/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png
ప్రకాశం ముండ్లమూరులో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ముండ్లమూరులో ఆదివారంనాడు ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి..
రెండు సెకన్ల పాటు భూమి కంపించింది..
భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇళ్లలో నుండి భయంతో పరుగులు తీశారు..
SB NEWS
SB NEWS
SB NEWS
SB NEWS
కొత్తగా 2380 కరోనా కేసులు నమోదు..
ఢిల్లీ..
ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..
గడిచిన 24 గంటల్లో దేశంలో 2380 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..
దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,49,69,630 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 27,212 కు చేరింది..
ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.06 శాతంగా ఉంది.ఇక దేశంలో 21 మంది చనిపోయారు..
SB NEWS
SB NEWS
సిద్దిపేట జిల్లాలో మంత్రుల పర్యటన
సిద్దిపేట జిల్లాలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఆదివారం పర్యటించారు. కొండపాక మండలం దుద్దేడ గ్రామ శివారులో నూతన పశువైద్య కళాశాల భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వారిద్దరూ పాల్గొననున్నారు.అంతేకాకుండా పలు పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
SB NEWS
SB NEWS
SB NEWS
SB NEWS
గూండాయిజం చేసినట్లు ప్రూవ్ చేస్తావా.. ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్
తాను గుండాయిజం చేసినట్లు ఆరోపణలు చేయడం కాదు.. ప్రూవ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు.
ఈ మేరకు పాడి కౌషిక్ రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసురుతున్నా.. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా?’ చెప్పాలని సవాల్ చేశారు. ఆరోపణలు చేయడం తగదని, తాను ఏం గూండాయిజం చేశానో చెప్పాలన్నారు. ‘‘నేను ఎవరినైనా కొట్టిన్నా? ఎవరినైనా తిట్టిన్నా? ఎవరి ల్యాండ్ అయిన కబ్జా చేసిన్నా? ఏం చేసినా? అని మండిపడ్డారు. తాను అక్కడ సెక్రటరీని తిట్టినట్లు ఒప్పుకున్నాడు.
ఎందకు తిట్టారంటే జూపాక విలేజ్‌లో మోరీ ప్రాబ్లం ఉందని ఒక ఐదారు సార్లు చెప్పిన.. పని చేయకపోతే ఏమంటారు? అని అన్నారు. పేద ప్రజలు, పేద మహిళలు అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పని చేయండని మంచిగా చెప్పాను అతను వినలేదన్నారు. వినకపోతే గట్టిగా చెప్పాలా వద్ద.. గట్టిగా చెప్పిన తర్వాతనే పరిష్కారం అయ్యిందన్నారు. సమస్య పరిష్కారం అవ్వడంతో నేడు జూపాక ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారని పేర్కొన్నారు.
SB NEWS
SB NEWS
జగిత్యాల జిల్లాలో మావోయిస్టుల లేఖల కలకలం
•పద్ధతి మార్చుకోకపోతే హతమారుస్తామంటూ హెచ్చరిక
బీర్పూర్ మండలంలో మావోయిస్టుల పేర వచ్చిన లేఖలు కలకలం రేపుతున్నాయి. మండలంలోని పలువురు ఎంపీటీసీలు సర్పంచ్ లతో పాటు మరి కొంతమంది ప్రజాప్రతినిధులను కలుపుకొని మొత్తం 28 మందికి లేఖలు అందినట్లు సమాచారం. మండలంలోని కొంత మంది నాయకులు అటవీ భూములను కబ్జా చేసి అమ్ముకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.
