/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz NV Ramana | తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిది: జస్టిస్ ఎన్వీ రమణ Yadagiri Goud
NV Ramana | తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిది: జస్టిస్ ఎన్వీ రమణ

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి నిలయమైన తిరుమల (Tirumala) పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిపై ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు.

తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం కోసం టీటీడీ (TTD) నిర్వహించిన సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. అలిపిరి టోల్ గేట్ వద్ద ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డితో కలసి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

SB NEWS

SB NEWS

SB NEWS

కర్ణాటక కాబోయే సీఎం ఎవరు?

11:24 AM: విజయనగర్‌ నియోజవర్గంలో కాంగ్రెస్ గెలుపు. ఆనంద్ సింగ్ కొడుకు ఓటమి.

11:20 AM: కర్ణాటకలో తొలి ఫలితం వచ్చేసింది.. కుందాపుర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ విజయం సాధించారు.

11:15 AM: ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం విడుదల చేసి డేటా ఇదే...

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే విషయం ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటాను బట్టి స్పష్టమైంది. ఈసీ డేటా ప్రకారం.. కాంగ్రెస్ 120 నియోజకవర్గాలు, బీజేపీ 69 సీట్లు, జేడీఎస్ 26 స్థానాల్లో, ఇతరులు 3 చోట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:58 AM: హుబ్లీ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్.

10:55 AM: కేజీఎఫ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా..

కోలార్ జిల్లా కేజీఎఫ్ నియోజకవర్గంలో 8వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ 18,997 ఓట్ల మెజారిటీతో కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు 37,849 ఓట్లు రాగా.. బీజేపీకి 18,852 ఓట్లు వచ్చాయి.

10:40 AM: కోలాహలంగా ఏఐసీసీ కార్యాలయం..

కర్ణాటకలో విజయం దిశగా కాంగ్రెస్ పయనిస్తుండటంతో.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం కోలాహలంగా మారింది. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

10:34 AM: బళ్ళారి సిటీలో కాంగ్రెస్ లీడ్. కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి 2926 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్

ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది...* 

 కౌంటింగ్ మొదలైన గంట తర్వాత ట్రెండ్ ఇదీ... ఫలితాలపై స్పందించిన కుమారస్వామి

08:55 AM: వరుణ నియోజకవర్గంలో లీడ్‌లో దూసుకెళ్తున్న సిద్ధారమయ్య.

08:53 AM: బళ్లారిలో శ్రీరాములు ముందంజ

08:52 AM: ఉదయం హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సీఎం బసవరాజ్ బొమ్మై.

08:50 AM: 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ. 83 స్థానాల్లో లీడ్‌లో ఉన్న బీజేపీ అభ్యర్థులు. మరోవైపు జేడీఎస్ అభ్యర్థులు 19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

08:46 AM: చెన్నపట్నలో జేడీఎస్ అధినేత కుమారస్వామి వెనుకంజ. రామనగర నియోజకవర్గంలో కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి కూడా వెనుకంజ

08:44 AM: కనకపురలో డీకే శివకుమార్ ముందంజ

08:38 AM: ఈవీఎం ఓట్ల కౌంటింగ్ మొదలు.

08:35 AM: కౌంటింగ్ మొదలైన అరగంట తర్వాత పరిస్థితి ఇదీ..

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైన అరగంట తర్వాత ఫలితాల సరళిపై ఒక స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ 82 స్థానాల్లో, బీజేపీ 66 చోట్ల, జేడీఎస్ 17 చోట్ల ముందంజలో ఉన్నాయి.

08:28 AM: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిన్న రాత్రి సింగపూర్ నుంచి బెంగళూరు చేరుకున్న కుమారస్వామి ఫలితాల ట్రెండ్‌పై స్పందించారు. ఇప్పటివరకు తమను ఏ పార్టీ సంప్రదించలేదని చెప్పారు. ప్రస్తుతానికి తనకు డిమాండ్ లేదని వ్యాఖ్యానించారు.

08:28 AM: కర్ణాటక కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి..

కొడుకును చూసి గర్వపడుతున్నా : మంత్రి హరీష్ రావు

ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో మాత్రమే కాక.. సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. రాజకీయాలు మాత్రమే కాక.. అన్ని విషయాల గురించి రియాక్ట్‌ అవుతారు.

ఇక సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉన్నప్పటికి.. తన పర్సనల్‌ విషయాల గురించి మాత్రం షేర్‌ చేయరు. ఆయన కుటుంబం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ క్రమంలో తాజాగా హరీష్‌ రావు.. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన కుమారుడికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసిన హరీష్‌ రావు.. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నట్లు వెల్లడించారు.

హరీష్‌ రావు కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి.. పట్టా అందుకున్నాడు. ఈ మేరకు యూనివర్సిటీ స్నాతకోత్సవం అమెరికాలోని కొలరాడో కౌంటీ బౌల్డర్‌లో జరగింది.

