/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం..కరెంట్ కోతలు తప్పవా ! Yadagiri Goud
ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం..కరెంట్ కోతలు తప్పవా !

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులు ఎండలు మండిపోతుండటంతో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగింది..

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగడంతో.. సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభం అయింది.

దీంతో అందుబాటులోకి రెండు వేల మెగావాట్లు వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ వినియోగం తగ్గడంతో యూనిట్లను అండర్ రిజర్వ్ షట్ డౌన్ లో పెట్టింది NTPC.

ఇక ఇప్పుడు సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభించారు. ఏపీలో కరెంట్‌ కోతలు లేకుండా.. ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు.

ఇది ఇలా ఉంటే, నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణ, ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది..

SB NEWS

SB NEWS

శీర్షిక: దైవ స్వరూపాలు.

- శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి )

•ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

గుండెల్లో గుప్పెడంత బాధను దాచుకొని

చెదరని చిరునవ్వుల్తో ఆత్మీయతను

అలంకరించుకొని పున్నమి చంద్రుడి దుస్తులు ధరించి....

దావఖానల్లో ఉన్న రోగుల గొంతులో అమృతం పోసి బ్రతికించే దేవకన్యలు మీరు..!

నిరాశ నిస్పృహలతో మంచాన పడ్డ రోగులకు

మనోధైర్యాన్ని నింపి మామూలు మనిషిని చేసిన మనసున్న మహారాణులు మీరే..!

రోగులకు మీరు చేస్తున్న సేవాబంధం

అక్షర కుసుమాలతో అల్లుకున్న పద వాక్యాల బంధం

లాగా పుడమిపై వెలసిన కరుణా మాతృమూర్తులు మీరు..!

ఎల్లవేళలా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క నర్సుకు మనస్పూర్తిగా ధన్యవాదలు తెలుపుకుంటూ..

అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు.

- శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి )

9347042218

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

యాదాద్రి భువనగిరి జిల్లా.

SB NEWS

ఎవరిని బాధ్యులను చేద్దాం ❓️

తెలంగాణ రాష్ర్టానికి చెందిన పదవ తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి విడుదల చేశారు. ఫలితాల ప్రకారం రాష్ట్రంలో ఉత్తీర్ణత 86 .60 శాతం గా వచ్చింది. అంతేకాకుండా 2793 స్కూల్స్ లో పరీక్ష రాసిన మొత్తం విద్యార్థులు పాస్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిలో 1410 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, మిగిలినవి ప్రభుత్వ పాఠశాలలు. కాగా ఇక్కడ ఒక షాకింగ్ విషయం రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా

25 స్కూల్స్ లో కనీసం ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వకపోవడంపై పిల్లల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని కోల్పోతున్నాయి, ఉపాధ్యాయులు ఎప్పుడు జీతాలు, పి ఆర్ సి లు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు సెల్ ఫోన్లతో కాలక్షేపం మీద పెట్టిన శ్రద్ధ పిల్లల చదువుపై పెట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేదా? ఇప్పుడు ఈ సంఘటన సంచలనంగా మారింది. అయితే ఈ 25 స్కూల్స్ ఏ జిల్లాలో ఉన్నవి అన్నది తెలియాల్సి ఉంది.

ఈ పాఠశాలలలో ఒక్క విద్యార్హ్ది కూడా పాస్ అవ్వకపోవడం అంటే అక్కడ ఆన్న టీచర్స్ ఏమి చేస్తున్నారు ? ఆ జిల్లా విద్యాశాఖాధికారి ఏమిచేస్తున్నారు ? పర్యవేక్షణ లోపమా ఇలాంటి ఎన్నో సందేహాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచింపచేస్తున్నాయి, ఒక్కొక్క ఉపాధ్యాయులకు వేలు లక్షల్లో జీతాలు తీసుకున్న జీతాలకు సరైన న్యాయం చేస్తున్నారా? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి.

మీలో టీచర్ వృత్తికి ఎంతమంది న్యాయం చేయగలుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఘటనకు ఎవరిని బాధ్యులను చేద్దాం విద్యాశాఖ మంత్రి ని రాజీనామా చేయాలని డిమాండ్ చేద్దామా? లేక 25 స్కూల్లో టీచర్లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేద్దామా? దీనికి ఎవరు బాధ్యులను చేద్దాం.

పాఠశాలలో ప్రాథమిక విధి విద్యను ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా తన విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యేలా చూసుకోకపోతే ఆ పాఠశాలను నిర్వహించడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు నాణ్యమైన విద్యను అందించే టీచర్లను నియమించండి విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి.

మళ్లీ హంగ్‌ తప్పదా..?

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. తాజాగా వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూస్తే కాంగ్రెస్‌ పార్టీ ఈసారి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్లు వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

దీంతో కన్నడనాట మళ్లీ హంగ్‌ తప్పకపోవచ్చనే పరిస్థితి కనిపిస్తోంది. జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతుండటంతో ఎప్పటి మాదిరిగానే దేవేగౌడ పార్టీ కింగ్‌ మేకర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

SB NEWS

SB NEWS

SB NEWS

Cyclone Mocha: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం...అండమాన్ అప్రమత్తం

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలపడి వాయుగుండంగా మారనుంది.(Bay of Bengal) దీంతో అండమాన్ దీవుల్లో(Andaman) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక(alert) జారీ చేశారు.మత్స్యకారులు, చిన్న ఓడలు, పడవలు, ట్రాలర్ల నిర్వాహకులు ఆగ్నేయ, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలోకి చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు.మే 12వతేదీ ఉదయం వరకు అల్పపీడనం మొదట ఉత్తర వాయువ్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల వైపు కదులుతుందని అంచనా..

ఈ అల్పపీడనం బుధవారం తుఫానుగా మారుతుందని వాతావరణ కార్యాలయం తెలిపింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.ఈ అల్పపీడనం రానున్న 12 గంటల్లో మోచా తుఫానుగా(Cyclone Mocha) మారుతుందని, గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అండమాన్,నికోబార్ దీవుల్లో మంగళవారం నుంచి గురువారం వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది..

SB NEWS

SB NEWS

SB NEWS

Pawan Kalyan: కడియంలో పాడైన పంటలను పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌

కడియం: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పరామర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జనసేనానికి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు..

అనంతరం పవన్‌.. కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్‌ కల్యాణ్‌ అడిగి తెలుసుకున్నారు..

SB NEWS

SB NEWS

SB NEWS

Karnataka Elections: కొనసాగుతున్న పోలింగ్‌.. లైన్‌లో నిల్చుని ఓటేసిన కన్నడ ప్రముఖులు

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) పోలింగ్ బుధవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు..

ఓటేసిన ప్రముఖులు

తొలి గంటల్లో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, మైసూరు రాజమాత ప్రమోదా దేవి వడియార్‌, నటులు ప్రకాశ్‌రాజ్‌, ఉపేంద్ర, రమేశ్ అరవింద్‌, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దంపతులు, భాజపా ఎంపీ తేజస్వీ సూర్య తదితరులు తొలి గంటల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరంతా క్యూ లైన్లలో నిల్చుని తమ వంతు వచ్చేవరకు వేచి చూసి ఓటు వేశారు.

SB NEWS

SB NEWS

SB NEWS

విద్య.. వైద్యాన్ని జాతీయం చేయాలి : ఆర్ నారాయణ మూర్తి

‘‘పేపర్‌ లీకేజ్‌ వ్యవహారాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా జరిగాయి. ఇలాగైతే నిరుద్యోగులు ఏమైపోవాలి? అందుకే విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు ఆర్‌. నారాయణ మూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్‌పై ఆర్‌. నారాయణ మూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ నెల 26న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్‌. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘భారత దేశంలో చాలా చోట్ల పేపర్‌ లీకేజీలు జరుగుతున్నాయి.. దీన్ని జాతీయ సమస్యగా పరిగణించాలని ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు..

SB NEWS

SB NEWS

SB NEWS

కొండగట్టు అంజన్న చెంతకు కాళేశ్వరం నీళ్లు

జగిత్యాల జిల్లా : మహిమాన్విత క్షేత్రం, 400 ఏండ్ల చరిత్ర గల కొండగట్టు అంజన్న స్వామి చెంత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశనంలో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్సారెస్పీ వరదకాలువ నుంచి శాశ్వత నీటి వనరు కల్పించి, తద్వారా కాళేశ్వర జలాలను అంజన్న చెంతకు చేర్చి 365 రోజులు నీరు పుష్కలంగా అందుబాటులో ఉంచేందుకు కార్యాచరణను రూపొందించింది. తాజాగా రూ.13.45 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టింది. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది.

ముఖ్యమంత్రి దిశానిర్దేశం

కొండగట్టు క్షేత్రం గతంలో అభివృద్ధికి నోచుకోలేదు. దేవస్థానం పరిధిలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం, అలాగే అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌.. ఈ ఏడాది ఫిబ్రవరి 15న కొండగట్టులో స్వయంగా పర్యటించారు. దానికి ముందుగానే జగిత్యాలలో జరిగిన ఓ బహిరంగ సభలో కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కొండగట్టును సమూలంగా అభివృద్ధి చేసేందుకు దశల వారీగా రూ.వెయ్యి కోట్లయినా కేటాయిస్తామని అక్కడే ప్రకటించారు.

నీటి సమస్యకు శాశ్వత విముక్తి

దేవస్థానం పరిధిలో నీటి కొరత వెంటాడుతున్నది. పకడ్బందీ ప్రణాళికలు లేకపోవడం వల్ల కొండపై నిత్యావసరాలతో పాటు తాగునీటికి అవస్థలు ఏర్పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక.. మిషన్‌ భగీరథ కింద కొంత మేరకు పరిష్కారం చూపింది. అయితే భవిష్యత్‌లో నీటి కొరత పునరావృతం కాకుండా కొండగట్ట్టును ఆనుకొని ఉన్న ‘సంతలోని లొద్ది’కి వరద కాలువ నుంచి నీటిని పంపింగ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. ఇందుకోసం మల్యాల మండలం ముత్యాల గ్రామ శివారులోని వరదకాలువ 81 కిలోమీటర్‌ వద్ద ప్రత్యేకంగా పంపు హౌస్‌ నిర్మిస్తున్నారు.