అలాంటి వారు ఇప్పటకైనా పద్ధతి మార్చుకోవాలని.. లేని పక్షంలో ప్రజా కోర్టులో హతమరుస్తామని ఆ లేఖ సారాంశం. జగ్దళ్ పూర్ జిల్లా ఏరియా కమిటీ అని ముద్రించి ఉన్న లెటర్ హెడ్స్ పై గోదావరి బెల్ట్ ఏరియా మావోయిస్టు కార్యదర్శి మల్లికార్జున్ పేరున లేఖలు వచ్చినట్లుగా తెలుస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రమే కాకుండా మండలంలోని ఓ ప్రభుత్వ అధికారికి కూడా లేఖ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
నక్సల్స్ కదలికలు ఏ మాత్రం లేని జగిత్యాల జిల్లాలో పలువురు నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరున వచ్చిన లేఖలు స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. లేఖలు నిజంగా మావోయిస్టులు రాశారా.. లేక ఎవరైనా ఆకతాయిల చేసిన పనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లేఖలు ఎక్కడ నుండి వచ్చాయని నిగ్గు తెల్చేందుకు పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
SB NEWS
SB NEWS
మాదాపూర్‌లో కార్డెన్ సెర్చ్.. భారీగా మద్యం బాటిళ్లు సీజ్
నగరంలోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మస్తాన్‌నగర్‌లో పోలీసులు శనివారం అర్ధరాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ శిల్పవళ్ళి నేతృత్వంలో అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీ లు, 11 సెర్చ్ పార్టీలు, దాదాపు 150 మంది పోలీసు సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు చేశారు.
తనిఖీలో భాగంగా నలుగురు పాత నేరస్తులను గుర్తించారు. అలాగే సరైన పత్రాలు లేని నాలుగు వెహికిల్స్, రెండు బెల్టు షాపులు గుర్తించి 400 కాటన్ల మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ శిల్పవళ్ళి మాట్లాడుతూ... మస్తాన్ నగర్‌లో 11 సెర్చ్ పార్టీలు, 5 కటాఫ్ పార్టీలతో తనిఖీలు చేశామని చెప్పారు. అనుమానితులను, వెహికిల్స్‌ను, షాపులలో సెర్చ్ చేసినట్లు తెలిపారు.
రెండు బెల్టు షాపులు, అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న షాపును, క్రాకర్స్ నిల్వ ఉంచిన షాపును గుర్తించామన్నారు. 400 కాటన్స్ మద్యం బాటిళ్ళు సీజ్ చేసినట్లు చెప్పారు. నలుగురు పాత నేరస్తులను గుర్తించి వారి పరిస్థితి తెలుసుకున్నామని డీసీపీ తెలిపారు..
SB NEWS
సీఎం ప్రయివేట్ సెక్రటరీ రిక్రూట్‌మెంట్ జీవో లీక్ చేసింది ఎవరు❓️
కేసీఆర్ సర్కారును ఎప్పడూ ఎదో ఓ టెన్షన్ వెంటాడుతూనే ఉంటున్నది. తాజాగా మహరాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేత శరద్ మర్కడ్‌ను కేసీఆర్ ప్రయివేట్ సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ జీవో జారీ చేశారు.
ఈ జీవోను ఆన్‌లైన్‌లో ఉంచకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకున్నది. కానీ రెండు రోజులకే ఆ కాపీ బయటకు రావడంతో ప్రగతిభవన్ వర్గాలు షాక్ తిన్నాయి. అది కాస్త ప్రతిపక్షాల చేతికి చిక్కడంతో వారి నుంచి విమర్శలు మొదలయ్యాయి. జాగ్రత్తలు పాటించినా జీవో కాపీ ఎలా బయటకు వచ్చిందనేది సస్పెన్స్‌గా మారింది. ఈ విషయం సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరి కాపీ ఎక్కడి నుంచి లీకైందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తెలంగాణ మహరాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేత శరద్ మర్కడ్‌ను సీఎం కేసీఆర్‌కు పర్సనల్ సెక్రటరీగా నియమించారు. ఆయనకు నెలకు రూ.లక్షన్నర వేతనం అదిస్తున్నట్టు ఈనెల 2వ తేదీన జోవో జారీ అయింది. ఆ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
జీవో కాపీని ఆన్‌లైన్‌లోనూ పెట్టలేదు. అంత వరకు బాగానే ఉన్నా.. రెండు రోజుల అనంతరం ఆ జీవో కాపీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతికి చేరింది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఆ జీవో కాపీని బయటపెట్టారు. దీంతో ప్రగతిభవన్ వర్గాలు ఒక్క సారిగా షాక్ అయినట్టు సమచారం. సీక్రెట్‌గా ఉంచిన జీవో కాపీ ఎలా బయటకు విషయంలో అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.
