/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz అమ్మ కంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు : మెగాస్టార్ చిరంజీవి Yadagiri Goud
అమ్మ కంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు : మెగాస్టార్ చిరంజీవి

ఎంతగొప్ప పేరు గలవాడైనా ఆమె ముందు ఎప్పటికీ చిన్నవాడే. ఎందుకంటే ఈ సృష్టికి నిన్ను పరిచయం చేసిన ఆమె కంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇవాళ మదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ ట్వీట్‌ రాస్తూ.. 'అనురాగం, మమకారం... ఈ రెండిటికి అర్థమే అమ్మ .. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి హ్యాపీ మదర్స్ డే' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భోళాశంకర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్‌ లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నారు.

SB NEWS

SB NEWS

SB NEWS

కాంగ్రెస్ లోకి పొంగులేటి ❓️

కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఈ ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీకి జై కొడదామనుకున్న చాలా మంది నేతల అడుగులు కాంగ్రెస్ వైపు పడే అవకాశం కనిపిస్తోంది. అందరికంటే ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన జూపల్లి, పొంగులేటి వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. కర్ణాటక ఎన్నికలఫలితాల తర్వాత జూపల్లి, పొంగులేటి బీజేపీలో చేరాలని డిసైడ్‌ అయ్యారు. వారం క్రితం ఖమ్మంలో బీజేపీ నేతలు పొంగులేటితో సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్‌ లో చేరాలనుకున్న ఆలోచన విరమించుకుని ఇద్దరూ బీజేపీలో చేరేందుకు చర్చలు జరిపారు.

ఎటూ తేల్చుకోలేకపోతున్న జూపల్లి , పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూపల్లి.. ఎవరికి వారే బాగా పట్టున్న నేతలుకావడంతో వారిద్దరినీ పార్టీలో చేర్చుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకత్వం చాలా ఆఫర్లు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే అప్పటికప్పుడు జెండా కప్పుకోకుండా కర్ణాటక ఎన్నికల ఫలితాల వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని ఈటల బృందానికి పొంగులేటి హామీ ఇచ్చారు. అయితే కర్ణాటక ఫలితాలు బీజేపీకి ఎంత షాకిచ్చాయో.. పొంగులేటి, జూపల్లికి కూడా అంతే షాకిచ్చాయి. శనివారం ఫలితాలు వెల్లడయ్యాక జూపల్లి, పొంగులేటి ఫోన్లో సుదీర్ఘంగా చర్చించుకున్నారని... బీజేపీలో చేరే అంశాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు.

బీజేపీకి ఇక హైప్ లేనట్లేనని భావిస్తున్నారా?

ఫలితాల తర్వాత మాత్రం కాంగ్రెస్‌ వైపే పొంగులేటి అడుగులు కూడా పడుతున్నాయని సమాచారం. ఇదే బాటలో జూపల్లి కూడా నడవబోతున్నారని అంటున్నారు. కాంగ్రెస్‌కే జై కొట్టాలని ఇద్దర నేతల అనుచరులు కూడా పట్టుబడటంతో ఆ మేరకు తుది నిర్ణయానికివచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఇంతకు ముందే ఇద్దరూ కాంగ్రెస్‌ జెండా కప్పుకోవాలి. ప్రియాంక గాంధీ హైదరాబాద్‌ పర్యటనలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సి ఉంది.

అయితే అప్పట్లో బీజేపీ నేతలు వత్తిడి తీసుకురావడంతో ఆలోచన వాయిదా పడ్డప్పటికీ ఇక ఇదే ఫైనల్‌ డెసిషన్‌ అంటున్నారని అంటున్నారు. జూపల్లి, పొంగులేటి మాత్రమే కాదు బీజేపీలో చేరాలని చాలా మంది నేతలు ఉత్సాహపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దామని రాష్ట్ర నేతలు ఎప్పటి నుంచో వారందరికీ సర్ది చెబుతున్నారు. ఇప్పుడు వారంతా కాంగ్రెస్ లోకి క్యూ కట్టే అవకాశం ఉంది.

