/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఈ సమ్మర్ చాలా హాట్ గురూ Yadagiri Goud
ఈ సమ్మర్ చాలా హాట్ గురూ

రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వచ్చే మూడు రోజులు సోమ మంగళ వారాలు ఎండల తీవ్రత మరింత పెరిగి 45 డిగ్రీల ఉష్ణోగతలు దాటే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది.

రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరీంనగర్‌, జనగా మ, నల్ల గొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

14 జిల్లాలు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రా ద్రి కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మం చిర్యాల జిల్లాలో ఈ వడగాల్పుల ప్రభావం అధికం గా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

కొన్ని రోజుల క్రితం వరకు పగటివేళ ఉష్ణోగత్రలు పెరిగినా, రాత్రి వేళ మాత్రం చలిగాలులు వీచాయి. కానీ, ఇప్పుడు పగటి పూట ఎండలు దంచి కొడుతుండగా.. రాత్రి వేళలో మధ్యాహ్నం వేళ ఉక్కపోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది.

తిరుపతి ‘వందే భారత్‌’ ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై మొత్తం 16 బోగీలు

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ట్రైన్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ రైలులో ప్రస్తుతం 8 కోచ్‌లు ఉండగా, ప్రయాణికుల కోరిక మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి 16 కోచ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇక ఇందులో 14 ఏసీ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. అలాగే సీట్ల సంఖ్య 530 నుంచి 1036కి పెరగనుంది.

అయితే ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో 52 సీట్లు, చైర్‌కార్‌లో 478 సీట్లతో మొత్తం 530 సీట్లు ఉన్నాయి. ఈ రైలు ఆక్యుపెన్సీ ఏప్రిల్‌లో 131 శాతంగా నమోదైంది, మే మొదటి పది రోజుల్లో ఆక్యుపెన్సీ 134 శాతంగా ఉందని సమాచారం. అలాగే తిరుపతి నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు ఏప్రిల్‌లో 136 శాతం, మే నెలలో 137 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. అంతకముందు ఏప్రిల్ 8న సికింద్రాబాద్ నుంచి ఈ వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే..

వందే భారత్ ట్రైన్ కొత్త టైమింగ్స్..

ఉదయం 6గంటలకు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి బయల్దేరుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20701) రైలు మే 17 నుంచి ఉదయం 6.15 గంటలకు బయల్దేరేలా అధికారులు మార్పులు చేశారు.

అలాగే నల్గొండకు ఉదయం 7.29/7.30 గంటలకు; ఆ తర్వాత గుంటూరుకు 9.35/9.40; ఒంగోలు 11.09/11.10; నెల్లూరు మధ్యాహ్నం 12.29/12.30 గంటలకు వెళ్లి అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలయ్యే సరికి తిరుపతికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక, తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరే రైలు(20702) నిర్ణీత స్టేషన్లలో ఆగుతూ అదే రోజు రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. స్థానాలను చేరనుంది.

SB NEWS

మరో ఏడు నెలలు ఎన్నికల వేడే

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగి శాయి కానీ ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో వరస ఎన్నికలు జరగనుండడంతో వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దాకా రాజకీయ వేడి అలాగే కొనసాగే అవకాశం ఉంది. కనీసం మూడు రాష్ట్రాలకు అ సెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటుగా జరిగే అవకాశం ఉంది.

వాస్తవానికి ఈ ఏడాది మూడు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలలో అసెంబ్లీ ఎన్నికలతో మొదలైంది. ఇక కర్నాటక తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఏడాది డిసెంబర్ ,వచ్చే ఏడాది జనవరి మధ్య కాలంలో ఈ రాష్ట్రాల శాసన సభల గడువు ముగియనుండడంతో ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.40 స్థానాలున్న మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17తో ముగియనుండగా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువువచ్చే ఏడాది జనవరి 3, 6 తేదీల్లో ముగియనుంది.

ఇక రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో, తెలంగాణ అసెంబ్లీ గడువు అదే నెల 16తో ముగియనుంది. ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను తోసిపుచ్చలేము. ఈ ఎన్నికలే కాకుండా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ, కశ్మీర్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నిర్వహించే అవకాశం లేకపోలేదు.

2023లో శీతాకాల ప్రభావం తగ్గిన తర్వాత వేసవిలో ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు గతంలో చెప్పాయి. జులై 1నుంచి ఆగస్టు 31 దాకా 62 రోజుల అమరనాథ్ యాత్ర ముగిసిన తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌లో జమ్మూ, కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల చట్టసభల గడువు వచ్చే ఏడాది జూన్‌లో ముగియనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పార్లమెంటు ఎన్నికలతో పాటుగా నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉంది.