SB NEWS
ఈ నగరానికి ఏమైంది❓️
హైదరాబాద్: హైకోర్టు వద్ద అందరూ చూస్తుండగా ఓ యువకుడిని దారుణంగా పొడిచి చంపేశారు. రూ.10 వేల కోసం జరిగిన ఘర్షణలో ఈ హత్య జరిగింది. జవహర్‌నగర్‌లో మద్యంమత్తులో పడిపోయిన వ్యక్తి జేబులోని సెల్‌ఫోన్ కోసం అతడి గొంతు నులిమి చంపేశారు. మద్యం తాగేందుకు డబ్బుల కోసం ఈ హత్య జరిగింది. చిన్న చిన్న కారణాలకే నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నారు. వంద, వెయ్యి కోసం కూడా హత్య చేస్తున్న ఘటనలు నగరంలో చోటు చేసుకుంటున్నాయి. నాలుగేళ్లలో పోలీసుల డేటా పరిశీలిస్తే.. సగటున ప్రతి 36 గంటలకు ఓ హత్య.. రోజుకో హత్యాయత్నం జరుగుతోంది.
ఒకప్పుడు ఫ్యాక్షన్ పగలు, ప్రతీకారాలు, ముఠా తగాదాలు, గ్యాంగ్‌వార్‌లు, రియల్ ఎస్టేట్ దందాల వ్యవహారాల్లో హత్యలు జరిగినట్లు రికార్డుల్లో ఉండగా, ఇప్పుడు వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, అనుమానాలు, ఆర్థిక లావాదేవీలు..ఇలా రకరకాల కారణాలతో హత్యలు జరుగుతున్నాయి. ఎలాంటి నేరచరిత్ర లేని వారు కూడా హత్య చేయడానికి వెనకాడటం లేదు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో నాలుగేళ్లలో 980 హత్యలు, 1541 హత్యాయత్నాలు జరిగాయి. ఈ ఏడాది మూడు కమిషనరేట్లలో ఇప్పటి వరకు సుమారు 80 హత్యలు జరిగినట్లు సమాచారం.
కలకలం సృష్టించిన ఘటనలు
నగరం, శివారు ప్రాంతాల్లో 20 రోజుల్లో రెండు చోట్ల గోనె సంచుల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ మృతదేహం పహడీషరీఫ్ పరిధిలో లభ్యమైంది. షాద్‌నగర్ వద్ద బాలుడు గోనెసంచిలో మృతదేహంగా కనిపించాడు. వీరిని ఎక్కడో చంపి..పడేశారని పోలీస్ విచారణలో తేలింది.
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ట్రయాంగిల్ లవ్ వ్యవహారంలో బీటెక్ విద్యార్థి నవీన్‌ను అతని స్నేహితుడు హరిహర చంపేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
ఫోన్ చేయడం లేదని ఆగ్రహంతో ఊగిపోయిన భర్త చందానగర్ పీఎస్ పరిధిలో ఓ మాల్‌లో పని చేస్తున్న భార్య అంబికను హతమార్చాడు.
తండ్రికి ఇవ్వాల్సిన అప్పు అడుగుతున్నాడని ఆగ్రహంతో ఓ ట్రాన్స్‌జెండర్ 8 ఏళ్ళ బాలుడిని దారుణంగా చంపేశాడు.
స్నేహితుల మధ్య విభేదాలతో కుల్సుంపురా పీఎస్ పరిధిలో పట్టపగలు నడిరోడ్డుపై హతమార్చిన వీడియో వైరల్‌గా మారింది.