అక్కడి నుంచి 1.7 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేసి ప్రెజర్‌ పంపు ద్వారా లొద్దికి పంపిస్తారు. ఇందుకోసం లొద్ది ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ప్రస్తుతం 358 ఉన్న ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంకు లెవల్‌) నుంచి 370కి పెంచుతున్నారు. పాత బండ్‌కు ఆనుకొని కొత్త బండ్‌ నిర్మిస్తున్నారు. వీటి ద్వారా ప్రస్తుతం 2.50 ఎంసీఎఫ్‌టీ ఉన్న లొద్ది సామర్థ్యం 13 ఎంసీఎఫ్‌టీకి పెరుగుతుంది. ఈ పనులన్నింటినీ ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సాయిల్‌ టెస్టింగ్‌ వంటి పలు పరీక్షల నిమిత్తం ఎన్‌ఐటీ వరంగల్‌కు పంపించారు. ఈ పనులు పూర్తయితే కొండగట్టు చెంతకు కాళేశ్వరం జలాలు వచ్చి నీటి సమస్యకు శాశ్వత విముక్తి కలుగనున్నది.

సీఎం దూరదృష్టికి నిదర్శనం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టి వల్లే కొండగట్టులో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతున్నది. కొండగట్టు క్షేత్రస్థాయి పర్యటన రోజే సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ ప్రకారంగానే పనులకు శ్రీకారం చుట్టారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత నీటి సమస్యే కాదు కొండగట్టును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అనుమతిచ్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.

ఆల్ సో మేష్ కుమార్

అంతా ఆయనొక్కడే

మూడు నెలల విరామంతో సీఎస్ సోమేశ్ కుమార్ మళ్లీ ప్రభుత్వంలోకి ఎంట్రీ అయ్యారు. సీఎస్‌గా పని చేస్తున్న సమయంలో జనవరి రెండోవారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీకి వెళ్లారు. అక్కడ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వీఆర్ఎస్ తీసుకున్నారు.

కాగా, సోమేశ్ కుమార్ మొదటి నుంచే సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడ్డారు. దీంతోనే కేడర్ విషయంలో న్యాయస్థానాల్లో కేసులున్నా, వాటన్నింటిని పక్కన పెట్టి సీఎం ఆయనకు సీఎస్ బాధ్యతలు అప్పగించారని చర్చ ఉన్నది. ఇప్పుడు ఏదైనా కీలక పోస్టు ఇస్తారనే హామీతోనే సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ వేదికపై సోమేశ్ ప్రత్యక్షం కావడంతో త్వరలో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తారని టాక్ నడిచింది.

కీలకం కానున్న సోమేశ్

సీఎం ముఖ్య సలహాదారుడిగా అపాయింట్ కావడంతో సర్కారులో మళ్లీ సోమేశ్ శకం వస్తుందనే ప్రచారం జరుగుతున్నది. ఆయన సీఎస్‌గా పనిచేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన కనసన్నల్లోనే జరిగేది. ఆయనకు తెలియకుండా ఏ సెక్రటరీ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు సీఎం చీఫ్ అడ్వయిజర్‌గా అపాయింట్ కావడంతో సీఎస్ ఆఫీసు, సీఎంఓ సెక్రటరీల పనితీరుపై ఎఫెక్ట్ పడుతుందేమోనని చర్చ జరుగుతున్నది.

అనధికారిక ప్రొటోకాల్ ప్రకారం సీఎస్ శాంతికుమారి, సీఎంఓ సెక్రటరీలు అందరూ ఇప్పటి నుంచే ఆయన గైడెన్స్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఫైల్‌ను సోమేశ్ కుమార్ పరిశీలించాకే, సీఎం సంతకం కోసం వెళ్లేవిధంగా ఏర్పాట్లు చేస్తారేమోనని టాక్ వినిపిస్తున్నది.

భిన్నాభిప్రాయాలు

సోమేశ్ నియామకంపై అధికారులు, మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు తీర్పుతో సోమేశ్ ఏపీకి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న కొందరు అధికారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. అయితే ఆయన నియామకాన్ని స్వాగతించే ఆఫీసర్లు, మంత్రులు కూడా ఉన్నారు. సోమేశ్ హయాంలో సీఎస్ ఆఫీసుకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఆయన సీఎస్‌గా ఉండి ఉంటే, సెక్రటేరియట్ ప్రారంభోత్సవంలో ఎంప్లాయీస్‌కు అవమానాలు జరిగేవి కావని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎంతటి కష్టమైన పనినైనా, ఎంతో దీక్షతో పూర్తి చేసేవారిని మంత్రులు కితాబిస్తున్నారు.