Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం.. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కు.. : ఈడీ
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో రూ.2,000 కోట్ల మద్యం కుంభకోణాన్ని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) బయటపెట్టింది..
రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ కేసులో అన్వర్ దేబర్‌ను నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి కోర్టు ఆదేశించింది. అన్వర్ కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ నగర మేయర్ ఐజాజ్ దేబర్‌కు సోదరుడే.
ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సోదాల్లో కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని, ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నవారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది.
2019 నుంచి 2022 మధ్య కాలంలో దాదాపు రూ.2,000 కోట్ల మేరకు అవినీతి, మనీలాండరింగ్ జరిగినట్లు వెల్లడైంది. ఛత్తీస్‌గఢ్‌లో అన్వర్ దేబర్ నాయకత్వంలో వ్యవస్థీకృత క్రిమినల్ సిండికేట్ పని చేస్తోంది.
అన్వర్ సాధారణ ప్రైవేటు వ్యక్తి అయినప్పటికీ, అత్యున్నత స్థాయి రాజకీయ నేతలు, సీనియర్ బ్యూరోక్రాట్ల కోసం ఆయన పని చేశాడు. రాష్ట్రంలో విక్రయించే ప్రతి మద్యం సీసాకు చట్టవిరుద్ధంగా సొమ్మును వసూలు చేసే విస్తృత స్థాయి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు..
May 07 2023, 18:48