/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తీగలాగితే డొంక కదిలింది Yadagiri Goud
తీగలాగితే డొంక కదిలింది

వరంగల్‍జిల్లా :

స్కానింగ్‍ సెంటర్ల పేరుతో ఆస్పత్రులు పెడుతున్న కొంతమంది డాక్టర్లు స్కానింగ్​, అబార్షన్ల దందా నడుపుతున్నారు. రూల్స్​ను బ్రేక్​ చేస్తూ లింగనిర్ధారణ చేస్తున్నారు. స్కానింగ్​ అయితే రూ. 10 వేలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఆడపిల్ల అని తేలితే అబార్షన్​ చేసేందుకు రూ. 50 వేల దాకా దండుకుంటున్నారు. గ్రేటర్‍ వరంగల్‍ సిటీలో పలు స్కానింగ్‍ సెంటర్ల డాక్టర్లు, వారికి సహకరించే ఆర్‍ఎంపీలు దీనిని ప్రొఫెషనల్‍గా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.

రెండేళ్ల క్రితమే ఇలాంటి వరుస ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు అధికారులు హడావుడి చేసి పలు స్కానింగ్‍ సెంటర్లపై దాడులు నిర్వహించారు. అయితే మళ్లీ ఆ దందా బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి పలువురిని తమ అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. లింగనిర్ధారణ చేసుకునేవారిలో తమకు పుట్టే సంతానం మగ పిల్లాడు కావాలనుకునే పేద, మిడిల్‍ క్లాస్‍ పేరేంట్స్‍ ఎక్కువగా ఉంటున్నారు. అప్పటికే ఒకరిద్దరు ఆడపిల్లలు ఉండి అబ్బాయి కోసం చూసే వారిని గ్రామ, మండల స్థాయిలో ఆర్‍ఎంపీలు తమ కస్టమర్లుగా భావిస్తున్నారు. పుట్టబోయే బిడ్డ ఆడోమగో తెలుసుకునేందుకు స్కానింగ్‍ సెంటర్లకు పంపిస్తున్నారు. అబ్బాయి అయితే కూల్‍గా విషయం క్లోజ్‍ అవుతుంది. ఆడపిల్లలు వద్దనుకునే వారికి తక్కువ ఖర్చులో అబార్షన్‍ చేస్తామంటూ ఆఫర్‍ ఇస్తూ ఆపరేషన్లు చేస్తున్నారు.

వెంకన్నస్వామి, లక్ష్మీదేవి ఫోటోలతో..

కడుపులో ఉండే బిడ్డ ఆడో, మగో తల్లిదండ్రులకు చెప్పుందుకు నిర్వాహకులు కోడ్​ లాంగ్వేజీ వాడుతున్నారు. దీనికి కోసం దేవుళ్ల ఫొటోలు ఉపయోగిస్తున్నారు. తమవద్దకు వచ్చే తల్లిదండ్రులకు లింగ నిర్థారణ పరీక్షలు చేసే క్రమంలో సెంటర్‍ లోపలకు ఎవ్వరినీ మొబైల్‍ తీసుకురాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. నోటిమాటతో కాకుండా కడుపులో ఉన్నది చెప్పడానికి అబ్బాయైతే రాముడు, వెంకన్న స్వామి ఫోటోలు.. ఆడపిల్ల అయితే లక్ష్మిదేవి, సరస్వతి ఫోటోలను చూపుతున్నారు. కొంత దగ్గరివారైతే 'మీ పాప చాలా యాక్టివ్‍గా ఉందమ్మా' అని.. బాబు అయితే 'మీ అబ్బాయి చాలా యాక్టివ్‍గా ఉన్నాడని' సమాచారాన్ని చేరవేస్తున్నారు.

పోలీసుల అదుపులో.. నిర్వాహకులు.!

వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ పరిధిలో జరిగే అక్రమ దందాలు తన దృష్టికి తీసుకువచ్చేలా సీపీ రంగనాథ్‍ జనాలకు తన కాంటాక్ట్​ నంబర్‍ ఇచ్చారు. ఈ క్రమంలో భూకబ్జాలు, పేకాటలు, డ్రగ్స్‍ దందాల సమాచారం రెగ్యూలర్‍గా వస్తున్నాయి. ఇదే తరహాలో వారం కిందట ములుగురోడ్డు, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఓ ప్రైవేట్‍ హస్పిటల్‍ నిర్వాహకులు అక్రమ స్కానింగులు, అబార్షన్లు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు వచ్చినట్లు తెలుస్తోంది. సీపీ రంగనాథ్‍ తన సిబ్బందితో రంగంలోకి దిగి నిర్వాహకులను రెడ్‍ హ్యండెడ్‍గా పట్టుకున్నారనే డిస్కషన్‍ నడిచింది. శనివారం సాయంత్రం పోలీస్‍ ల ప్రెస్‍మీట్‍ ఉన్నట్లు చెప్పడంతో నిందితుల అరెస్ట్​ చూపుతారని అందరూ భావించారు. చివర్లో ప్రెస్‍మీట్‍ క్యాన్సల్‍ అయింది. కాగా, దందాలో కొందరు పెద్ద డాక్టర్ల హస్తం ఉందని, విషయం అధికార పార్టీ పెద్ద లీడర్ల వరకు వెళ్లినట్టు సమాచారం.

సెంటర్ల అడ్రస్‍ చెబితే.. రూ. 2 వేల గిఫ్ట్​

గ్రేటర్‍ లో కొన్ని నెలల కింద ఇలాంటి వరుస ఘటనలు జరిగిన నేపథ్యంలో 'వీ6 వెలుగు పేపర్‍' వార్తలు ప్రచురించింది. స్పందించిన అప్పటి కలెక్టర్‍ రాజీవ్‍ గాంధీ హనుమంతు, డీఎంహెచ్‍ఓ లలితాదేవి నిర్వాహకులపై కేసులు పెట్టారు. టెస్టులు, అబార్షన్లు.. పర్మిషన్‍లేని స్కానింగ్‍ సెంటర్ల వివరాల ఇన్ఫర్మేషన్‍ ఇచ్చేవారికి రూ.2 వేలు మనీ గిఫ్ట్​ ఇస్తామని ప్రకటించారు. దీంతో కొన్ని రోజులు ఇలాంటి దందాలు ఆగినా.. కొత్తగా వచ్చిన అధికారులు లైట్‍ తీసుకోవడంతో ఈ దందా మళ్లీ జోరందుకున్నట్లు తెలుస్తోంది.....

గన్ వదిలి పెన్ను పట్టిన మాజీ నక్సలైట్ : పోలీస్ దళం లో చేరుతానంటున్న హిదామి

గడ్చిరోలి :

వయసు పదిహేను ఏళ్లే. కానీ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్. కొండకోనలే ఆవాసాలు. మారణాయుధాలతో సహవాసం. అయితే ఆమెలో ప్రస్తుతం మార్పు వచ్చింది.

గన్‍లను వదిలి పుస్తకాలు, పెన్‌లను చేతబూనింది.. చదువుల్లో రాణించింది. ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించింది. ఇంతకు ఆమెలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది. ఇందుకు కారణాలేంటో ఆమెను పలకరించిన కోకిల డిజిటల్ మీడియా

మహారాష్ట్రలోని గోండియాకు చెందిన ఇరావుల హిదామి తండ్రి.. చిన్నతనంలోనే మరణించాడు. తల్లి మరో వ్యక్తిని వివాహమాడి వెళ్లిపోయింది. ఒంటరైన ఈమెను ఎవరూ దగ్గరికి తీయలేదు. దీంతో తాను నక్సలిజంలో చేరిపోయింది. ఒడిశాలోని గడ్చిరోలి, మహారాషష్ట్రలోని గోండియా ప్రాంతాల్లో మోస్ట్ వాంటెడ్ హిట్ లిస్టులో చేరింది. పేరుమోపిన నక్సలైట్‍గా మారింది. పదిహేనేళ్లలోనే హిదామి పై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి,

అయితే గోండియా ప్రాంతానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి ఎస్పీ సందీప్ అతోల్ ఈ విశయంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆవిడను సరైన దిశగా మార‍్చడంలో విజయం సాధించారు. 2018లోనే ఎస‍్పీ సలహాతో అటవి మార్గం విడిచి, జనావాసాలను చేరింది.