బీజేపీలో చేరికలు ఇక కష్టమే !

బీజేపీని ఎలాగైనా నేతలతో నింపేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చేరికల కమిటీకి ఇంచార్జ్ గా ఉన్న ఈటల రాజేందర్ విసుగుపుట్టి రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. అయితే హైకమాండ్ పెద్దలు సర్ది చెప్పారు. కొంత కాలం ఆగాలన్నారు. ఇప్పుడు ఆయనకు ఇక ఎలాంటి చేరికలు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పుడు జోష్ అంతా కాంగ్రెస్ లోనే కనిపిస్తోంది. కొంత కాలం పాటు బీజేపీ ఈ నిరాశలోనే ఉండనుంది.

కర్ణాటకలో కొత్త సీఎం కోసం కసరత్తు : సర్వత్ర ఉత్కంఠ

మూడున్నర దశాబ్దాల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ భారీగా సీట్లను సాధించింది. 1989లో జరిగిన ఎన్నికల్లో 224 నియోజక వర్గాలకుగాను 178 స్థానాల్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత, 1999లో 132 స్థానాలు గెలుపొందింది. మళ్లీ ఈసారి ఎన్నికల్లో 136 స్థానాలు దక్కడం విశేషం.

ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కనకపుర నియోజకవర్గంలో లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో ఘన విజయం అందుకున్నారు. సీఎం రేసులోనే ఉన్న సిద్దరామయ్య కూడా వరుణ స్థానం నుంచి ఘన విజయం నమోదు చేశారు. ఒక దశలో వరుణలో ఆయన గెలుపు ఈసారి కష్టమని గట్టిగా వినిపించింది.

ఆయనపై బీజేపీ గృహ వసతి శాఖ మంత్రి సోమణ్ణను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. ఇక, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ తుమకూరు జిల్లాలోని కొరటగెరె నుంచి; పార్టీలోని లింగాయత్‌ నేత శ్యామనూరు శివశంకరప్ప దావణగెరె నుంచి గెలిచారు.

కాగా, మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత పథకాలు కూడా కాంగ్రెస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. అధికారంలోకి వస్తే.. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు; కుటుంబంలో ఒక మహిళకు నెలకు రూ.2000; మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం; గ్రాడ్యుయేట్లకు రూ.3000, డిప్లమో చేసిన వారికి రూ.1500 నిరుద్యోగ భృతి వంటి హామీలు ఆ పార్టీకి ఓట్లను రాల్చాయి. అదే సమయంలో, సోనియా గాంధీ సహా కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఒక్కుమ్మడిగా వ్యూహాత్మక ప్రచారం సాగించడమూ కలిసొచ్చింది.

మిలియన్ డాలర్ల ప్రశ్న....

ఇప్పుడు ప్రతి ఒక్కరి మదినీ వేధిస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న.. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు!? ఐదేళ్లూ పార్టీని తన భుజస్కంధాలపై మోసి.. అనేక కష్టనష్టాలను అనుభవించిన డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓకే చెబుతుందా!? లేక, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు జైకొడుతుందా!? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది.

కాంగ్రెస్‌ ఘన విజయం నేపథ్యంలో రాహుల్‌ గాంధీ సూచన మేరకు పార్టీ సీనియర్‌ నేతలంతా బెంగళూరులో శనివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై కసరత్తు జరిగింది. ఏకాభిప్రాయ సాధన ఆధారంగా సీఎంను ఎంపిక చేయాలా..? లేదా అధిష్ఠానం సూచన మేరకు ముందుకు సాగాలా..? అనే అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం ఆదివారం జరిగే అవకాశం ఉందని సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. వారంలోగా నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్‌ ‘జోష్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో కొత్త జోష్‌ను తెచ్చింది. అటు ఇతర రాష్ట్రాల్లో, ఇటు స్వరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చాలాకాలంగా ఓటములను భరిస్తూ వస్తున్న టీపీసీసీ నేతల్లో ఈ విజయం మంచి ఉత్సాహాన్ని నింపింది. ఈ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమవుతాయని, తెలంగాణలోనూ తామే అధికారంలోకి వస్తామని ఢంకా బజాయించి చెప్పే స్థాయిలో ఈ ఫలితాలు రాష్ట్ర నేతలకు ఊపు తెచ్చి పెట్టాయి.

