/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz అంకెపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో 'తెలంగాణ భరోసా' సభకు బయలుదేరిన నాయకులు Mane Praveen
అంకెపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో 'తెలంగాణ భరోసా' సభకు బయలుదేరిన నాయకులు
నల్గొండ: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బెహన్ జీ కుమారి మాయావతి, నేడు సరూర్నగర్ లో నిర్వహిస్తున్నటువంటి "తెలంగాణ భరోసా" సభకు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా.. నల్లగొండ పట్టణం నుండి నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జి అంకెపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిప్పర్తి, కనగల్, నల్లగొండ కార్యకర్తలు భారీ బహిరంగ సభకు బయలుదేరారు.బీఎస్పీ జిల్లా ఇంఛార్జీ ఆదిమల్ల గోవర్ధన్, నియోజకవర్గ అధ్యక్షులు దున్న లింగస్వామి, ఎస్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుముల సురేష్, తదితరులు ఉన్నారు.
మర్రిగూడెం: పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన మండల సర్పంచ్ లు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో జూనియర్ పంచాయతి కార్యదర్శులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటికి 6వ రోజుకు చేరుకుంది. వీరి సమ్మెకు మండల సర్పంచ్ లు అందరూ దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఆ తరువాత అందరూ కలిసి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి రెగ్యులర్ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భము గా సర్పంచ్ లు మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ ల కృషి వల్లనే ఈరోజు తెలంగాణ కు జాతీయ అవార్డులు వచ్చినాయని JPS/OPS వెంటనే రెగ్యులర్ చేయాలని, 4 సంవత్సరాల ప్రోబేషన్ కాలాన్ని కూడా సర్వీసు గా పరిగణించాలని, వీరి డిమాండ్ల పరిష్కారం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ముందు కూడా తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో లెంకలపల్లి సర్పంచ్ మరియు సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పాక నగేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
రేపు కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే వివోఏ ల ధర్నాను విజయవంతం చేయాలి
మర్రిగూడ: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఐకెపి వివోఏ లు చేస్తున్న న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం చేపట్టాలని, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మర్రిగూడ లో మాట్లాడుతూ.. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాలో మండలం నుండి ప్రతి ఒక్క వివోఏ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నాగార్జున ప్రభుత్వం కళాశాలలో జాతీయ వెబినార్
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం మరియు బలానీ ఇన్ఫోటెక్, నోయిడా సౌజన్యంతో జాతీయ వేబినార్ “ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ మరియు పరిశోధన నైపుణ్యాలపై” గూగుల్ మీట్ ద్వారా  నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఘన శ్యామ్  తెలిపారు. ఈ నేషనల్ వేబీనార్ లో ముఖ్య వక్తగా డాక్టర్.నికిత వంజరి, అని ఇన్ఫోటెక్ సైన్స్ కమ్యూనికేటర్ మాట్లాడుతూ ..శాస్త్రీయ పరిశోధన వ్యాసాలు రాయడం ఉన్నత విద్యలో ఎంతో అవసరమని, అంతర్జాలం ద్వారా అధికారిక పరిశోధన సమాచారాన్ని వెతికే విధానం, రీసెర్చ్ రైటింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ , అకాడమిక్ రైటింగ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020, ఉన్నత విద్యలో పరిశోధన వ్యాసాలు రాయడం సంబంధించిన అంశాలను తెలిపారు. వేబినా ర్ కన్వీనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..  ఈ సదస్సులో దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి  అధ్యాపకులు, గ్రంథ పాలకులు, పరిశోధకులు, డిగ్రీ మరియు పీజీ చదువుతున్న విద్యార్థులు 600 మందికి పైగా నమోదు చేసుకొని వెబ్ నార్ కి హాజరైనారు అని వేబీనార్ కన్వీనర్ డాక్టర్. దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్  సయ్యద్ మునీర్, అంతటి శ్రీనివాసులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, అధ్యాపకులు యాదగిరి, దీపిక, యాదగిరి రెడ్డి, నాగుల వేణు, భాగ్యలక్ష్మి, కృష్ణ కౌండిన్య, లవెందర్ రెడ్డి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, మల్లేష్ , శివరాణి, విష్ణువర్ధన్, స్రవంతి, మణెమ్మ వేబినార్ కో-కన్వీనర్  గ్రంథాలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలుకు స్వాగతం పలికిన బీజేపీ నేతలు
నల్లగొండ: జిల్లా కేంద్రంకు అధికారిక కార్యక్రమానికి విచ్చేసిన జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహెజాది కు బుధవారం బిజెపి రాష్ట్ర  కార్యవర్గ సభ్యుడు వీరెళ్ళి చంద్రశేఖర్, బీజేపీ నాయకులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ నాయకులు బీజేపీ మహిళ మోర్చా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మైనార్టీ జిల్లా అధ్యక్షుడు
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన నల్లగొండ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు నజీర్ నల్గొండ: యునైటెడ్ ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు నజీర్, నల్గొండ జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలో వారు మాట్లాడుతూ.. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ, సామరస్యానికి, సహృద్భవానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అన్నారు. అల్లా దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని కోరుతున్నట్లు వారు తెలిపారు.