పోలీసు అధికారి సందీప్ అతోల్ మద్దతుతో చదువును కొనసాగించింది. ఈ వారం వెలువడిన 12వ తరగతి బోర్డు పరీక్షలలో 45.83 శాతంతో ఉత్తీర‍్ణత సాధించింది. ఒకప్పుడు తుపాకి చేతబట్టి అడవులలో తిరిగిన హిదామి, ఆ బాటను మార్చుకొని చదువుపై దృష్టి సారించింది నా విజయాలకు ఎస్పీ సందీప్ అతోల్, కుటుంబమే కారణమని ఆ కుటుంబమే తన కుటుంబమని అంటోంది. భవిష్యత్‌లో పోలీసు దళంలో ఉద్యోగం సాధిస్తానని చెబుతోంది. సమస్యల పరిష్కారానికి అటవి దారి ఒక్కటే మార్గం కాదని నక్సలైట్లకు ఆమె హితువు పలికారు..

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతిలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ప్రయోగించిన ఈ వాహకనౌక.. ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

రాకెట్‌ బయలుదేరిన తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కి.మీ. ఎత్తులో జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో ప్రవేశట్టింది. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్‌ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు.

ఈ ఉపగ్రహం భారత్‌ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్‌ టైమ్‌ పొజిషనింగ్‌ సేవలను అందిస్తుంది.

SB NEWS

SB NEWS

హైదరాబాద్‌ను కుమ్మేసిన భారీ వర్షం

నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం దాకా భగభగ మండిన ఎండలతో అల్లాడిన హైదరాబాద్‌ వాసులకు అకస్మాత్తుగా వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం లభించింది.

భాగ్యనగరంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, అబిడ్స్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం పడింది.

విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

కాగా, శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా లక్కవరంలో 46.1 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతా­యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా జూన్‌ మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రానికి వాయవ్య. పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.....

ఈరోజు కొనసాగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్

ధోనీ ఫ్యాన్స్ పూజలకు దేవుడు కరుణిస్తాడా? ఒకవేళ ఇవాళ మ్యాచ్ జరగపోతే పరిస్థితేంటి?

ఐపీఎల్ ఫైనల్ రిజర్వ్ డేకు చేరుకుంది. ఒక్కటంటే ఒక్క బంతి కూడా పడకూండా మ్యాచ్ రిజర్వ్ డేకు పోస్ట్ పోన్ అయ్యింది.ఇవాళ ఫైనల్ జరగనుంది.

దాదాపు రెండు నెలల పాటు అభిమానులను కనువిందు చేసిన ఐపీఎల్ టి20 టోర్నమెంట్‌కు ఇవాళ జరిగే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగే ఫైనల్‌తో తెరపడనుంది. తొలిసారి రిజర్వ్ డే రోజు ఫైనల్ జరగనుంది.

చెన్నై ఇప్పటికే నాలుగు టైటిల్స్‌ను గెలవగా డిఫెండింగ్ ఛాంపియన్ టైటాన్స్ ఆడిన రెండు సీజన్‌లలో ఫైనల్‌కు చేరి ప్రకంపనలు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ఇప్పటి వరకు నాలుగు సార్లు ట్రోఫీలు గెలుచుకుంది. ఇవాళ జరిగే ఫైనల్లో కూడా గెలిచి ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేయాలని తహతహలాడుతోంది. ముంబై ఐదు ఐపీఎల్ టైటిల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

చెన్నై ఇప్పటికే నాలుగు టైటిల్స్‌ను గెలవగా డిఫెండింగ్ ఛాంపియన్ టైటాన్స్ ఆడిన రెండు సీజన్‌లలో ఫైనల్‌కు చేరి ప్రకంపనలు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ఇప్పటి వరకు నాలుగు సార్లు ట్రోఫీలు గెలుచుకుంది. ఇవాళ జరిగే ఫైనల్లో కూడా గెలిచి ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేయాలని తహతహలాడుతోంది. ముంబై ఐదు ఐపీఎల్ టైటిల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.....

నిన్న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ ఒక బంతి కూడా పడకూండానే రిజర్డ్ డేకు పోస్ట్ పోన్ అయ్యింది. ఇవాళ కూడా రెయిన్ పడి మ్యాచ్ జరగకపోతే నే విన్నర్ గా ప్రకటిస్తారు. టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ చెన్నై కంటే మూడు పాయింట్ల లీడ్ తో ఉంది.....

ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందా ❓️

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందే ఫిక్స్ అయిన ట్లు కథనాలు వస్తున్నాయి. అందుకు నరేంద్ర మోడీ స్టేడియంలో చోటుచేసుకున్న టెక్నికల్ తప్పిదమే కారణం. ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో అంపైర్లు టాస్ ఆలస్యమవుతున్నట్లుగా ప్రకటించారు.

