/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఇవాల్టి నుండి రికౌంటింగ్ వెరిఫికేషన్ అప్లికేషన్ Yadagiri Goud
ఇవాల్టి నుండి రికౌంటింగ్ వెరిఫికేషన్ అప్లికేషన్

ఇయ్యాల్టి నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అప్లికేషన్లు

జూన్ 4 నుంచి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు

 ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఫస్టియర్​లో 61.68% మంది, సెకండియర్​లో 63.49% మంది పాస్ అయ్యారు. పోయినేడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజీ తగ్గింది. గతేడాది సెకండియర్​లో 67.16 శాతం మంది పాస్ కాగా, ఈసారి 63.49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు.

ఫస్టియర్​లో పోయినేడు 63.32 శాతం మంది పాస్ కాగా, ఈసారి 61.68 శాతం పాస్ అయ్యారు. ఇక సర్కార్ కాలేజీల్లో దాదాపు సగం మంది స్టూడెంట్లు ఫెయిల్ అయ్యారు. సెకండియర్​లో మొత్తం 80,100 మంది పరీక్ష రాయగా 43,340 మంది మాత్రమే పాస్ అయ్యారు. పోయినేడాది సర్కారులో పాస్ పర్సంటేజీ 56.37 శాతం కాగా, అది ఈసారి 54 శాతానికి తగ్గింది. మంగళవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డులో సెక్రటరీ నవీన్ మిట్టల్​తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఎప్పటిలాగే ఈసారీ అమ్మాయిలు సత్తా చాటారు. సెకండియర్​లో మొత్తం 4,65,478 మంది పరీక్షలు రాయగా, వారిలో 2,95,550 (63.49%) మంది పాస్ అయ్యారు. అమ్మాయిలు 2,29,958 మంది రాయగా 1,64,598(71.57%) మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 2,35,520 మంది రాయగా 1,30,952 (55.60%) మంది పాస్ అయ్యారు. ఫస్టియర్​లో మొత్తం 4,82,675 మంది పరీక్షలు రాయగా.. 2,97,741 (61.68%) మంది పాస్ అయ్యారు. అమ్మాయిలు 2,41,673 మందికి గాను 1,65,994 (68.68%) మంది పాస్ కాగా.. అబ్బాయిలు 2,41,002 మందికి 1,31,747 (54.64%) మంది ఉత్తీర్ణత సాధించారు.

ములుగు టాప్..

సెకండియర్ జనరల్ కేటగిరీలో 85 శాతం పాస్ పర్సంటేజీతో ములుగు జిల్లా టాప్ లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో కుమ్రంభీమ్​ ఆసిఫాబాద్ (81 శాతం), మేడ్చల్ (75 శాతం) నిలిచాయి. చివరి స్థానాల్లో మెదక్ (52 శాతం), నాగర్ కర్నూల్ (54 శాతం), వరంగల్ (58 శాతం) ఉన్నాయి. ఒకేషనల్ కేటగిరీలో 85 శాతం పాస్ పర్సంటేజీతో నారాయణపేట జిల్లా టాప్ లో ఉండగా.. 52 శాతంతో జగిత్యాల చివరి స్థానంలో ఉంది. ఇక ఫస్టియర్ జనరల్ కేటగిరీలో 75 శాతం పాస్ పర్సంటేజీతో మేడ్చల్ జిల్లా టాప్ లో ఉండగా.. 73 శాతంతో రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మెదక్ (38 శాతం), నారాయణపేట (41 శాతం) చివరి స్థానాల్లో ఉన్నాయి.

గురుకులాలు ఫస్ట్..

ఇంటర్ ఫలితాల్లో గురుకులాలు సత్తాచాటాయి. ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే భారీగా పాస్ పర్సంటేజీ నమోదైంది. ప్రైవేటు కాలేజీల్లో సెకండియర్​లో 63 శాతం మంది పాస్ కాగా, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాల్లో 92 శాతం మంది పాస్ అయ్యారు. అయితే ఎయిడెడ్​ విద్యాసంస్థల్లో మాత్రం 46 శాతం మందే ఉత్తీర్ణత సాధించారు.

జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు: నవీన్ మిట్టల్

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్​కు బుధవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఈ నెల 16 వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్​కు రూ.100, రీవెరిఫికేషన్​ కు రూ.600 ఫీజు చెల్లించాలని చెప్పారు. విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకున్నోళ్లకు ఆన్సర్ బుక్ లెట్ జిరాక్స్ కాపీలు ఇస్తామని పేర్కొన్నారు. ఇక జూన్ 4 నుంచి 9 వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సప్లిమెంటరీకి కూడా బుధవారం నుంచే ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. మానసిక ఇబ్బందులుంటే హెల్ప్ లైన్ నంబర్ 14416కు కాల్ చేయాలని స్టూడెంట్లకు సూచించారు. జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు స్టార్ట్​ అవుతాయని, త్వరలోనే ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు.

