/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: మున్సిపల్ చైర్మన్ Miryala Kiran Kumar
పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: మున్సిపల్ చైర్మన్

NLG: పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని 17వ వార్డు పద్మానగర్ లో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ పట్టణాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. పట్టణాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమన్నారు….ఈ కార్యక్రమంలో *గాదె వివేక్ రెడ్డి, మద్ది దినేష్ యాదవ్,మూడ వేణు, వనం చంద్ర శేఖర్,మిర్యాల కిరణ్, దొంత రవి, పోషంగిరి, కైరంకొండ శివశంకర్, గంజి గణేష్, మూడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం... ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

NLG: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు. నల్గొండ పట్టణంలో వారి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేద బిడ్డ పెళ్లికి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు...ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, కౌన్సిలర్లు మరియు MPP, ZPTC, మండల అధ్యక్షులు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

నల్లగొండ 48 వార్డులో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్

 నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు పట్టణంలోని 48వ వార్డులో...

 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైన్ పనులను.. ప్రారంభించారు.

కెసిఆర్ గారి దత్తత నియోజకవర్గమైన నల్లగొండలో నియోజకవర్గ వ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని..

 పట్టణంలోని వివిధ వార్డుల్లో అంతర్గత రహదారులను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో.. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి స్థానిక కౌన్సిలర్ యామా కవిత దయాకర్, సింగల్ విండో చైర్మన్ ఆలకుంట నాగరత్నం రాజు సీనియర్ నాయకులు బకరం వెంకన్న.. తదితరులు వెంట ఉన్నారు.

నల్గొండలో ఇషా కంటి హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

మెరుగైన వైద్య సేవలు అందించాలి... ఎమ్మెల్యే కంచర్ల

నల్గొండ పట్టణ కేంద్రంలో బస్టాండ్ సమీపంలో గల ఇషా కంటి వైద్యశాలను నల్గొండ ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ..

పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో... వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేటలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపల్ ఉద్యోగిపై గొడ్డలితో దాడి

సూర్యాపేటలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపల్ ఉద్యోగిపై దాడి ఘటన చోటు చేసుకుంది. శనివారం జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపాలిటీ ఉద్యోగి బిక్షం పై అక్రమ నిర్మాణం చేపడుతున్న భద్రయ్య అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ మున్సిపాలిటీ ఉద్యోగిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు .

ఈ మేరకు సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగి బిక్షంను జిల్లా కలెక్టర్ వెంకట్రావు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, ప్రసాద్ ఉన్నారు.

నల్లగొండ ఆర్జాలబావి గోదాములను పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

 నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఆర్జాలబావి ధాన్యం గోదాములను... పరిశీలించారు..

 ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయిన. రాష్ట్రంలో పండిన పండిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని... ఇప్పటికే రాష్ట్రంలో నల్లగొండ జిల్లా..3.5 లక్షల మెట్రిక్ టన్నుల,ధాన్యాన్ని కొనుగోలు చేసి అగ్రస్థానంలో ఉందని,అందులో నల్లగొండ నియోజకవర్గం లో లక్ష మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సేకరించినదన్నారు.

రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకొని తాలు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ధాన్యం తడవకుండా రాశులను కప్పి ఉంచుకోవాలని, కోరారు.

 ఎప్పటికప్పుడు, కాంట ఐన ధాన్యాన్ని .. లారీలు ట్రాక్టర్లతో వెంట వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసి గోదాములకు తరలించాలని.. అధికారులను ఆదేశించారు..

 జిల్లా సివిల్ సప్లై అధికారి, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి అన్నెపర్తి సర్పంచ్ మేకల అరవింద్ రెడ్డి, రైస్ మిల్లుల యజమానులు కందుకూరు మహేందర్ కొండా లక్ష్మయ్య తదితరులు వెంట ఉన్నారు.

పోచంపల్లిలో చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత సమస్యలకు పరిష్కారానికై రెండు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా పాల్గొన్న నల్గొండ చేనేత కో కన్వీనర్

భూదాన్ పోచంపల్లిలో చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత సమస్యలకు పరిష్కారానికై రెండు రోజుల నిరాహార దీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా. ఈ యొక్క దీక్షకు మద్దతుగా , మరియు చేనేత కార్మికులకు అండగా భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలయ భాస్కర్ రాజుగారు, రాష్ట్ర ఓబిసి కార్యదర్శి నందనం దివాకర్ గాారు, మరియు రాష్ట్ర చేనేత సెల్ కన్వీనర్ శివకుమార్ గారు, కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర చేనేత కో కన్వీనర్ మిరియాల వెంకన్న గారు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ గారు, భువనగిరి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ గారు, పోచంపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు దోర్నాల సత్యం గారు, పోచంపల్లి మూడో వార్డు కౌన్సిలర్ సుర్కంటి జ్యోతి రంగారెడ్డి గారు, పార్టీ నాయకులు ఏల చంద్రశేఖర్ గారు,, పట్టణ ఉపాధ్యక్షులు ఏల శ్రీనివాస్ గారూ, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శేఖర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గంజి బసవలింగం గారు, కర్నాటి నరసింహ, చిటుకుల అంబదాసు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు వంగూరి సిద్దు, భారత బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

జన విజ్ఞాన వేదిక వార్షిక సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల

NLG: ఘనంగా జనవిజ్ఞాన వేదిక వార్షిక సభలు 

నల్లగొండ పట్టణ పరిధిలోని మనోరమ హోటల్లో జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర నాలుగో వార్షిక మహాసభలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు హాజరై, జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ విసి గోపాల్ రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

తాను నడవలేకున్నా... తన వారిని పోషించాలని!

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమది. నిలువ నీడలేదు. ఆ తల్లిదండ్రులు నలుగురు కుమార్తెలను కూలీనాలీ చేస్తూ పెంచారు. కానీ వరస విషాదాలు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రగాయాలైన ఆ దంపతులిద్దరూ మంచానికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఊత కర్రలే ఆసరాగా నడుస్తున్న పెద్ద కూతురే వారికి పెద్ద దిక్కయింది. కష్టపడి డిగ్రీ చదివినా ఉపాధి దొరక్క.. అమ్మానాన్నలను వదలి ఎక్కడికీ వెళ్లలేక.. వారికి సపర్యలు చేస్తూ ఆ యువతి బతుకీడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి..

ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేటకు చెందిన గుంజి రాంబాబు(60), లక్ష్మి (55) దంపతులకు నలుగురు కూతుళ్లు. భార్యభర్తలిద్దరూ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. పెద్ద కూతురు అంజమ్మ(35)కు చిన్నతనంలోనే పోలియో రావడంతో రెండు కాళ్లూ పనిచేయవు. డిగ్రీ వరకు ఎలాగో చదివిన ఆమె ఊత కర్రలమీదే నడుస్తోంది. చిన్న కుమార్తె మానసిక దివ్యాంగురాలు. కొద్ది సంత్సరాల క్రితం చనిపోయింది. మరో ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయగా కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. గతేడాది లారీ ఢీకొనడంతో రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే ఒక కాలు తొలగించారు. మరో కాలులో రాడ్లు వేశారు. దీనికితోడు పక్షవాతం రావడంతో ఆయన పూర్తిగా మంచానపడ్డారు. ఇది జరిగిన కొద్ది నెలలకే మరో రోడ్డు ప్రమాదం వారి జీవితాన్ని కకావికలం చేసింది. లక్ష్మి రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఆమె రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఊత కర్ర లేనిదే అడుగు వేయలేని పరిస్థితి. ఇప్పుడా తల్లిదండ్రుల భారమంతా పెద్ద కుమార్తెపై పడింది. తండ్రి, కూతుళ్లకు వస్తున్న దివ్యాంగుల పింఛన్లతోనే బతుకు వెళ్లదీస్తున్నారు. ఆ వచ్చే డబ్బులు ప్రతినెలా మందులకు కూడా సరిపోవడంలేదు. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న తనకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపాలని అంజమ్మ జిల్లా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అద్దె ఇంట్లోనే ఉంటున్న తమకు రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.

నల్గొండ ప్రజలు ఫోన్ పోగొట్టుకున్నట్లయితే ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసుకోండి: నల్గొండ ఎస్పీ కే అపూర్వరావు

నల్గొండ టూ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న యాభై ఫోన్లను CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) ద్వారా వెతికి బాధితులకు అందజేత.

 జిల్లా యస్.పి కె.అపూర్వ రావు IPS.

 మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ నందు పిర్యాదు చేసుకోండి.

 -www.ceir.gov.in పోర్టల్ పై ప్రత్యేక అవగాహన

  CEIR పోర్టల్ ద్వారా నల్లగొండ 2 టౌన్ పరిధిలో పోగొట్టుకున్న,చోరికి గురైన మొబైల్ ఫోన్లను ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో 50 మంది బాధితులకు జిల్లా యస్.పి గారు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ పోయిన లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR (Central Equipment Identity Register) అనే వెబ్ సైట్ లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లైతే అలాంటి మొబైల్స్ ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అని ఎస్పీ గారు తెలిపారు.ఈ పోర్టల్ నిర్వహణకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ల నందు అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగినది అన్నారు. ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పింస్తున్నమని తెలిపారు.