కౌకూర్‌లో పెయింటర్ హత్య కేసును జవహర్‌నగర్ పోలీసులు కేవలం 6 గంటల్లో ఛేదించారు. సెల్‌ఫోన్ కోసమే దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన పడకలూరు సురేశ్ (38) పెయింటర్. పని చేయగా వచ్చిన డబ్బులతో ఈ నెల 3న అతిగా మద్యం తాగాడు. కౌకూర్ పరిధిలోని పాడుబడిన ఇంటి వద్ద పడిపోయాడు. అదే కాలనీలో ఉంటున్న పెయింటర్లు మహారాష్ట్రకు చెందిన అజయ్ యువరాజ్, రాజు సైతం అతిగా మద్య తాగారు. సురేశ్ పడిపోయి ఉండటాన్ని గుర్తించారు. అతడి జేబులోని సెల్‌ఫోన్ అమ్మేసి మరింత మద్యం తాగాలని భావించారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ దొంగిలిస్తుండగా సురేశ్ వారిని గుర్తించాడు. తాము ఎక్కడ దొరికిపోతామో అని భావించి సురేశ్ గొంతును టవల్‌తో గట్టిగా నులిమి చంపేశారు. సెల్‌ఫోన్‌తో పాటు జేబులో ఉన్న రూ. 60 దొంగిలించారు. చనిపోయాడనుకున్న సురేశ్ కొద్దిగా కదిలినట్లు అనిపించడంతో పక్కనే ఉన్న గ్రనేట్ రాయిని ముఖంపై వేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేవలం 6 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో సీతారామ్ తెలిపారు.
సెల్‌ఫోన్ విషయంలో వివాదం ఒకరిపై హత్యాయత్నం
సెల్‌ఫోన్ విషయంలో తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. జీడిమెట్ల పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రామిరెడ్డినగర్‌కు చెందిన నీరుగొండ వెంకటే్‌షగౌడ్‌కు ముగ్గురు సంతానం. కుమార్తె, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు
విజయ్ అలియాస్ విక్కీ(25) చదువు మధ్యలోనే ఆపేసి జులాయిగా తిరుగుతున్నాడు. మద్యం తాగి, అందరితోనూ గొడవలు పెట్టుకుంటున్నాడు. తల్లిదండ్రులపై కూడా పలుమార్లు దాడులకు పాల్పడ్డాడు. గతంలో విజయ్‌పై అనేక కేసులు ఉన్నాయి. అతడికి స్థానిక యువకుడు లిల్లీ స్నేహితుడు. లిల్లీ కూడా అనేక కేసుల్లో ఉన్నాడు. ఇటీవలే బిహార్ వెళ్లొచ్చిన లిల్లీ.. విజయ్‌తో కలిసి మద్యం కొనుగోలు చేసి హెచ్‌ఎంటీ జంగల్ ప్రాంతానికి వెళ్లి తాగుతున్నారు. సెల్‌ఫోన్ విషయంలో గొడవ మొదలైంది. అది తీవ్రమై బండరాయి తీసుకుని విజయ్ తలపై లిల్లీ బలంగా కొట్టాడు. రక్తపుమడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విజయ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లిల్లీ పోలీ్‌సస్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది
ప్రియాంక గాంధీ బిజీ షెడ్యూల్
•5 గంటల్లోపే తిరిగి విమానాశ్రయానికి
యువ సంఘర్షణ పేరుతో ఈ నెల 8న సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న సభకు కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి తెలంగాణలో ఇది తొలి రాజకీయ సభ కావడంతో.. విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక.. ఆ రోజు తనకున్న టైట్ షెడ్యూల్‌లో అతి తక్కువ సమయం మాత్రమే కేటాయించగలిగారు. ఒక విధంగా ఆమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బెంగళూరు నుంచి సాయంత్రం 3.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రియాంకగాంధీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సరూర్‌నగర్ స్టేడియానికి సాయంత్రం 4 గంటలకు చేరుకోనున్నారు.
ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు. ప్రియాంక ప్రసంగం 20 నుంచి 25 నిమిషాలపాటు ఉంటుంది. ఆ వెంటనే ఆమె హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 5.30 గంటల ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకుంటారు.
మొత్తంగా సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంకగాంధీ 45 నుంచి 50 నిమిషాలపాటు గడపనున్నట్లు వెల్లడించాయి. ప్రియాంక సభ జరిగే 8న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ రోజుహైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఒకింత ఆందోళన నెలకొంది.
SB NEWS
May 07 2023, 14:00