ఆందోళన పడొద్దు: సబితా ఇంద్రారెడ్డి

ఫెయిల్ అయిన స్టూడెంట్లు ఆందోళన పడొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. వచ్చే నెల 4 నుంచి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఈసారి ఎంసెట్​లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించామని, కాబట్టి మార్కులతో ఇబ్బంది లేదన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలని సూచించారు. సర్కారు కాలేజీల్లో తక్కువ పాస్ పర్సంటేజీ నమోదైందని, గురుకులాలతో పోటీ పడాలన్నారు.

హైదరాబాదులో హెరిటేజ్ టవర్ కు కెసిఆర్ భూమి పూజ

మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవామండలి విరాళంతో నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మత మౌఢ్యం ప్రమాదకరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆలయం సామాజిక సాంత్వన కేంద్రమని వెల్లడించారు.

హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. నగరంలో హరేకృష్ణ ఆలయం నిర్మించడం మంచి పరిణామని చెప్పారు.

ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తామని ప్రకటించారు. విశ్వశాంతి కోసం మనం ప్రార్థన చేయాలని సూచించారు. మనశ్శాంతి కోసం ప్రస్తుతం చాలామంది మ్యూజిక్‌ థెరపీ తీసుకుంటున్నారని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని తెలిపారు. వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హరేకృష్ణ ఫౌండేషన్‌ అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేయడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

హైదరాబాద్‌లో ధనవంతులు కూడా రూ.5 భోజనం తింటున్నారని చెప్పారు. ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాలు నడుస్తాయన్నారు. కరోనా సమయంలో హరేకృష్ణ ఫౌండేషన్‌ ఎన్నో సేవలు అందించిందని కొనియాడారు. అన్ని ఆపద సమయాల్లో ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు.

Rajasthan: రాజస్థాన్‌లో కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం

జైపూర్ (రాజస్థాన్): ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం సోమవారం రాజస్థాన్‌ రాష్ట్రంలోని హనుమాన్ ఘడ్ జిల్లాలో కుప్పకూలిపోయింది.(Rajasthan)ఈ ప్రమాదం నుంచి ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమాన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు..

ఎయిర్ ఫోర్స్ విమానం కూలిన ప్ర్రాంతానికి ఆర్మీ హెలికాప్టర్(Indian Air Force MiG-21 aircraft) వచ్చి సహాయ చర్యలు చేపట్టింది. ఈ మిగ్ విమానం సూరత్ ఘడ్ నుంచి బయలుదేరి ప్రమాదానికి గురైంది.(crash) గత జనవరి నెలలో రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ లో రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ సుఖోయ్ 30 మిరాజ్ 2000 విమానాలు కూలిన ఘటనలో ఓ పైలట్ మరణించారు..

SB NEWS

SB NEWS

SB NEWS

తగ్గుతున్న కరోనా కేసులు.. తాజాగా నమోదైన కేసులు ఇవే !

డిల్లీ..

గడిచిన 24 గంటల్లో 1839 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్నటితో పోలిస్తే దాదాపుగా 540 కేసులు తగ్గాయి. ఇక గత 24 గంటల్లో కోలుకున్న వారిలో 3861 మంది ఉన్నారు..

మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ గా ఉన్న కేసుల సంఖ్యను చూస్తే 25178 ఉన్నాయి. ఇక ముందు ముందు కేసుల సంఖ్య పెరగకుండా చూసుకుంటే ప్రమాదం ఉండదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది..

SB NEWS

SB NEWS

SB NEWS

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి

రాయ్‌పూర్‌: చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళ సహా ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు..

భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు(ఐఈడీ), ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది.

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో కాల్పులు జరిగినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ శర్మ తెలిపారు. డీఆర్‌జీ పెట్రోలింగ్ బృందంపై నక్సలైట్లు కాల్పులు జరిపారని, ఆ తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులుజరిగాయని పేర్కొన్నారు.చెప్పారు.

జవాన్ల చేతిలో హతమౌన మావోయిస్టులను గుర్తించారు. రూ 8 లక్షల రివార్డ్ కలిగిన ఎస్‌ఓఎస్‌ కమాండర్ మావోయిస్ట్ మడ్కం ఎర్రతోపాటు మూడు లక్షల రివార్డ్ కలిగిన పొడియం భీమేగా గుర్తించారు..