అసెంబ్లీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటామని, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమేనన్న అంచనాతో ఎన్నికలకు వెళ్తామని ఇక్కడి నేతలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభ మసకబారుతున్న నేపథ్యంలో కర్ణాటకలోనూ ఓడిపోతే తెలంగాణలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చేదని, కానీ కర్ణాటక ఫలితం ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితిలో మార్పు తెచి్చందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక పార్టీ నుంచి వలసలు తగ్గుతాయని, అదే సమయంలో పారీ్టలోకి చేరికలు పెరుగుతాయని చెబుతున్నారు.

కలిసికట్టుగా..

కర్ణాటక కాంగ్రెస్‌తో పోలిస్తే తెలంగాణ పారీ్టలో నెలకొన్న గ్రూపు తగాదాలు కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతున్నాయి. అక్కడ శివకుమార్, సిద్దరామయ్యలు సీఎం కుర్చీ కోసం పోటీపడినప్పటికీ ఎక్కడా అంతర్గత కలహాలు బయటపడకుండా నెట్టుకొచ్చారని, ఐకమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారనే చర్చ జరుగుతోంది. అధికారం దక్కాలంటే అందరం కలిసి పనిచేయాల్సిందేనని, అదే భావనకు అందరు నేతలు వస్తారని, కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తారని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

జోడో యాత్రపై ఆశలు

కర్ణాటకలో రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర నిర్వహించిన 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 చోట్ల కాంగ్రెస్‌ గెలుపొందడం తెలంగాణ పార్టీ నేతల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. గత అక్టోబర్, నవంబర్‌లో తెలంగాణలోనూ రాహుల్‌ జోడో యాత్ర జరిగింది. రాష్ట్రంలో 19 అసెంబ్లీ, 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరగ్గా, ఆయా స్థానాల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాలు అక్కడి నేతల్లో మొదలయ్యాయి.

నారాయణ పేట, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్‌ నగర్, రాజేంద్రనగర్, బహుదూర్‌పుర, చారి్మనార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగపల్లి, పఠాన్‌చెరు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ ఖేడ్, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడో యాత్ర సాగింది. కర్ణాటక ఫలితాలను బట్టి ఆయా స్థానాల్లో కొంచెం కష్టపడితే విజయం సాధించగలమనే ధీమా టీపీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తంమీద గెలుపునకు మొహం వాచినట్టు ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సరిహద్దు కర్ణాటకలో దక్కిన విజయం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పినట్టు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

కొండగట్టు లో హనుమాన్ జయంతి ఉత్సవాలు

జగిత్యాల జిల్లా:

మల్యాల మండలం కొండగట్టులో నేడు హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇవాల వేడుకలు జరగనుండగా.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అంజన్న సన్నిధికి లక్షలాది మంది అంజనా దీక్షాపరులు తరలి వచ్చారు.

ప్రతి సంవత్సరం వైశాఖ ముల్దశమి రోజున హనుమంతుని తిరునక్షత్ర జయంతి వేడుకలను ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలో త్రికుండమంతిమ యజ్ఞం, వార్షికోత్సవం రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచలం సీతారాచంద్రస్వామి ఆలయం నుంచి స్వామివారికి పట్టువస్త్రాలు పంపారు. వాటిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ స్వామికి అందజేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ముందస్తుగా 3.60 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు.