ఈ విషయాన్ని ప్రదర్శించాల్సిన స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్ పై రన్నరప్ 'చెన్నై సూపర్ కింగ్స్' అని పడింది. ఇంకేముంది ఆట ప్రారంభం కాకముందే స్క్రీన్స్ పై చెన్నై అని పడడంతో ఫైనల్‌లో గుజరాత్ గెలవబోతోందని అభిమానులు అనుమానిస్తున్నారు.

ఈ సీజన్ లో చాలా మ్యాచులు ఊహకందని పలితాలతో అటు వీక్షకులను.. ఇటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్.. ఒకే ఓవర్ లో 5 సిక్సులు బాధి విజయాన్ని అందించటం, హైదరాబాద్ జట్టు ఆఖరి బంతికి 6 పరుగులు చేయాల్సిన సమయంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ నోబాల్ వేయటం, ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచులో హర్షల్ పటేల్ మన్కడింగ్ చేయకుండా తప్పించటం.. ఇలా బోలెడు సంఘటనలు జరిగాయి. వీటికి తోడు అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు.. అభిమానులకు మరింత అనుమానాలు పెంచాయి.

ఇలాంటి పరిస్థితులలో ఆఖరి మ్యాచ్ అయినా.. సజావుగా సాగుతుందా? అంటే అదీ లేదు. మ్యాచ్ ఇంకా మొదలు కాకముందే రన్నరప్ చెన్నైగా ప్రకటించడమంటే ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ గెలవబోతుందని ముందుగానే రాసి పెట్టారా? అని అభిమానులు అనుమానిస్తున్నారు.

ఇది టెక్నికల్ తప్పిదమే అయినా చెన్నై జట్టే.. రన్నరప్ అవుతుందని ఎలా ఊహించారు? అన్నది మరో ప్రశ్న. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై గుజరాత్ టైటాన్స్ బాగా ఆడి గెలిచినా.. టోర్నీ స్క్రిప్ట్ అన్న వాదనలు మరింత పెరుగుతాయి. అయితే ఇది స్క్రీన్ టెస్ట్‌లో భాగంగా డిస్ ప్లే చేశారన్న వార్తలు వినపడుతున్నాయి. ఈ తప్పిదంపై బీసీసీఐ ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి....

టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు.

2024లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో మేనిఫెస్టోని ప్రకటించారు. అందులో ముఖ్యంగా ఆరు కీలక పథకాలను వెల్లడించారు.

మినీ మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు

1.పేదలను సంపన్నులను చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది.

బీసీలకు రక్షణ చట్టం

బీసీలకు రక్షణ చట్టం తెచ్చి... వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది.

3) ఇంటింటికీ నీరు

చంద్రబాబుగారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికీ మంచి నీరు" పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది

4) అన్నదాత

ఈ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది

5) మహాశక్తి

ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి "స్త్రీనిధి" కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది

తల్లికి వందనం' పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తుంది

దీపం" పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుంది

ఉచిత బస్సు ప్రయాణం" పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది

6) యువగళం

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుంది.

ప్రతి నిరుద్యోగికి 'యువగళం నిధి' కింద నెలకు 2500 రూపాయలను ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం..

Arvind Kejriwal | ప్రధాని మోదీని సాగనంపాల్సిందే.. ఢిల్లీకి ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్‌కు థ్యాంక్స్‌: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

Arvind Kejriwal | ఢిల్లీ ప్రజల హక్కుల కోసం తాము 8 ఏండ్లు న్యాయపోరాటం చేసి సాధించుకొన్న న్యాయాన్ని ప్రధానమం త్రి నరేంద్రమోదీ 8 రోజుల్లోనే ఆవిరి చేశారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

•ఆయనను నిలువరిస్తేనే దేశ మనుగడ

•సుప్రీంనూ అపహాస్యం చేస్తున్న మోదీ

•8 ఏండ్ల పోరాట ఫలం 8 రోజుల్లో ఆవిరి

•ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ ప్రజల హక్కుల కోసం తాము 8 ఏండ్లు న్యాయపోరాటం చేసి సాధించుకొన్న న్యాయాన్ని ప్రధానమం త్రి నరేంద్రమోదీ 8 రోజుల్లోనే ఆవిరి చేశారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను మోదీ సర్కా ర్‌ అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. మోదీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం మినహా మరో మార్గం లేదని చెప్పారు. శనివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌తో కలిసి ఆయన మీ డియాతో మాట్లాడారు.