ChandraBabu: ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ.. చేసిన అభివృద్ధి శాశ్వతం: చంద్రబాబు

హైదరాబాద్‌: ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, తాను చేసిన అభివృద్ధి శాశ్వతమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్‌ ఆఫ్ పబ్లిక్‌ పాలసీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25ఏళ్ల క్రితం విజన్‌ 2020 ప్రకటించినప్పుడు కొందరు విజన్‌ 420 అని అవహేళన చేశారన్నారు. కానీ, ప్రస్తుతం తన విజన్‌ హైదరాబాద్‌ అభివృద్ధిలో కనిపిస్తోందని తెలిపారు. ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 2047కు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుందన్నారు..

టెలికమ్యూనికేషన్ల విషయంలోనూ ఎన్నో సంస్కరణలు తెచ్చామని, వాటి ఫలితాలు ఇప్పుడు అంతా అనుభవిస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌లో భారత్‌కు సాటి వచ్చే దేశాలు లేవన్నారు. 75ఏళ్ల క్రితం వరకు బ్రిటిషర్లు ఇండియాను పాలించారు.. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్‌ బ్రిటన్‌ను పాలిస్తున్నారని తెలిపారు. దేశంలో మధ్య తరగతి ప్రజల సంఖ్య బాగా పెరుగుతోందన్నారు.

''1978లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మాకు జీపు ఇచ్చేవారు. అప్పటి రోడ్లలో జీపులు నడిపేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు న్యూ ఇండియా చూస్తున్నారు. దేశ ప్రగతిని సంస్కరణలకు ముందు.. తర్వాత అని చెప్పుకోవాలి. 2047కు మన తలసరి ఆదాయం 26వేల డాలర్లుగా ఉండాలి. ప్రస్తుతం మనది ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మరో పాతికేళ్లలో మనది ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుంది.

2047నాటికి ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలి. యువత తలచుకుంటే 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం సాధ్యమే. విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు చాలా మంది హెచ్చరించారు. విద్యుత్‌ సంస్కరణల కారణంగా నేను అధికారం కూడా కోల్పోయాను. దేశంలో విద్యుత్‌ సంస్కరణల రూపకల్పనలో నాది కీలకపాత్ర. దేశంలోనే మొదటి హరిత విమానాశ్రయం శంషాబాద్‌లో నిర్మించాం. శంషాబాద్‌ విమానాశ్రయం కోసం 20 ఎయిర్‌పోర్టులను స్వయంగా పరిశీలించా. ఐటీ, బీటీ, ఫార్మా వంటి రంగాల్లో ఎంతో ప్రగతి సాధించాం'' అని చంద్రబాబు వివరించారు..

అమ్మ ప్రేమ దక్కిన వాడే నిజమైన కోటీశ్వరుడు

మాతృ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఈరోజు తన నివాసంలో తన తల్లి గారైన శోభ రావుకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేని వాడు కాదు అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు.

బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి ‘మదర్ థెరిసా’యే. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ.. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా అమ్మ కళ్లలోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి.

మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కవిత అన్నారు.

SB NEWS

CBI Director: సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌

దిల్లీ: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (CBI) నూతన డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ ప్రవీణ్‌ సూద్‌ (Praveen Sood) ఎంపికయ్యారు..

ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఈయన్ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు ప్రవీణ్‌సూద్‌ ఈ పదవిలో కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు. 1986 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఆ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు.

SB NEWS

SB NEWS

SB NEWS

అమ్మ కంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు : మెగాస్టార్ చిరంజీవి

ఎంతగొప్ప పేరు గలవాడైనా ఆమె ముందు ఎప్పటికీ చిన్నవాడే. ఎందుకంటే ఈ సృష్టికి నిన్ను పరిచయం చేసిన ఆమె కంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇవాళ మదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ ట్వీట్‌ రాస్తూ.. 'అనురాగం, మమకారం... ఈ రెండిటికి అర్థమే అమ్మ .. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి హ్యాపీ మదర్స్ డే' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భోళాశంకర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్‌ లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నారు.

SB NEWS

SB NEWS

SB NEWS

కాంగ్రెస్ లోకి పొంగులేటి ❓️

కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఈ ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీకి జై కొడదామనుకున్న చాలా మంది నేతల అడుగులు కాంగ్రెస్ వైపు పడే అవకాశం కనిపిస్తోంది. అందరికంటే ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన జూపల్లి, పొంగులేటి వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. కర్ణాటక ఎన్నికలఫలితాల తర్వాత జూపల్లి, పొంగులేటి బీజేపీలో చేరాలని డిసైడ్‌ అయ్యారు. వారం క్రితం ఖమ్మంలో బీజేపీ నేతలు పొంగులేటితో సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్‌ లో చేరాలనుకున్న ఆలోచన విరమించుకుని ఇద్దరూ బీజేపీలో చేరేందుకు చర్చలు జరిపారు.

