర్త సాధిక్ పాష
అభాగ్యులకు అండగా
నల్గొండ కు చెందిన ఆర్టీసీ ఉద్యోగి సామాజిక కార్యకర్త, మరియు మానవ హక్కుల కార్యకర్త అయిన శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు తన గొప్ప మనసును చాటుకుంటు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే నల్గొండ కు చెందిన సాదిక్ పాషా గారు తన వృత్తి ధర్మాన్ని పాటిస్తు పలు సామాజిక కార్యక్రమాలు చేస్తు సమాజానికి తన వంతు సేవలు అందిస్తు పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. 2018 లో తన స్నేహితుని బంధువులు(భార్యా భర్తలు) అనారోగ్యంతో చనిపోగా తానే దగ్గరుండి అంత్యక్రియలు జరిపించి వారి ఇద్దరు పిల్లల్ని నల్గొండ కు తీసుకువచ్చి సి.డబ్ల్యూ.సి ద్వారా మేయర్స్ బాల భవన్ లో ఆశ్రయం కల్పించి వారికి ఉచిత విద్యా, వసతి కల్పించి వారికి గార్డియన్ గా(సంరక్షకునిగా)వున్నాడు. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు అబ్బాయి 5వ తరగతి అమ్మాయి 3వ తరగతి చదువుతున్నారు. అతను చేసే సేవలకు గాను పలు అవార్డులు ప్రశంసా పత్రాలు అందుకోవడం జరిగింది. కోవిడ్ సమయంలో ఎందరికో తన సేవలు అందించి విజయవాడలో కోవిడ్ వారియర్ అవార్డును సైతం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను సమాజంలో నిరాదరణకు గురైన వారికి, అనాధాలకు, వృద్ధులకు, వికలాంగులకు, అత్యవసర సమయంలో రక్తదానం, మరియు అభాగ్యులకు సేవలు చేస్తుంటానని తాను సామాజిక సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన ఆ భగవంతునికి ఎల్లప్పుడూ రుణ పడి వుంటానని సామాజిక సేవలోనే తనకు తృప్తి వుంటుందని సామాజిక సేవతోనే మనిషి జన్మకు సార్ధకత లభిస్తుందన్నారు అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తెరిగి తమకు తొచిన విధంగా ఎదో ఒక రూపంలో సామాజిక సేవలు చేసి సమాజంలో మానవత్వాన్ని చాటాలని అలాగే రక్తదానానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు రావాలని అభిలాషించారు.

అభాగ్యులకు అండగా
పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే కంచర్ల
NLG: కిడ్స్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే
Haryana: ఆఫీస్‌లో ఉద్యోగులు బీర్ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!
డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హార్థిక శుభాకాంక్షలు తెలిపిన మునుగోడు నియోజకవర్గ నాయకులు
NLG: యాదగిరి రెడ్డి మృతి BRS పార్టీకి తీరని లోటు

నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామం ఎస్ఎస్సి ఫలితాల్లో జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల మంచి ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరైన 42 మంది విద్యార్థులకు 39 మంది విద్యార్థులు 97% ఉత్తీర్ణత సాధించారు. వీరిలో నల్లగొండ, చర్ల పళ్లికి చెందిన శ్యామల శివప్రసాద్ 9.3 మరియు నల్ల రక్షిక 9.2 జిపిఏతో ఉత్తమ ఫలితాలు సాధించారని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ చైర్మన్ రమేష్ అభినందించారు.
NLG: వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట...

Jun 01 2023, 21:48
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
32.3k