ఆఫీస్‌లో ఉద్యోగులు బీర్ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!
Haryana: ఆఫీస్‌లో ఉద్యోగులు బీర్ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!
చండీగఢ్: ఆఫీస్‌లో పని ఒత్తిడిగా అనిపిస్తే.. చాల మంది ఉద్యోగులు క్యాంటీన్‌కు వెళ్లి టీ/కాఫీ తాగుతుంటారు. మరికొంతమంది మాత్రం సాయంత్రం ఆఫీస్ అయ్యాక..
పబ్, బార్‌కో వెళ్లి రిలాక్స్ అవుతుంటారు. ఇకపై ఆఫీస్ అయ్యేదాకా ఎదురుచూడాల్సిన అవసరంలేదు. క్యాంటీన్‌కు వెళ్లి టీ/కాఫీ తాగినట్లు.. ఆ రాష్ట్రంలో క్యాంటీన్‌కు వెళ్లి బీర్ తాగొచ్చు. ఎక్కడంటారా? హరియాణాలో. ఈ మేరకు హరియాణా (Haryana) ప్రభుత్వం ఉద్యోగులు ఆఫీస్‌లోనే మద్యం సేవించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇది కేవలం కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రమేనని తెలిపింది. హరియాణా రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని (Liquor Policy) ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పెద్ద కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఆఫీస్ పరిసరాల్లో ఆల్కహాల్ శాతం తక్కువ ఉన్న బీర్, వైన్ వంటి వాటిని తాగేందుకు అనుమతించింది..
జూన్ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. మే 9 తేదీన జరిగిన సమావేశంలో మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. ఐదువేలు మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, కనీసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సంస్థలు తమ ఉద్యోగులకు మద్యం సరఫరా చేయొచ్చు. ఇందుకోసం కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక లైసెన్స్ (L-10F)ను జారీ చేస్తుంది. లైసెన్స్ కోసం ఆయా సంస్థలు రూ. 10 లక్షలు వార్షిక రుసుము చెల్లించాలి. దాంతోపాటు మరో రూ. 3 లక్షలు సెక్యూరిటీ మొత్తంగా చెల్లించాలి. అలానే, సంస్థలో క్యాంటీన్ కోసం రెండు వేల చదరపు అడుగుల స్థలం కేటాయించాలి. నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన సంస్థల వద్ద ఎలాంటి రద్దీ ఉండకూడదు. కలెక్టర్, ఎక్సైజ్, ఐటీ కమీషనర్ల అనుమతితో లైసెన్స్ మంజూరు చేస్తారు.

Haryana: ఆఫీస్‌లో ఉద్యోగులు బీర్ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!

డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హార్థిక శుభాకాంక్షలు తెలిపిన మునుగోడు నియోజకవర్గ నాయకులు
NLG: యాదగిరి రెడ్డి మృతి BRS పార్టీకి తీరని లోటు

నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామం ఎస్ఎస్సి ఫలితాల్లో జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల మంచి ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరైన 42 మంది విద్యార్థులకు 39 మంది విద్యార్థులు 97% ఉత్తీర్ణత సాధించారు. వీరిలో నల్లగొండ, చర్ల పళ్లికి చెందిన శ్యామల శివప్రసాద్ 9.3 మరియు నల్ల రక్షిక 9.2 జిపిఏతో ఉత్తమ ఫలితాలు సాధించారని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ చైర్మన్ రమేష్ అభినందించారు.
NLG: వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట...

NLG: పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

NLG: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...



May 21 2023, 13:26
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
34.1k