ఎటూ తేల్చుకోలేకపోతున్న జూపల్లి , పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూపల్లి.. ఎవరికి వారే బాగా పట్టున్న నేతలుకావడంతో వారిద్దరినీ పార్టీలో చేర్చుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకత్వం చాలా ఆఫర్లు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే అప్పటికప్పుడు జెండా కప్పుకోకుండా కర్ణాటక ఎన్నికల ఫలితాల వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని ఈటల బృందానికి పొంగులేటి హామీ ఇచ్చారు. అయితే కర్ణాటక ఫలితాలు బీజేపీకి ఎంత షాకిచ్చాయో.. పొంగులేటి, జూపల్లికి కూడా అంతే షాకిచ్చాయి. శనివారం ఫలితాలు వెల్లడయ్యాక జూపల్లి, పొంగులేటి ఫోన్లో సుదీర్ఘంగా చర్చించుకున్నారని... బీజేపీలో చేరే అంశాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు.

బీజేపీకి ఇక హైప్ లేనట్లేనని భావిస్తున్నారా?

ఫలితాల తర్వాత మాత్రం కాంగ్రెస్‌ వైపే పొంగులేటి అడుగులు కూడా పడుతున్నాయని సమాచారం. ఇదే బాటలో జూపల్లి కూడా నడవబోతున్నారని అంటున్నారు. కాంగ్రెస్‌కే జై కొట్టాలని ఇద్దర నేతల అనుచరులు కూడా పట్టుబడటంతో ఆ మేరకు తుది నిర్ణయానికివచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఇంతకు ముందే ఇద్దరూ కాంగ్రెస్‌ జెండా కప్పుకోవాలి. ప్రియాంక గాంధీ హైదరాబాద్‌ పర్యటనలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సి ఉంది.

అయితే అప్పట్లో బీజేపీ నేతలు వత్తిడి తీసుకురావడంతో ఆలోచన వాయిదా పడ్డప్పటికీ ఇక ఇదే ఫైనల్‌ డెసిషన్‌ అంటున్నారని అంటున్నారు. జూపల్లి, పొంగులేటి మాత్రమే కాదు బీజేపీలో చేరాలని చాలా మంది నేతలు ఉత్సాహపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దామని రాష్ట్ర నేతలు ఎప్పటి నుంచో వారందరికీ సర్ది చెబుతున్నారు. ఇప్పుడు వారంతా కాంగ్రెస్ లోకి క్యూ కట్టే అవకాశం ఉంది.

బీజేపీలో చేరికలు ఇక కష్టమే !

బీజేపీని ఎలాగైనా నేతలతో నింపేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చేరికల కమిటీకి ఇంచార్జ్ గా ఉన్న ఈటల రాజేందర్ విసుగుపుట్టి రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. అయితే హైకమాండ్ పెద్దలు సర్ది చెప్పారు. కొంత కాలం ఆగాలన్నారు. ఇప్పుడు ఆయనకు ఇక ఎలాంటి చేరికలు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పుడు జోష్ అంతా కాంగ్రెస్ లోనే కనిపిస్తోంది. కొంత కాలం పాటు బీజేపీ ఈ నిరాశలోనే ఉండనుంది.

కర్ణాటకలో కొత్త సీఎం కోసం కసరత్తు : సర్వత్ర ఉత్కంఠ

మూడున్నర దశాబ్దాల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ భారీగా సీట్లను సాధించింది. 1989లో జరిగిన ఎన్నికల్లో 224 నియోజక వర్గాలకుగాను 178 స్థానాల్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత, 1999లో 132 స్థానాలు గెలుపొందింది. మళ్లీ ఈసారి ఎన్నికల్లో 136 స్థానాలు దక్కడం విశేషం.

ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కనకపుర నియోజకవర్గంలో లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో ఘన విజయం అందుకున్నారు. సీఎం రేసులోనే ఉన్న సిద్దరామయ్య కూడా వరుణ స్థానం నుంచి ఘన విజయం నమోదు చేశారు. ఒక దశలో వరుణలో ఆయన గెలుపు ఈసారి కష్టమని గట్టిగా వినిపించింది.

ఆయనపై బీజేపీ గృహ వసతి శాఖ మంత్రి సోమణ్ణను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. ఇక, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ తుమకూరు జిల్లాలోని కొరటగెరె నుంచి; పార్టీలోని లింగాయత్‌ నేత శ్యామనూరు శివశంకరప్ప దావణగెరె నుంచి గెలిచారు.