హరీష్‌ రావు ఈ వేడుకలో పాల్గొనడం కోసం అమెరికా వెళ్లాడు. ఇక ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అర్చిష్మాన్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు.

ఈవేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘మా అబ్బాయి ఆర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉంటాను. ఇది నీలోని పట్టుదలకు, మార్పు తీసుకురావాలన్న నీ ఆకాంక్షకు నిదర్శనం. తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. అచ్చూ.. ఈ ఘనమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు అభినందనలు. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను’’ అంటూ తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకొచ్చారు హరీశ్‌ రావు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరలవుతోంది.

అడవులే కేంద్రంగా ఉగ్రవాద శిక్షణ

ఆయుధాలుసమీకరించింది మహ్మద్‌ సలీం

అక్కడి బృందానికీ ఇతడితోనే శిక్షణ

ఈ ఐదుగురి నుంచి విదేశాలకు ఫోన్‌ కాల్స్‌

నగరంతో పాటు భోపాల్‌లో పట్టుబడిన 16 మంది ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. నగర శివార్లలో ఉన్న వికారాబాద్‌లోని అనంతగిరి అడవుల మాదిరిగానే భోపాల్‌ సరిహద్దుల్లోని రైసెన్‌ అడవిని ఎంచుకున్నట్లు ఏటీఎస్‌ అధికారులు నిర్థారించారు. అక్కడ అరెస్టయిన 11 మందితో పాటు నగరంలో చిక్కిన ఐదుగురినీ ప్రస్తుతం ఏటీఎస్‌ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.

భోపాల్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సయ్యద్‌ డానిష్‌ అలీ ఇంటిలో సూత్రధారి యాసిర్‌ ఖాన్‌ నిర్వహించిన సమావేశాలకు నగరం నుంచి సలీంతో పాటు అబ్దుల్‌ రెహా్మన్, షేక్‌ జునైద్‌ కూడా హాజరయ్యారని ఏటీఎస్‌ చెప్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు సైతం తమకు లభించినట్లు స్పష్టం చేస్తోంది...

SB NEWS

SB NEWS

బైక్ కొనిస్తేనే తాళి కడతానంటూ తేల్చేసిన వరుడు!

కరీంనగర్:

మరికొద్ది క్షణాల్లో సందడిగా ఉన్న పెళ్లి మండపంలో ఇద్దరు ఒక్కటవ్వబోతున్నారు. అయితే, వరుడు మాత్రం తనకు బైక్ కొనిస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టాడు. లేదంటే తాను వధువు మెడలో తాళి కట్టేది లేదంటూ తెగేసి చెప్పేశాడు.

దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అదే సమయంలో అక్కడికొచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన ఉదారతను చాటుకున్నారు. బైక్ తాను కొనిస్తానని పెళ్లి ఆగకూడదని చెప్పడంతో.. వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. దీంతో అక్కడంతా సంతోషకర వాతావరణం నెలకొంది.

SB NEWS

SB NEWS

SB NEWS

కర్నాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు : ఆధిక్యంలో కొనసాగుతోన్న కాంగ్రెస్‌

పోస్టల్‌ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ ఆధిక్యం 50 దాటింది. 8 గంటల 40 నిముషాల వరకు వచ్చిన ఫలితాలలో... కాంగ్రెస్‌ 54, బిజెపి 40, జెడిఎస్‌ 13, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 36 కేంద్రాల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు, వయో వృద్ధుల ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు.

కర్నాటక అసెంబ్లీ స్థానాలు 224, మ్యాజిగ్‌ ఫిగర్‌ 113, కాంగ్రెస్‌ అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు ఉండగా, జేడీఎస్సే మళ్లీ కింగ్‌ మేకర్‌ అంటూ జోరుగా చర్చ సాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో తొలుత ఆధిక్యంలో బిజెపి కొనసాగింది.. ఆ తరువాత కాంగ్రెస్‌ ఆధిక్యంలోకి వచ్చింది. జేడీఎస్‌ పుంజుకుంటోంది.

SB NEWS

SB NEWS

ఎంఐఎం ఒత్తిడితోనే జగిత్యాల ఎస్సై సస్పెండ్ .? : బండి సంజయ్

కరీంనగర్ జిల్లా

జగిత్యాల ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేయడం సభ్యసమాజం తలదించుకునే ఘటన అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ శుక్రవారం అన్నారు. ఈ ఘటనపై ఎలాంటి విచారణ చేయకుండానే ఎంఐఎం నేతల ఫోన్ ఆదేశాలతో ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. ఎస్సై అనిల్, ఆయన భార్య చేసిన తప్పేంటని ప్రశ్నించారు.