NLG: ఆనందంతో నిండిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కట్టంగూర్: మండలం లోని ఈదులూరు ఉన్నత పాఠశాలలో  1995-96 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 27 ఏళ్ల తర్వాత కలుసుకున్న వాళ్ళ ఆనందానికి  అవధులు లేవు. పూర్వ విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మణాచారి, యోగానందం, వెంకటరెడ్డి, భరత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మజీద్ బాబు, కలింగాచారి, నజీరుద్దీన్, ఆదిమూలం శ్రీనివాస్, గౌస్ యాబీ, పూర్వ విద్యార్థులు ముశం చంద్రశేఖర్, పున్న సోమయ్య, ఉడుతల శ్రీనివాస్ గౌడ్, కరుణ, కృష్ణవేణి, పార్వతమ్మ, ఆశకోలా సురేష్ , సిహెచ్ నాగరత్నం, తదితరులు పాల్గొన్నారు.
అవధులు లేని ఆశయంతో ముందుకు వెళుతున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ గ్రామ వాసి చిలివేరు వెంకటేష్, ఆకస్మాత్తుగా గుండె పోటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు,  తన ఫౌండేషన్ ద్వారా పదివేల రూపాయల ఆర్ధిక సహాయం అందించి పేద కుటుంబాన్ని ఆదుకున్నారు. బాధిత కుటుంబ ముగ్గురు పిల్లలను చూసి చలించి పోయిన ముత్తు, భవిష్యత్తులో వారికి ఎలాంటి సమయంలోనైనా  అండగా ఉంటానని హామీ ఇచ్చి ధైర్యం కల్పించారు.
దళిత రత్న అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న కు సన్మానం
HYD: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయంలో, మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా పలువురికి అవార్డులు ప్రధానం చేశారు. అందులో భాగంగా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన ఆల్ ఇండియా సమతా సైనిక్  దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న 'దళిత రత్న' అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా సమతా సైనిక్
దళ్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య మరియు స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో బుర్రి వెంకన్న ను శాలువతో ఘనంగా సన్మానించారు. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన 'ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్' లో పనిచేయడం తన అదృష్టమని, ఈ సంస్థను నల్లగొండ జిల్లాలో విస్తరింప చేయడానికి కృషి చేస్తూ, సామాజిక కార్యక్రమాలు చేసినందుకు ప్రభుత్వం గుర్తించి అవార్డు అందించినట్లు తెలిపారు.
మద్దిమడుగు బిక్షపతి కి దళిత రత్న అవార్డు
NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడు, దేవరకొండ నియోజకవర్గానికి చెందిన మద్దిమడుగు బిక్షపతి కి దళిత రత్న అవార్డు లభించింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ఆదివారం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ.. ఏఐఎస్ఎస్డి నాయకుడిగా గత 5 సంవత్సరాల నుండి దళిత సమస్యలపై, సామాజిక సమస్యలపై పోరాడి, ప్రజలకు అండగా నిలిచినందుకు, ప్రభుత్వం వారు గుర్తించి అవార్డును అందజేసినట్లు తెలిపారు. అవార్డుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.