కాగా, మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత పథకాలు కూడా కాంగ్రెస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. అధికారంలోకి వస్తే.. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు; కుటుంబంలో ఒక మహిళకు నెలకు రూ.2000; మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం; గ్రాడ్యుయేట్లకు రూ.3000, డిప్లమో చేసిన వారికి రూ.1500 నిరుద్యోగ భృతి వంటి హామీలు ఆ పార్టీకి ఓట్లను రాల్చాయి. అదే సమయంలో, సోనియా గాంధీ సహా కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఒక్కుమ్మడిగా వ్యూహాత్మక ప్రచారం సాగించడమూ కలిసొచ్చింది.

మిలియన్ డాలర్ల ప్రశ్న....

ఇప్పుడు ప్రతి ఒక్కరి మదినీ వేధిస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న.. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు!? ఐదేళ్లూ పార్టీని తన భుజస్కంధాలపై మోసి.. అనేక కష్టనష్టాలను అనుభవించిన డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓకే చెబుతుందా!? లేక, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు జైకొడుతుందా!? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది.

కాంగ్రెస్‌ ఘన విజయం నేపథ్యంలో రాహుల్‌ గాంధీ సూచన మేరకు పార్టీ సీనియర్‌ నేతలంతా బెంగళూరులో శనివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై కసరత్తు జరిగింది. ఏకాభిప్రాయ సాధన ఆధారంగా సీఎంను ఎంపిక చేయాలా..? లేదా అధిష్ఠానం సూచన మేరకు ముందుకు సాగాలా..? అనే అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం ఆదివారం జరిగే అవకాశం ఉందని సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. వారంలోగా నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్‌ ‘జోష్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో కొత్త జోష్‌ను తెచ్చింది. అటు ఇతర రాష్ట్రాల్లో, ఇటు స్వరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చాలాకాలంగా ఓటములను భరిస్తూ వస్తున్న టీపీసీసీ నేతల్లో ఈ విజయం మంచి ఉత్సాహాన్ని నింపింది. ఈ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమవుతాయని, తెలంగాణలోనూ తామే అధికారంలోకి వస్తామని ఢంకా బజాయించి చెప్పే స్థాయిలో ఈ ఫలితాలు రాష్ట్ర నేతలకు ఊపు తెచ్చి పెట్టాయి.

అసెంబ్లీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటామని, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమేనన్న అంచనాతో ఎన్నికలకు వెళ్తామని ఇక్కడి నేతలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభ మసకబారుతున్న నేపథ్యంలో కర్ణాటకలోనూ ఓడిపోతే తెలంగాణలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చేదని, కానీ కర్ణాటక ఫలితం ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితిలో మార్పు తెచి్చందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక పార్టీ నుంచి వలసలు తగ్గుతాయని, అదే సమయంలో పారీ్టలోకి చేరికలు పెరుగుతాయని చెబుతున్నారు.

కలిసికట్టుగా..

కర్ణాటక కాంగ్రెస్‌తో పోలిస్తే తెలంగాణ పారీ్టలో నెలకొన్న గ్రూపు తగాదాలు కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతున్నాయి. అక్కడ శివకుమార్, సిద్దరామయ్యలు సీఎం కుర్చీ కోసం పోటీపడినప్పటికీ ఎక్కడా అంతర్గత కలహాలు బయటపడకుండా నెట్టుకొచ్చారని, ఐకమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారనే చర్చ జరుగుతోంది. అధికారం దక్కాలంటే అందరం కలిసి పనిచేయాల్సిందేనని, అదే భావనకు అందరు నేతలు వస్తారని, కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తారని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

జోడో యాత్రపై ఆశలు

కర్ణాటకలో రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర నిర్వహించిన 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 చోట్ల కాంగ్రెస్‌ గెలుపొందడం తెలంగాణ పార్టీ నేతల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. గత అక్టోబర్, నవంబర్‌లో తెలంగాణలోనూ రాహుల్‌ జోడో యాత్ర జరిగింది. రాష్ట్రంలో 19 అసెంబ్లీ, 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరగ్గా, ఆయా స్థానాల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాలు అక్కడి నేతల్లో మొదలయ్యాయి.

నారాయణ పేట, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్‌ నగర్, రాజేంద్రనగర్, బహుదూర్‌పుర, చారి్మనార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగపల్లి, పఠాన్‌చెరు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ ఖేడ్, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడో యాత్ర సాగింది. కర్ణాటక ఫలితాలను బట్టి ఆయా స్థానాల్లో కొంచెం కష్టపడితే విజయం సాధించగలమనే ధీమా టీపీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తంమీద గెలుపునకు మొహం వాచినట్టు ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సరిహద్దు కర్ణాటకలో దక్కిన విజయం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పినట్టు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.