భక్తుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే పులిహోర సిద్ధం చేయన్నారు. అంజన్న దర్శనానికి 14 కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఉత్సవాల సందర్భంగా కొండగట్టు ఆలయంలో నిఘా పెంచేందుకు 104 సీసీ కెమెరాలతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఆలయం తరపున ఆలయం లోపల, బయట ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలకు అదనంగా 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

SB NEWS

బిఆర్ఎస్ అంచనా తప్పిందా❓️

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణలో అధికార బీఆర్‌ఎ్‌సపై పడనుందా? సరిహద్దు ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎక్కువగా ఉండనుందా? జేడీఎస్‌ ఘోర వైఫల్యం బీఆర్‌ఎ్‌సకు ఇబ్బందికరంగా మారనుందా? అంటే.. రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు. త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికలపై కర్ణాటక ఫలితాల ప్రభావం తప్పకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

భారత రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత సీఎం కేసీఆర్‌ కర్ణాటకతోనే ఎక్కువగా సంబంధ బాంధవ్యాలను నెరిపినందున.. ఆ ప్రభావం తప్పక ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ బలపడి బీఆర్‌ఎ్‌సకు కొరకరాని కొయ్యగా మారొచ్చని అంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడం బీఆర్‌ఎ్‌సకు దెబ్బేనని పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌-కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్‌ హవా!

కర్ణాటక ఫలితాలపై దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసింది. అధికార బీజేపీకి ఓటమి తప్పదని, కాంగ్రెస్‌ విజయం సాధించనుందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ నెల 10న ఎన్నికలు జరిగిన తర్వాత చాలా ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా కాంగ్రె్‌సదే ఆధిక్యమంటూ వెల్లడించాయి. అన్నట్లుగానే కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 136 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణతో సరిహద్దును కలిగి ఉన్న హైదరాబాద్‌-కర్ణాటక రీజియన్‌లోని 41 సీట్లలో 26 సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ బొక్కబోర్లా పడింది. ఇది బీఆర్‌ఎ్‌సకు పెద్ద షాకేనని చెబుతున్నారు.

బీఆర్‌ఎ్‌సను ఏర్పాటు చేశాక కేసీఆర్‌ తొలుత కుమారస్వామినే కలిశారు. ఆయనకు కేసీఆర్‌ ఆర్థిక సాయం కూడా చేశారన్న ప్రచారం జరిగింది. దీంతో బీఆర్‌ఎస్‌, జేడీస్‌ కలిసే కర్ణాటకలో పోటీ చేస్తాయన్న వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ సరిహద్దులోని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దృష్టి పెడతారన్న ప్రచారమూ జరిగింది. కర్ణాటకలో జేడీఎస్‌ గెలిస్తే అక్కడ కుమారస్వామి ద్వారా చక్రం తిప్పవచ్చని కేసీఆర్‌ భావించారు. ఒకవేళ కాంగ్రెస్‌, బీజేపీకిపూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే జేడీఎస్‌ ద్వారా రాజకీయాన్ని నడపవచ్చనుకున్నారు. ఒకదశలో కర్ణాటకతో పాటే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనీ యోచించారు. కాంగ్రెస్‌ గెలిస్తే.. ఆ ప్రభావం తెలంగాణలో ఉంటుందన్న భయాందోళనలు అప్పుడే వ్యక్తమయ్యాయి. ఇప్పుడదే జరగబోతోంది. కర్ణాటకలో, ముఖ్యంగా హైదరాబాద్‌-కర్ణాటక (కల్యాణ కర్ణాటక) రీజియన్‌లో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. ఈ రీజియన్‌లోని బీదర్‌, యాద్గిర్‌, రాయ్‌చూర్‌, గుల్బర్గా, కొప్పల్‌ తదితర ప్రాంతాల్లోని ప్రజలకు తెలంగాణ ప్రజలకు మధ్య బంధుత్వాలు ఉన్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు కీలకం కానున్నారు. సరిహద్దులోని ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడంతో, ఇటువైపు ప్రజలు కూడా కాంగ్రె్‌సకే ఓటేస్తారన్న చర్చ జరుగుతోంది. బంధువుల రాకపోకల వల్ల ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులోని సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలతో పాటు బాన్సువాడ వంటి ప్రాంతాల్లో బీఆర్‌ఎ్‌సపై తీవ్ర ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలున్నాయి. కేసీఆర్‌ నమ్మి దోస్తీ చేసిన జేడీఎ్‌సను కన్నడిగులు ఘోరంగా ఓడించారు. ఇక్కడ కూడా కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎ్‌సకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. పైగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్న సానుభూతి, అభిమానం ఇక్కడి ప్రజల్లో కొంత మేరకు ఉంది. ఇది కాంగ్రె్‌సకు కలిసి వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. కర్ణాటకలో గెలిచిన జోష్‌లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోనూ స్పీడు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.

రేపు కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారం..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది.

ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు సీఎల్పీ సమావేశం జరుగనుంది. ఈ తరుణంలో బెంగుళూరు చేరుకుంటున్నారు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్, సూర్జేవాల ల సమక్షం లో సీఎల్పీ సమావేశం జరుగనుంది. చెయ్యి ఎత్తే విధానం ద్వారా సీఎల్పీ నేత ఎంపిక ఓటింగ్ ఉంటుంది.

సీఎల్పీ నేత ఎంపిక తర్వాత రాజ్ భవన్ కి కలసికట్టుగా గవర్నర్ గెహ్లాట్ తో భేటి కానున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు కు సిద్దమంటూ లేఖ ఇవ్వనున్నారు సీఎల్పీ నేత. రేపు ప్రమాణ స్వీకారం కార్యక్రమం.. తర్వాత క్యాబినెట్ ఏర్పాటు జరుగనుంది. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు స్కీమ్ అమలుపై తొలి సంతకం చేయనుంది కాంగ్రెస్‌ కొత్త సర్కార్‌. అయితే. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య హోం మంత్రి గా డీకే శివ కుమార్‌ ఉండనున్నట్లు సమాచారం.

SB NEWS

SB NEWS

కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ చేస్తాం

హైదరాబాద్ :

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు మేజిక్ ఫిగర్ సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ మేరకు కాంగ్రెస్ 125 స్థానాల వరకు ఆధిక్యతలో కొనసాగుతోంది. బీజేపీ 70 స్థానాల్లోనే ప్రస్తుతం ఆధిక్యతలో ఉంది. ముఖ్యమంత్రి బొమ్మ పరోక్షంగా పరాజయం అంగీకరించారు.

ఈ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ట్రెండ్స్ పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని ధీమా తో కనిపించారు. కేసీఆర్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణలో కర్ణాటక ఎఫెక్ట్: దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం చేజారింది. హస్తం వశం అవుతోంది. వెల్లడవుతన్న ట్రెండ్స్ కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యతను సూచిస్తున్నాయి. మేజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ సొంతగా చేరుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. జేడీఎస్ సహకారం లేకుండానే కాంగ్రెస్ అధికారం దక్కించుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ కు ఈ ఫలితాలు దేశ వ్యాప్తంగా జోష్ ను ఇచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కు సిద్దం అవుతున్న వేళ ఈ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. బజరంగ్ బలీ కాంగ్రెస్ ను గెలింపించారని వ్యాఖ్యానించారు. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూల తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు..

SB NEWS

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలే

•నెలాఖరు వరకు మద్యం ప్రియులకు పాత సరుకే

భూపాలపల్లి:

మద్యం ప్రియుల ఆశలు అడియాసలే అయ్యాయి. ప్రభుత్వం తగ్గించిన ధరలు ఇంకా అమలుకు నోచుకోలేదు. పాత స్టాకు ఉన్నంత వరకు బాటిల్‌పై ఉన్న ధరల లేబుల్‌ ప్రకారమే అమ్మకాలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు.