అనిల్ ను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సై దాడి చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఏ ఆధారాలతో ఎస్సైని సస్పెండ్ చేశారో చెప్పాలన్నారు. మానవత్వం లేకుండా ఎస్సైని సస్పెండ్ చేయడమే గాకుండా న్యూసెన్స్ కేసు పెట్టారని ధ్వజమెత్తారు.

పోలీస్ స్టేషన్ పై దాడికి వచ్చిన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఓ భర్తగా ఎస్సై తన భార్యను కాపాడుకోవడానికి మాట్లాడితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. వెంటనే ఎస్సై అనిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సైని సస్పెండ్ చేస్తే పోలీస్ సంఘాలు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రేపు జగిత్యాల బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. జగిత్యాల కొంత మంది సంఘవిద్రోహ శక్తులకు అడ్డగా మారిందన్నారు.

SB NEWS

అక్టోబర్ నవంబర్లోనే అసెంబ్లీ పోరు.. కర్ణాటక ఫలితాలపై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ!

శనివారం వెలువడనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో అప్పుడే వేడి పెంచేశాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడిన కర్ణాటకలో.. కాంగ్రెస్‌ స్వల్పంగా పైచేయి సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడటం, అదేమీకాదు బీజేపీ మెజార్టీ సాధిస్తుందన్న అభిప్రాయాలూ వినిపించడంపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ముఖ్యంగా అధికార భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో కర్ణాటక ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. నిజానికి ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌ నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగడంతో.. అక్కడ రాబోయే ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది.

కాంగ్రెస్, బీజేపీలలో ఏది గెలిచినా.. తెలంగాణలో ఏ తరహా వ్యూహాన్ని అమలు చేస్తాయన్న దానిపై బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ లెక్కలు వేస్తున్నట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాలను అనువుగా ఎలా మలుచుకోవాలనే వ్యూహాలను సిద్ధం చేయడంపైనా దృష్టి సారించినట్టు తెలిసింది.

బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు..

కర్ణాటకలో బీజేపీ అమలు చేసిన పలు విధానాలు, వ్యవహరించిన తీరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ బలమున్న బీజేపీ.. ప్రధానంగా హైదరాబాద్‌ నగరం, శివారు నియోజకవర్గాల్లో మాత్రమే కొంత బలంగా ఉందని అంచనా వేస్తోంది.

పట్టణ ప్రాంతాల్లో 8 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలు మినహా.. కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన పోటీదారుగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ సంస్థాగత నివేదికల ఆధారంగా భావిస్తున్నట్టు తెలిసింది.

కర్ణాటకలో బీజేపీకి మెజార్టీ వచ్చి నా.. మేజిక్‌ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి నా... అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డుతుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణలో దూకుడు పెంచుతుందని అభిప్రాయపడుతోంది. ఒకవేళ కర్ణాటకలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టకుంటే.. ఇక్కడ ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడం సులువు అవుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.

కాంగ్రెస్‌తోనే ప్రధాన పోటీ..

గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కాంగ్రెస్‌కు బలమైన కేడర్‌ ఉన్నట్టు ఆత్మీయ సమ్మేళనాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీ అధినేత కేసీఆర్‌కు సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నట్టు తెలిసింది. హైదరాబాద్, శివారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ సాధించే ఓట్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయని స్పష్టం చేసినట్టు సమాచారం.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు ఒక ఏడు శాతం తగ్గితే.. తాము గెలుపు కోసం శ్రమించాల్సి వస్తుందని ఓ ఎమ్మెల్యే వ్యా ఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. హుజూరాబాద్‌ తరహాలో గ్రేటర్‌ పరిధిలో కాంగ్రె స్‌ నామమాత్ర పోటీకి పరిమితమైతే ఇబ్బంది త ప్పవని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశము న్న వర్గాలపై ఫోకస్‌ పెట్టి.. బీఆర్‌ఎస్‌ వైపు తిప్పు కొనేలా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం

కెసిఆర్ ముఖ్య సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ కుమార్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్య సలహాదారుగా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ ఉదయం ఆయన కొత్త బాధ్యతలను చేపట్టారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో వుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయించారు. అయినప్పటికీ క్యాట్ ఉత్తర్వుల మేరకు ఆయన తెలంగాణలోనే కొనసాగారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే, ఆయనను తెలంగాణలో కొనసాగిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ సోమేశ్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది.

దీంతో సోమేశ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ జీఏడీలో రిపోర్ట్ చేశారు. అయితే సీఎస్ గా పని చేసిన ఆయన.. అంతకంటే తక్కువ పోస్టులో పని చేయడానికి ఇష్టపడలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన స్వచ్చంద పదవీ విరమణ చేశారు. తాజాగా ఆయనకు కేసీఆర్ తన ముఖ్య సలహాదారుడిగా బాధ్యతలను అప్పగించారు.

SB NEWS

SB NEWS