SB NEWS

Nara Lokesh: తెదేపా అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్‌: నారా లోకేశ్‌

కర్నూలు: తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలులోని జిల్లా కోర్టు భవనం వద్దకు లోకేశ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయన్ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ తమది సీఎం జగన్‌ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్‌ కాదన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం స్పష్టం చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే బెంచ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. హైకోర్టు బెంచ్‌ హామీపై లోకేశ్‌కు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు.

SB NEWS

SB NEWS

Amaravati R5 Zone: ఆర్5 జోన్ లో పట్టాల పంపిణీకి రంగం సిద్ధం..

అమరావతి R5 జోనులో పేదలకు ఈ నెల 18 నాటికి ఇంటి పట్టా ఇచ్చేందుకు పని చేస్తున్నాం అన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లా నుంచి మొత్తం 20684 మంది లబ్ధిదారులు ఉన్నారు..

లబ్ధిదారులకు గతంలో ఇచ్చిన హామీ పత్రాలను మళ్లీ రీ సర్వే చేయించాం. రీ సర్వేలో అందుబాటులోకి రాని, చనిపోయిన వారిని పక్కన పెట్టాం. ఇలాంటి వాళ్ళు 5 వేల మందిలోపు ఉన్నారు. పట్టాల ప్రింటింగ్ కూడా పూర్తయింది. ఏ లే అవుట్ లో ఎవరు ఉన్నారో ఇప్పటికే గుర్తించాం అన్నారు కలెక్టర్ ఢిల్లీ రావు..

SB NEWS

SB NEWS

SB NEWS

బెల్లంపల్లి జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

సోమవారం రోజున రాష్ట్ర ఐ.టి., పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బెల్లంపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు పి.ఎస్. టు మినిస్టర్ కె.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ, వయవృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర రక్షణ, జైళ్ళు, అగ్నిమాపక శాఖ మంత్రి ఎండి. మహమూద్ అలీ, రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పర్యటిస్తారని తెలిపారు.

ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గం॥లకు కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి హెలికాప్టర్ ద్వారా చేరుకొని ఓరియంట్ సిమెంట్ విస్తరణ కొరకు శిలాఫలకం ఆవిష్కరిస్తారని, 11.45 గం||లకు బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఫుడ్ జోన్ ప్రాసెసింగ్ జోన్ను ప్రారంభిస్తారని,

మధ్యాహ్నం 12 గం||లకు బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన అర్బన్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తారని, 12.15 గం||లకు బెల్లంపల్లి కాలెక్స్లోని సనాతన అనలిటిక్స్, రిక్రూట్మెంట్ సర్వీసెస్, వాల్యు పిచ్ టెక్నాలజీస్ సంస్థలను సందర్శిస్తారని, 12.30 గం||లకు బెల్లంపల్లి పట్టణంలోని ఎ.ఎం.సి. మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తారని తెలిపారు.

SB NEWS

భద్రతా బలగాలకు తప్పిన పెను ముప్పు.. భారీస్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలకు పెనుముప్పు తప్పింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఓ వ్యక్తిని జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు..

అతని వద్ద అయిదు కేజీల పేలుడు పదార్థం(ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని బుద్గామ్‌లోని అరిగాం నివాసి అయిన ఇష్ఫాక్ అహ్మద్ వానీగా పోలీసులు గుర్తించారు. వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు..

భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించడంతో ఉగ్రవాదుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తర కశ్మీర్‌లో భద్రతా బలగాలు భద్రతను కట్టిదిట్టం చేశాయి. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు నిఘా కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు..

SB NEWS

SB NEWS

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం.. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కు.. : ఈడీ

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో రూ.2,000 కోట్ల మద్యం కుంభకోణాన్ని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) బయటపెట్టింది..

రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ కేసులో అన్వర్ దేబర్‌ను నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి కోర్టు ఆదేశించింది. అన్వర్ కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ నగర మేయర్ ఐజాజ్ దేబర్‌కు సోదరుడే.

ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సోదాల్లో కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని, ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నవారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది.

2019 నుంచి 2022 మధ్య కాలంలో దాదాపు రూ.2,000 కోట్ల మేరకు అవినీతి, మనీలాండరింగ్ జరిగినట్లు వెల్లడైంది. ఛత్తీస్‌గఢ్‌లో అన్వర్ దేబర్ నాయకత్వంలో వ్యవస్థీకృత క్రిమినల్ సిండికేట్ పని చేస్తోంది.

అన్వర్ సాధారణ ప్రైవేటు వ్యక్తి అయినప్పటికీ, అత్యున్నత స్థాయి రాజకీయ నేతలు, సీనియర్ బ్యూరోక్రాట్ల కోసం ఆయన పని చేశాడు. రాష్ట్రంలో విక్రయించే ప్రతి మద్యం సీసాకు చట్టవిరుద్ధంగా సొమ్మును వసూలు చేసే విస్తృత స్థాయి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు..