మిషన్ వాత్సల్య పథకంలో వికలాంగుల పిల్లలకు అవకాశం కల్పించాలి:పల్లకొండ కుమారస్వామి
మిషన్ వాత్సల్య పథకంలో వికలాంగుల పిల్లలకు అవకాశం కల్పించాలి
వి-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకంలో అనాధ పిల్లలతో పాటుగా వికలాంగులు తల్లిదండ్రులుగా ఉన్న వారి పేద విద్యార్థులకు కూడా మిషన్ వాత్సల్య పథకానికి వర్తింపజేయాలని వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరు వికలాంగులుగా ఉన్న వారి పిల్లలు పేదరికం వలన విద్యాభ్యాసం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం పరిచారు.
కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కుటుంబాలకు చెందిన పిల్లలకు కూడ విద్యను అందించడం కోసం కృషి చేయాలని,ఈ పథకానికి 72 వేల ఆదాయ పరిమితి విధించడం వల్ల,ఆదాయ పరిమితిలో
సడలింపు ఇవ్వాలి. చాలామంది ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యను అభ్యసించడం జరుగుతుందని, ప్రభుత్వం,ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా మిషన్ వాత్సల్య పథకంలో వర్తింప చేయాలనీ కోరడమైందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాస్తల్య పథకానికి కావాల్సిన ధ్రువ పత్రాలు సరైన సమయానికి అందక విద్య సంస్థలు సెలవులు కావడం వల్ల నాన అవస్థలుపడుతున్నారని దరఖాస్తు గడువు చాలా తక్కువగా ఉందనందున ఈ గడువును మరోసారి పొడిగించాలని తెలిపారు.పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ వాస్తల్య పథకం వికలాంగుల కుటుంబానికి చెందిన వారి పిల్లలు కూడా విద్యను అభ్యసించడానికి సహకారం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.
May 13 2023, 15:43