వేసవి కావటంతో మద్యం వ్యాపారులు ఎక్కువ మొత్తం లో స్టాక్‌ తెచ్చి పెట్టుకున్నారు. అది అమ్ముడుపోతేనే కొత్త స్టాకు వచ్చేది. అప్పటి వరకు పాత స్టాకుపై ఉన్న ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోందని మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించినప్పటికీ షాపుల్లో పాత ధరలకే అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు వర్షాలతో బీర్లకు డిమాండ్‌ తగ్గటంతో మద్యం వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం మద్యం అమ్మకాల నుంచి వచ్చే ఆదాయం పైన ఆధార పడుతోంది. ఉమ్మడి భూపాలపల్లి ఎక్సైజ్‌ పరిధిలో 60 వైన్‌ షాపులు ఉన్నాయి. ఒక్క మంగపేట మండలంలో మినహా మిగతా అన్ని మండలాల్లో, జిల్లా కేంద్రాల్లో వైన్‌ షాపులు నడుస్తున్నాయి. ప్రభుత్వం గతంలో భారీగా మద్యం ధరలు పెంచటంతో అమ్మకాలు తగ్గాయి. ఆదాయం పడిపోతుండటంతో ప్రభుత్వం మే 5న మద్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది.

ఫుల్‌ బాటిల్‌పె రూ.40, హాఫ్‌ బాటిల్‌పె రూ.20, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలను తగ్గించారు. అన్నిరకాల బ్రాండ్లపై ఇదే పద్ధతిలో రేట్లు తగ్గాయి. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పాత ధరలకే షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో షాపుల వద్ద తగ్గిన ధరలకు అమ్మకాలు చేయటం లేదని మద్యం ప్రియులు వాగ్వావాదానికి దిగుతున్నారు. ప్రభుత్వం ధరలు తగ్గించినామద్యం వ్యాపారులు పాత ధరలే వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఫోన్లు కూడా వెళ్లుతున్నాయి. ధరలపై సర్దిచెప్పలేక మద్యం వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.

స్టాక్‌ ఉన్నంత వరకు పాత ధరలే..

మద్యం వ్యాపారులు నెలకు సరిపడా సరుకుకు ఒకేసారి ఆర్డర్‌ ఇస్తారు. ఏప్రిల్‌ 30వ తేదీనే మే నెలకు కావాల్సిన మద్యం కోసం డీడీలు చెల్లించారు. అయితే ప్రభుత్వం మే 5న మద్యం ధరలు తగ్గించింది. అప్పటికే నెలకు కావాల్సిన మద్యం పాత ధరల లేబిల్‌తో ఆయా ప్రాంతాల్లోని గోదాంలోకి చేరింది. పాత ధర ప్రకారమే వ్యాపారులు ప్రభుత్వానికి డీడీలు చెల్లించారు. తమకు వచ్చిన మద్యం పూర్తిగా అమ్మిన తర్వాతే కొత్త మద్యం కోసం డీడీలు తీయనున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సుమారు రూ.10 కోట్ల మద్యం స్టాకు ఉన్నట్లు అంచనా. దీంతో దాదాపుగా ఈ నెలఖారు వరకు పాత స్టాకే విక్రయించనున్నారు. మద్యం సీసాలపై తగ్గిన ధరల కోసం రెండు వారాలు మద్యం ప్రియులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ముఖ్యమంత్రి పీఠంపై కర్చీఫ్‌ వేసిన యతీంద్ర

బెంగళూరు :

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. కర్ణాటకతో పాటు ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో టపాసులు కాల్చి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో అప్పుడే సీఎం పీఠంపై అప్పుడే సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర కర్చీఫ్‌ వేసేశారు. కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ దక్కుతుందని.. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని యతీంద్ర సిద్ధరామయ్య తెలిపారు.

ఒక కొడుకుగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. గతంలో ఆయన పాలనతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రజలకు సుపరిపాలన అందించారని గుర్తు చేశారు.

ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే బీజేపీ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను సరిచేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని.. ఆయన ముఖ్యమంత్రి అవుతారని నొక్కి చెప్పారు.

SB NEWS