ఢిల్లీలో తమకన్నా ముం దున్న షీలా దీక్షిత్‌ ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పూర్తి అజమాయిషీ ఉండేదని, అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, ఉద్యోగులపై క్రమశిక్షణా చర్య లు, కొత్త పోస్టుల సృష్టి వంటి అన్ని రకాల అధికారాలు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేవని గుర్తుచేశా రు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 లో మోదీ సర్కార్‌ ఒక్క నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలన్నింటినీ బలవంతంగా లాగేసుకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం హోదాలో తనకు కనీసం ఒక అధికారిని బదిలీ చేయటం, పోస్టింగ్‌ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని అన్నారు.

8 ఏండ్ల పోరాటం.. 8 రోజుల్లో ఆవిరి

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును బీజేపీ ప్రభు త్వం అపహాస్యం చేసిందని కేజ్రీవాల్‌ విమర్శించారు. మే 11న సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే.. మే 19న మోదీ సర్కార్‌ ఆ తీర్పును తుంగలో తొక్కి ఆర్డినెన్స్‌ తెచ్చిందని మండిపడ్డారు. ఈ ఆర్డినెన్స్‌ చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోతున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పునే ప్రభుత్వం లెక్కచేయకపోతే ఇక న్యాయం కోసం ఎక్కడికి పోవాలి? అని ప్రశ్నించారు. సాక్షాత్తు ప్రధానే సుప్రీంకోర్టు తీర్పును లెక్కచేయకపోతే దానిని ఇంకెవరు గౌరవిస్తారు? అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకోవాలి

కేంద్ర తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకొనేందుకు వ్యూహం రచిస్తున్నామని అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. రాజ్యసభలో బీజేపీకి సరైన మెజారిటీ లేదని, రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 238 (12 మందిని రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు) సభ్యుల్లో బీజేపీకి 93 మంది సభ్యులే ఉన్నారని, ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ మద్దతుతో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటామని చెప్పారు. రాజ్యసభలో ఈ బిల్లు వీగిపోతే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తద్వారా 2024లో మోదీ సర్కార్‌ తిరిగి అధికారంలోకి రాదని అన్నారు. మోదీ సర్కార్‌ను నిలువరించినపుడే దేశ స్వాతంత్య్రాన్ని కాపాడినవాళ్లం అవుతామని స్పష్టంచేశారు.

కేసీఆర్‌కు ధన్యవాదాలు

సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ధన్యవాదాలు తెలిపారు. తమ కు సమయం కేటాయించి తమ సమస్యను దేశసమస్యగా భావించి ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 'రావుసాబ్‌.. ప్రేమకు పాత్రులం అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించామని, ఢిల్లీ ప్రజల న్యాయమైన కోరికకు సీఎం కేసీఆర్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. 'ఇది కేవలం ఢిల్లీ సమస్య కాదని, యావత్‌ దేశం ఎదుర్కొంటున్న సమస్య' అని మానవీయ హృదయంతో స్పందించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇంత ధైర్యాన్ని ఇచ్చిన కేసీఆర్‌కు ఢిల్లీ ప్రజల పక్షాన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పనిచేయకుండా అడ్డుకోవటమే ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆయన త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి ఆ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచటం, దారికి రాని ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను ఉసిగొల్పటం, మొదటి రెండు పద్ధతులు పనిచేయకుంటే ఆర్డినెన్స్‌ల ద్వారా, గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను చిన్నాభిన్నం చేయటం అనే మూడు వ్యూహాలను అనుసరిస్తున్నారు.

కెసిఆర్ ముఖ్యమంత్రి కాదు తాలిబన్లు కు అధ్యక్షుడు : వైయస్ షర్మిల*

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ తో కలిసి నిన్న ప్రగతి భవన్‌లో సమావేశమైన కేసీఆర్.. కేంద్రంపై చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఎమర్జెన్సీ పెట్టాల్సింది దేశంలో కాదు..ముందు తెలంగాణలో అని అన్నారు.

‘రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్యం కాదు..తాలిబన్ల పాలన. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. తాలిబన్లకు అధ్యక్షుడు’ అని విమర్శించారు. ఆయన పాలనలో ఎన్నికలు కూడా సవ్యంగా జరుగుతాయనే నమ్మకం లేదన్న షర్మిల తెలంగాణలో ఎమర్జెన్సీ విధించాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ హక్కుల కోసం ఉద్యమం చేస్తానంటున్నాయన.. స్వరాష్ట్ర హక్కుల కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? అని నిలదీశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీపై కేంద్రాన్ని ఏనాడైనా నిలదీశారా? అని ప్రశ్నించారు.

ఢిల్లీ హక్కుల కోసం గల్లీ కేసీఆర్ ఉద్యమం చేస్తాడట.. కేంద్రం మెడలు వంచుతడట. పార్లమెంట్ లో బిల్లును ఓడగొట్టేలా ఉద్యమిస్తడట..! అయ్యా దొర గారు..పక్క రాష్ట్రాల హక్కుల కోసం ఉద్యమాలు చేసే మీరు.. స్వరాష్ట్ర ప్రయోజనం కోసం ఒక్క ఉద్యమమైనా చేసిండ్రా.. కనీసం పార్లమెంట్ లో నైనా కొట్లాడిండ్రా..? బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఒక్కనాడైనా మాట్లాడావా? కాజీపేట రైల్వే కోచ్ ఎందుకివ్వరు అని ఉద్యమించినవా..? గిరిజన యూనివర్సిటీ పై ఏనాడైనా ప్రశ్నించినవా..? బీజేపీ ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటే తెలంగాణ బిడ్డల కోసం ఏ రోజైనా నోరు విప్పినవా? ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు అని ఏనాడైనా పార్లమెంట్ ను స్తంభింపజేసినవా..? అసెంబ్లీ తీర్మానించిన మైనారిటీ,గిరిజన రిజర్వేషన్లను ఎందుకు పెండింగ్ లో పెట్టారని అడిగినవా..? ఢిల్లీ ప్రజల తరుపున మద్దతు కోసం వచ్చిన కేజ్రీవాల్ లెక్క మీరు ఎవరినైనా కలిశారా..?’ అని షర్మిల పలు ప్రశ్నలు సంధించారు.

మూడో కూటమి, ఫెడరల్ కూటమి అంటూ ప్రజల సొమ్ముతో రాజకీయం చేయడం తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం ఏనాడు మద్దతు అడిగింది లేదని, ఉభయ సభల్లో ఉద్యమించింది లేదని విమర్శించారు. ‘నిధులు ఇస్తలేరు అని ప్రగతి భవన్ లో దొంగ ఏడుపులు తప్ప..స్వయంగా ప్రధానినే రాష్ట్రానికొస్తే ఎదుటపడి అడిగింది లేదు. కేసీఅర్ మాటలు కోటలు దాటుతయ్.. చేతలు గడీ గడప దాటయ్ అనే దానికే నిదర్శనం.

సుప్రీం కోర్టు తీర్పునే లెక్క చేయరా అంటూ దొంగ మాటలు చెప్పే దొర గారు... రాష్ట్రంలో జర్నలిస్టుల స్థలాల కోసం ఇచ్చిన సుప్రీం తీర్పును మీరెక్కడ లెక్క చేశారో సమాధానం చెప్పాలి. ఎమర్జెన్సీ పెట్టాల్సింది దేశంలో కాదు..ముందు తెలంగాణలో.. రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్యం కాదు..తాలిబన్ల పాలన. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. తాలిబన్లకు అధ్యక్షుడు. రాష్ట్రంలో దొర అరాచకాలు, ఆగడాలకు అంతే లేదు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, జైల్లో పెట్టి చావ బాదడాలు. పట్టపగలే నడి రోడ్డుపై హత్యలు. శాంతిభద్రతలు అదుపులో లేవు. రాష్ట్రంలో ప్రజలను బ్రతనివ్వరు. ప్రతిపక్షాలను ఉండనివ్వరు. దొర నియంత పాలనలో ఎన్నికలు కూడా సవ్యంగా జరుగుతాయనే నమ్మకం లేదు. అందుకే తెలంగాణలో ఎమర్జెన్సీ విధించాలి. రాష్ట్రపతి పాలన పెట్టాలి’ అని షర్మిల ట్వీట్ చేశారు...

New Parliament: రూ.75 నాణేన్ని ఆవిష్కరించిన మోదీ..

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు (New parliament) ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెంతో పాటు స్టాంపును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS